Simple telugu curries

pudina-kobbari-pulav

పుదీనా కొబ్బరి పాల పులావ్

By Vismaifoods / June 8, 2020

“పుదీనా కొబ్బరి పాల పులావ్” ఈ పులావ్ కమ్మగా ఘుమఘుమలాదిపోతు తిన్నకొడ్డి తినిపించేలా ఉంటుంది. చేయడము చాలా తేలిక. ఇది ఎప్పుడైనా స్పెషల్ రోజుల్లో చాలా పర్ఫెక్ట్. మసాలాలు అవీ తెగ్గించుకుంటే లంచ్ బాక్సులకి కూడా చాలా బాగుంటుంది. దీనితో ఒక్క రైతా ఉంటె చాలు.

Read More
pappu charu

పప్పుచారు

By Vismaifoods / May 15, 2020

“పప్పుచారు” ఇది తెలుగు వారి ప్రేత్యేకమైన వంటకం. సరిగ్గా పెట్టలేగాని గ్లాసులతో తాగేయోచ్చు. చాలా సింపుల్ రెసిపీ. సాంబార్ కి మల్లె ఎక్కువెక్కువ సంబారాలు ఇందులో ఉండవు. వేసేవి నాలుగైదు పదార్దాలే కాని రుచి చాలా బాగుంటుంది.పప్పుచారు ప్రతీ ఇంట్లో చేసేదే, ప్రతే ఒక్కరికి నచ్చేదే! కానీ కాచే తీరు, పదార్ధాలు వేసే కొలతలోనే ఉంది రుచంతా. ఇది పూర్తిగా మా స్టైల్ పప్పు చారు. మేము ఇందులో ములక్కాడ ముక్కలు, ధనియాల పొడి కూడా వేస్తాము. […]

Read More
Thotakura majjiga

తోటకూర మజ్జిగ చారు

By Vismaifoods / April 29, 2020

“తోటకూర మజ్జిగ చారు” చాలా త్వరగా అయిపోయే కమ్మని రెసిపీ. ఇది నాకు చాలా ఇష్టం. ఎప్పుడూ చేసుకునే మజ్జిగ చారు/పులుసుకి బదులు ఇది చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.ఇది మా ఇంట్లో చాలా ఎక్కువగా చేస్తుంటాము. ఇది చేసిన రోజున ఓ వేపుడు, ఓ రోటి పచ్చడి చేస్తే చాలు. పరిపూర్ణమైన భోజనం అనిపిస్తుంది.సహజంగా మజ్జిగ పులుసులు మనకి తెలుసు చేస్తుంటాము, కాని ఇది ఆకూర రుచి తో ఎంతో బాగుంటుంది. ఇదే కాదండి […]

Read More
MANGO-PAPPU-1280x800

మామిడికాయ పప్పు

By Vismaifoods / March 16, 2020

“మామిడికాయ పప్పు” ఇది తెలుగు వారి ప్రేత్యేకమైన రెసిపీ. వేసవి కాలం లో దాదాపుగా అందరిళ్ళలో చేస్తూనే ఉంటారు. చాలా మందికి తెలిసిన రెసిపీనే. కానీ ఈ రెసిపీ నా పద్ధతిలో చాలా సులభంగా అయిపోతుంది. చాలా మందిపప్పు తో పులుపు ఉడకదని మామిడిని విడిగా ఉడికించి పప్పులో కలుపుతారు, ఆ పద్ధతి లోనూ చేయొచ్చు, కానీ ఈ పద్ధతి సులభంగా ఉంటుంది, కొన్ని కొలతలు మార్పు చేస్తే చాలు. పర్ఫెక్ట్ గా ఎంతో రుచిగా ఉంటుంది […]

Read More
egg-masala

గుడ్డు మసాలా కుర్మా

By Vismaifoods / March 13, 2020

“గుడ్డు మసాలా కుర్మా” ఇది చాలా కారంగా ఘాటుగా మజాలే మజాలే అన్నట్లే ఉంటుంది అట్టు, రోటీ, అన్నం తో. సహజంగా తెలుగు వారు గుడ్డు కూర అనగానే టమాటో లేదా చింతపండు పులుసు పోసి చేస్తారు. అది చాలా బాగుంటుంది, ఇది ఇంకా బాగుంటుంది. దీని చిక్కని కమ్మని గ్రేవీ తిన్న కొద్ది తినాల్నిపిస్తుంది. ఇదే గ్రేవీ తో మీరు ఆలూ, వంకాయ, కాప్సికం, దోసకాయ, సొరకాయ, గోరుచిక్కుడు ఇలా ఏవైనా చిన్న మార్పులతో చేసుకోవచ్చు.

Read More
ARATIKAYA-BEaLLAM-PULUSU

అరటికాయ బెల్లం పులుసు|పులుసు

By Vismaifoods / February 3, 2020

  “అరటికాయ బెల్లం పులుసు” ఇది అచ్చ తెలుగు వారి వంటకం. ఇది ఆంధ్రా లో చాలా ఫేమస్. ఎప్పుడూు చేసుకునే సాంబార్, పప్పుచారు కి బదులు ఇది ట్రై చేసి చుడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇది తియ్యాతియ్యగా కారంగా చాలా బాగుంటుంది. ఇది రైస్, ఇడ్లి, అట్టులోకి చాలా రుచిగా ఉంటుంది.సాధారణంగా పులుసులు ఇష్టపడని వారు కూడా ఈ పులుసుని ఇష్టంగా తింటారు. బెల్లం పులుపుని చక్కగా బాలెన్స్ చేస్తుంది.

Read More
VANGIBATH-CURRY

వాంగీ బాత్ ఫ్రై

By Vismaifoods / October 15, 2019

వాంగీ బాత్ ఫ్రై ఇది కర్ణాటక స్పెషల్! రోజూ చేసుకునే కూరాలకి ఇది పర్ఫెక్ట్. చాలా త్వరగా అయిపోవడమే కాదు చాలా మాంచి సువాసన, రుచి ఈ కూర. ఇది వేడి వేడి నేయ్యన్నం లోకి చాలా రుచిగా ఉంటుంది.

Read More
PACCHIMIRCHI-PAPPU

రాయలసీమ పచ్చిమిర్చి పప్పు

By Vismaifoods / September 3, 2019

రాయలసీమ పచ్చిమిర్చి పప్పు. పప్పు తెలుగు రాష్ట్రాల్లో అందరు చేస్తున్నా రాయలసీమ వారు చేసే తీరు కొంచెం భిన్నంగా ఉంటుంది, కాని రుచి మాత్రం చాలా గొప్పగా ఉంటుంది! ఈ పప్పు కారంగా, పుల్లగా చాలా బాగుంటుంది. ఇది మీకు చపాతీ, జొన్న రొట్టెలు, ఇంకా పుల్కాల్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది!

Read More
CHETTINAD-ALOO-FRY

చెట్టినాడు ఆలూ ఫ్రై

By Vismaifoods / July 26, 2019

చెట్టినాడు అనగానే ముందు అక్కడి వంటకాల ఘాటు గుర్తొస్తుంది. ఏది చేసిన ఓ పిసరన్న దాని ఘాటు మసాలాలు ఉండాల్సిందే! అందుకే తమిళనాడు వారితో పాటు యావత్ దేశం లో అందరు చెట్టినాడు వంటకాలకి అభిమానులుగా మారిపోయారు!ఈ ఆలూ వేపుడు కూడా చాలా రుచిగా కారంగా కరకరలాడుతూ భలేగా ఉంటుంది. ఇది వేడి వేడి నెయ్యన్నం లో లేదా చారు పప్పుచారుల్లోకి చాలా బాగుంటుంది.

Read More
Scroll to Top