అరేబియన్ చికెన్ మందీ

google ads

అరేబియన్ చికెన్ మందీ

Author Vismai Food
Prep Time 15 minutes
Cuisine arabian, mughalai
Arabian chiken mandi
“చికెన్ మందీ” అందరికి ఎంత ఇష్టమైన అరేబియన్ రెసిపీ. ఈ మధ్య కాలం లో అందరికి ఫేవరేట్ గా మారిపోయింది, హైదరాబాదీ ధం బిర్యానీ తో పోటీ పడుతుంది. ఈ మందీ చూడడానికి హైదరాబాది చికెన్ దం బిర్యానీ లాగే అనిపిస్తుంది కాని, వండే తీరు, రుచి అన్నీ భిన్నంగా ఉంటాయి.
ఇది ఎక్కువ మసాలా దినుసులతో సువాసనలతో ఉంటుంది. హైదరాబాదీ బిర్యానీ కారం గా, ఘాటుగా ముఖ్యం తెలుగు వారికి నచ్చేలా ఉంటుంది. ఇంకా మందీ లో కారం వాడరు, ఘాటుగా ఉంటుంది.మందీ చికెన్ బిర్యానీ తో పాటు మటన్, ఫిష్, వెజ్ అన్నీ మందీలు ఉన్నాయ్. వేటికవే ప్రేత్యేకం.
ఇది చేయడం కొద్దిగా టైం తీసుకున్నా, తింటున్నప్పుడు ఆ కష్టమంతా మర్చిపోతారు.
మందీ తో సహజంగా సైడ్ డిష్ గా మంది చట్నీ ఒకటుంటుంది అది నేను త్వరలో పోస్ట్ చేస్తా. కానీ హైదరాబద్ లో మందీ తో “మిర్చి కా సాలన్” ఇస్తారు. ఆ రెసిపీ లింక్ కింద ఉంది చుడండి.
నచ్చితే ఉడికించిన గుడ్లు కూడా సర్వ్ చేసుకోవచ్చు.మందీలో కారం, పుదీనా, కొత్తిమీర ఏవీ వేయరు. నచ్చితే వేయించిన ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఆఖరున అంతే.
మందీ కి చికెన్ ని మధ్యకి కోసి దాన్ని రెండు ముక్కలు తీసుకోవాలి, అంటే రెండు పెద్ద పెద్ద ముక్కలు. చికెన్ లేతది అయితే చాలా రుచిగా ఉంటుంది, త్వరగా కుక్ అవుతుంది.
ఈ రెసిపీ లో మందీ మసాలా పౌడర్ కూడా ఉంచాను చుడండి.

Tips

అడుగు మందంగా ఉన్న గిన్నె లేకపోతే కచ్చితంగా మాడిపోతుంది
ఎండు ద్రాక్ష నచ్చకపోతే వదిలేయోచ్చు

Ingredients

మందీ మసాలా కోసం:

 • 1 tbsp ధనియాలు-
 • 1 tsp జీలకర్ర
 • 2 pinches జాజి కాయ ముక్క
 • 6 యాలకలు
 • 6 లవంగాలు
 • 1 నల్ల యాలకలు
 • 1. 1/2 inch దాల్చిన చెక్క
 • 1 tbsp నల్ల మిరియాలు

మందీ మసాలా పేస్టు కోసం:

 • మందీ మసాలా పొడి
 • 1 tsp ఉప్పు
 • 1/2 tsp సొంటి పొడి
 • 1/2 tsp చాట్ మసాలా
 • 1 tsp నిమ్మ రసం
 • 1 tbsp నూనె
 • 3 tbsp కుంకుమ పువ్వు నీళ్ళు (చిటికెడు కుంకుమ పువ్వు ని 3 tbsps వేడి నీళ్ళలో నాన్బెట్టినది)

మందీ రైస్ కోసం:

 • 1/2 kg చికెన్ (రెండు పెద్ద ముక్కలు)
 • 2 tbsp నెయ్యి
 • 1 tbsp నూనె
 • 2 tbsp ఉల్లిపాయ తరుగు
 • 1 tbsp అల్లం వెల్లూలి ముద్దా
 • 2.1/2 cups నీళ్ళు
 • 15 జీడిపప్పు
 • 15 బాదాం
 • 15 కిస్మిస్స్
 • 1 ఉప్పు
 • 1 cup బాస్మతి బియ్యం (185 gms)
 • 2.1/2 నీళ్ళు
 • 1.1/2 cups+ 2 tbsp చికెన్ స్టాక్

Instructions

 • మందీ మసాలా కోసం సిద్దం చేసుకున్న మసాలాలు మిక్సీ లో వేసి మెత్తని పొడి చేయండి
 • ఓ గిన్నె లో మందీ మసాలా పేస్టు కోసం ఉంచిన పదార్ధలన్నీ వేసుకుని మందీ మసాలా పొడి 1 tbsp పక్కనుంచి మొత్తం వేసుకోండి. అలాగే 1 tbsp కుంకుమ పువ్వు నీరుంచి మిగినది వేసి పేస్టు లా చేసుకోండి
 • ఇందులో చికెన్ కి గాట్లు పెట్టి 30 నిమిషాలు 1 tsp ఉప్పేసి నానబెట్టిన చికెన్ వేసి బాగా పేస్టు పట్టించండి
 • పేస్టు పట్టించి ఫ్రిజ్ లో 4 గంటలు ఉంచండి
 • 4 గంటల తరువాత 2.1/2 కప్స్ నీళ్ళు మరిగించి మరుగుతున్న నీళ్ళ పైన ఓ జల్లడ ఉంచి దాని మీద నానబెట్టిన చికెన్ ముక్కలు ఉంచి మూత పెట్టి హై-ఫ్లేం మీద 10 నిమిషాలు, లో-ఫ్లేం మీద 20 నిమిషాలు ఉడికించండి. (స్టీం బయటకు పోకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్)
 • 30 నిమిషాల తరువాత చికెన్ ని ఫోర్క్ తో గుచ్చి చూస్తే ఉడికింది లేనిది తెలుస్తుంది. ఉడికితే తీసి పక్కనుంచి, గిన్నెలో చికెన్ లోంచి దిగిన ఫ్లేవర్స్ తో స్టాక్ తయారవుతుంది అదీ పక్కనుంచండి.
 • ఇప్పుడు మరో పాన్ లో నూనె వేసి ఉడికిన చికెన్ ముక్కలు వేసి తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. ముక్కలు ఎర్రగా కాలాక దింపి పక్కనుంచుకోండి. (ఇదే ఓవెన్ లో అయితే 220 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేసి చికెన్ ని 20-25 నిమిషాలు గ్రిల్ చేసుకోండి)
 • ఇప్పుడు కచ్చితంగా అడుగు మందంగా ఉన్న గిన్నెలో మాత్రమే నెయ్యి కరిగించి అందులో బాదాం, జీడిపప్పు, కిస్మిస్స్ వేపి తీసి పక్కనుంచుకోండి.
 • అదే నెయ్యి లో సన్నని ఉల్లిపాయ తరుగు వేసి ఎర్రగా వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లూలి ముద్దా, ఉప్పు, మిగిలిన మందీ మసాలా పొడి వేసి వేపుకోవాలి.
 • ఇప్పుడు 1.1/2 కప్స్+ 2 tbsps స్టాక్ పోసి మరిగించాలి.
 • స్టాక్ మరుగుతున్నప్పుడు గంట పాటు నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి, అలాగే పక్కనుంచిన కుంకుమ పువ్వు నీళ్ళు కూడా వేసి కలిపి మూత పెట్టి 60% కుక్ చేసుకోవాలి. ( బాస్మతి బియ్యానికి కప్ కి 1.1/2 + 2 tbsps నీళ్ళు సరిపోతాయ్. 60% అంటే మెతుకు పట్టుకుంటే ఇంకాస్త పలుకుండాలి సగం పైన ఉడికుండాలి)
 • 60% ఉడికాక వేపుకున్న డ్రై ఫ్రూట్స్, వేపుకున్న చికెన్ పెట్టి పైన ఓ టిష్యూ పేపర్స్ వేసి కాసిని నీళ్ళు చిలకరించి, స్టీం బయటకు పోకుండా మూత పెట్టి 8 నిమిషాలు హై-ఫ్లేం మీద, 7 నిమిషాలు లో-ఫ్లేం మీద ధం చేసి 15 నిమిషాలు వదిలేయండి
 • 15 నిమిషాల తరువాత అడుగునుండి కలుపుకోవాలి
 • టిస్సు నాప్కిన్స్ కి బదులు గిన్నె అంచులకి మైదా పిండి ముద్దా ఉంచి గట్టిగా సీల్ చేసి కూడా ధం చేసుకోవచ్చు.

Video

అరేబియన్ చికెన్ మందీ

Course Main Course
Cuisine arabian, mughalai
Prep Time 15 minutes
Cook Time 45 minutes
4 hours
Servings 4
Author Vismai Food

Ingredients

మందీ మసాలా కోసం:

 • 1 tbsp ధనియాలు-
 • 1 tsp జీలకర్ర
 • 2 pinches జాజి కాయ ముక్క
 • 6 యాలకలు
 • 6 లవంగాలు
 • 1 నల్ల యాలకలు
 • 1. 1/2 inch దాల్చిన చెక్క
 • 1 tbsp నల్ల మిరియాలు

మందీ మసాలా పేస్టు కోసం:

 • మందీ మసాలా పొడి
 • 1 tsp ఉప్పు
 • 1/2 tsp సొంటి పొడి
 • 1/2 tsp చాట్ మసాలా
 • 1 tsp నిమ్మ రసం
 • 1 tbsp నూనె
 • 3 tbsp కుంకుమ పువ్వు నీళ్ళు చిటికెడు కుంకుమ పువ్వు ని 3 tbsps వేడి నీళ్ళలో నాన్బెట్టినది

మందీ రైస్ కోసం:

 • 1/2 kg చికెన్ రెండు పెద్ద ముక్కలు
 • 2 tbsp నెయ్యి
 • 1 tbsp నూనె
 • 2 tbsp ఉల్లిపాయ తరుగు
 • 1 tbsp అల్లం వెల్లూలి ముద్దా
 • 2.1/2 cups నీళ్ళు
 • 15 జీడిపప్పు
 • 15 బాదాం
 • 15 కిస్మిస్స్
 • 1 ఉప్పు
 • 1 cup బాస్మతి బియ్యం 185 gms
 • 2.1/2 నీళ్ళు
 • 1.1/2 cups+ 2 tbsp చికెన్ స్టాక్

Instructions

 • మందీ మసాలా కోసం సిద్దం చేసుకున్న మసాలాలు మిక్సీ లో వేసి మెత్తని పొడి చేయండి
 • ఓ గిన్నె లో మందీ మసాలా పేస్టు కోసం ఉంచిన పదార్ధలన్నీ వేసుకుని మందీ మసాలా పొడి 1 tbsp పక్కనుంచి మొత్తం వేసుకోండి. అలాగే 1 tbsp కుంకుమ పువ్వు నీరుంచి మిగినది వేసి పేస్టు లా చేసుకోండి
 • ఇందులో చికెన్ కి గాట్లు పెట్టి 30 నిమిషాలు 1 tsp ఉప్పేసి నానబెట్టిన చికెన్ వేసి బాగా పేస్టు పట్టించండి
 • పేస్టు పట్టించి ఫ్రిజ్ లో 4 గంటలు ఉంచండి
 • 4 గంటల తరువాత 2.1/2 కప్స్ నీళ్ళు మరిగించి మరుగుతున్న నీళ్ళ పైన ఓ జల్లడ ఉంచి దాని మీద నానబెట్టిన చికెన్ ముక్కలు ఉంచి మూత పెట్టి హై-ఫ్లేం మీద 10 నిమిషాలు, లో-ఫ్లేం మీద 20 నిమిషాలు ఉడికించండి. (స్టీం బయటకు పోకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్)
 • 30 నిమిషాల తరువాత చికెన్ ని ఫోర్క్ తో గుచ్చి చూస్తే ఉడికింది లేనిది తెలుస్తుంది. ఉడికితే తీసి పక్కనుంచి, గిన్నెలో చికెన్ లోంచి దిగిన ఫ్లేవర్స్ తో స్టాక్ తయారవుతుంది అదీ పక్కనుంచండి.
 • ఇప్పుడు మరో పాన్ లో నూనె వేసి ఉడికిన చికెన్ ముక్కలు వేసి తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. ముక్కలు ఎర్రగా కాలాక దింపి పక్కనుంచుకోండి. (ఇదే ఓవెన్ లో అయితే 220 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేసి చికెన్ ని 20-25 నిమిషాలు గ్రిల్ చేసుకోండి)
 • ఇప్పుడు కచ్చితంగా అడుగు మందంగా ఉన్న గిన్నెలో మాత్రమే నెయ్యి కరిగించి అందులో బాదాం, జీడిపప్పు, కిస్మిస్స్ వేపి తీసి పక్కనుంచుకోండి.
 • అదే నెయ్యి లో సన్నని ఉల్లిపాయ తరుగు వేసి ఎర్రగా వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లూలి ముద్దా, ఉప్పు, మిగిలిన మందీ మసాలా పొడి వేసి వేపుకోవాలి.
 • ఇప్పుడు 1.1/2 కప్స్+ 2 tbsps స్టాక్ పోసి మరిగించాలి.
 • స్టాక్ మరుగుతున్నప్పుడు గంట పాటు నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి, అలాగే పక్కనుంచిన కుంకుమ పువ్వు నీళ్ళు కూడా వేసి కలిపి మూత పెట్టి 60% కుక్ చేసుకోవాలి. ( బాస్మతి బియ్యానికి కప్ కి 1.1/2 + 2 tbsps నీళ్ళు సరిపోతాయ్. 60% అంటే మెతుకు పట్టుకుంటే ఇంకాస్త పలుకుండాలి సగం పైన ఉడికుండాలి)
 • 60% ఉడికాక వేపుకున్న డ్రై ఫ్రూట్స్, వేపుకున్న చికెన్ పెట్టి పైన ఓ టిష్యూ పేపర్స్ వేసి కాసిని నీళ్ళు చిలకరించి, స్టీం బయటకు పోకుండా మూత పెట్టి 8 నిమిషాలు హై-ఫ్లేం మీద, 7 నిమిషాలు లో-ఫ్లేం మీద ధం చేసి 15 నిమిషాలు వదిలేయండి
 • 15 నిమిషాల తరువాత అడుగునుండి కలుపుకోవాలి
 • టిస్సు నాప్కిన్స్ కి బదులు గిన్నె అంచులకి మైదా పిండి ముద్దా ఉంచి గట్టిగా సీల్ చేసి కూడా ధం చేసుకోవచ్చు.

Tips

అడుగు మందంగా ఉన్న గిన్నె లేకపోతే కచ్చితంగా మాడిపోతుంది
ఎండు ద్రాక్ష నచ్చకపోతే వదిలేయోచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top