ఈ స్నాక్ అంటే అందరికి ఇష్టమే, మాంచి టైం స్నాక్ ఇది. చేయడం చాలా తేలికె కాని కాస్త జాగ్రత్తగా చేస్తే చాలు. పర్ఫెక్ట్ స్వీట్ షాప్స్ లో లాగా వస్తుంది.

కావలసినవి:

 • ఉలవలు/ముడి ఎర్ర కందిపప్పు- 1 కప్(రాత్రంతా నానబెట్టినవి)
 • సెనగపిండి- ½ కప్
 • నూనె- వేయించడానికి
 • సాల్ట్
 • కారం- 1 tsp
 • జీలకర్ర పొడి- ½ tsp

విధానం:

Directions

0/0 steps made
 1. సెనగపిండి లో బియ్యం పిండి కాస్త ఉప్పు వేసుకుని నీళ్ళు పోసుకుని కాస్త జిగురు ఉండేలా చేతులకి పిండి అంటుకునే లా కలుపుకొండి. ఆ తరువాత 1 tbsp నూనె వేసి బాగా కలుపుకోండి
 2. ఇప్పుడు కారప్పూస గిద్ద లో నూనె రాసి సన్నటి రంధ్రాలున్న మౌల్ద్ పెట్టి సెనగపిండి ముద్ద పెట్టి, సలసల మరుగుతున్న నూనె లో వేసి 30 సెకన్లు ఉంచి తిరగ తిప్పి మరో 30 సెకన్లు ఫ్రై చేసి తీసి పక్కనుంచుకోండి
 3. ఇప్పుడు రాత్రంతా నానబెట్టిన కందిపప్పు/ఉలవలు నీరంతా వొంపి 30 నిమిషాలు ఆరబెట్టినవి సలసలా మరుగుతున్న నూనె లో కొద్దికొద్దిగా వేసి హై ఫ్లేం మీద క్రిస్పీ గా అయ్యేదాకా వేపుకోండి.
 4. ఇవి సరిగా వేగడానికి కాస్త టైం పడుతుంది, బాగా వేగితే గలగలా శబ్దం వస్తుంది అప్పుడు తీసి ఓ గిన్నె లో వేసుకోండి
 5. ఇప్పుడు వేడి మీదే ఫ్రై చేసుకున్న కారప్పూస నలుపుకుని వేసుకోండి అలాగే, కారం ఉప్పు, జీలకర్ర పోసి వేసి కలుపుకోండి

టిప్స్:

 • కారప్పూస వేడి వేడి నూనె లో వేపుకోవాలి అప్పుడే కరకరలాడుతూ వేస్తే. పిండి కూడా గట్టిగా కలిపితే గుల్లగా రావు
 • దీని చాల మంది ముడి ఎర్ర కందిపప్పు, ఉలవలు వాడతారు మీకు ఏది నచ్చితే అది వాడుకోండి. నేను ఉలవలు వాడను
 • ఉలవలు వేగడానికి చాలా టైం పడుతుంది, కాబట్టి కాస్త టైం తీసుకుని ఎర్రగా వేపుకోండి. ఇవి సరిగ్గా వేపకపోతే పైన క్రిస్పీగా ఉంటాయ్ లోపల మెత్తగా మిగిలిపోతే అని గుర్తుంచుకోండి.