అరటి దూట పెరుగు పచ్చడి
“అరటిదూట పెరుగు పచ్చడి” ఇది ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీ. అరటిదూట తో చేసే ఏ వంటకమైన వారంలో కనీసం ఓ రోజైనా తినడం ఎంతో మేలు చేస్తుంది శరీరానికి! అరటి దూటలో ఉండే పోషకాలు పీచు పదార్ధాలు శరీరం లోని మలినాలని పొగుడుతుంది, ఇంకా కిడ్నీలలో రాళ్ళున్నా, అసిడిటీ, కడుపు మంట, అరికాళ్ళ మంటలు, అతి వేడి, అమీబియాసిస్ ఇలాంటివి వాటికి ఏ మందు లేకుండా తరచూ అరటిదూటతో చేసే వంటకాలు తింటుంటే ఎంతో మేలు చేస్తుంది!ఈ అరటిదూట పెరుగు పచ్చడి చాలా సింపుల్. 5-10 నిమిషాల్లో తయారవుతుంది. ఇది రైస్, రోటీలు, ఇంకా సలాడ్ గా కూడా తినొచ్చు. దీన్ని ఉడికిన్చాల్సిన అవసరం లేదు.అరటిదూట ఈ మధ్య అందరికి అందుబాటులో ఉన్నా, వాడే వారు తగ్గిపోయారు ఎలా వాడుకోవాలో తెలియక. దీనితో కూరలు, పెరుగుపచ్చడులు, వడలు, పులుసులు ఇలా ఎన్నో చేసుకోవచ్చు.అరటిదూటని చక్రాలుగా కోసాక వచ్చే పీచుని వేలితో చుట్టి తీయాలి, సాధ్యమైనంత పీచు తీయగలిగితే తినేప్పుడు ఇబ్బంది తక్కువగా ఉంటుంది.ఆరటిదూటని ముక్కలుగా చేసి వెంటనే మజ్జిగ నీళ్ళలో లేదా బియ్యం కడుగు నీళ్ళలో వేసి ఉంచాలి లేదంటే నల్ల బడుతుంది.
Tips
అరటి దూటని ఉడికిన్చాల్సిన అవసరం లేదు.
ఇది సాలడ్ గా తీసుకోవచ్చు.
ఇది సాలడ్ గా తీసుకోవచ్చు.
Ingredients
- అరటి దూట- ఓ మూరెడు
- 4 పచ్చిమిర్చి
- ½ ఇంచ్ అల్లం
- ½ లీటర్ పెరుగు
- ఉప్పు- రుచి సరిపడా
తాలింపు:
- 1 tbsp నూనె
- ½ tbsp ఆవాలు
- ½ tbsp మెంతులు
- ½ tbsp మినపప్పు
- ½ tbsp జీలకర్ర
- 2 ఎండు మిర్చి
- 1 చిటికెడు ఇంగువ
- 1 రెబ్బ కరివేపాకు
Instructions
- అరటి దూట పై పెచ్చులని తీసేసి, సన్నని చక్రాలుగా కోయాలి, కోసిన ప్రతీ చక్రంతో పాటు పీచు వస్తుంది దాన్ని వేలితో చుట్టి తీసేయాలి. తరువాత సన్నని ఉల్లిపాయ తరుగులా తరుక్కోవాలి.
- తరుక్కున ముక్కలని 1/2 లీటర్ నీళ్ళలో 2 tsps పెరుగు వేసి బాగా కలుపుకున్న నీళ్ళలో వేసేయాలి. నీళ్ళలో వేసి కలుపుతుంటే కొంత పీచు తగులుతుంది దాన్ని తీసేయండి.
- మిక్సీ లో పచ్చిమిర్చి అల్లం వేసి ముద్దగా గ్రైండ్ చేసుకోండి.
- పెరుగులో ఉప్పు వేసి గడ్డలు లేకుండా బాగా చిలుక్కోండి.
- అరటిదూట ముక్కల్ని మజ్జిగలోంచి పిండి తీసి మరి గిన్నెలో వేసి కాసింత ఉప్పేసి పిండితే పసరు దిగుతుంది. దిగిన నీటిని పడేయండి.
- పిండుకున్న అరటిదూట ముక్కలని పెరుగు వేసి వెంటేనే కలిపేయండి.
- తాలిమ్పుకి నూనె వేడి చేసి అందులో ఆవాలు, మెంతులు వేసి ఎర్రగా వేపి, ఆ తరువాత జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువా కరివేపాకు వేసి ఎర్రగా వేపి పెరుగు పచ్చడి లో కలిపేసుకోవాలి.
Video