“ఆరెంజ్ పాప్సికల్స్” ప్రతీ ఒక్కరికి ఈ పుల్ల ఐస్ తో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ముడివేసుకుని ఉంటాయ్. అలాంటి పుల్ ఐసు ఇంట్లోనే అందరికి అందుబాటులో ఉండే పదార్ధాలతో చేసుకోవచ్చు. ఎలాంటి కెమికల్స్ లేని పుల్ల ఐస్ ఇది. చాలా రుచిగా ఉంటుంది, పర్ఫెక్ట్ గా వస్తుంది.

కావలసినవి:

  • ఆరెంజ్ జూస్- 400 ml
  • పంచదార- 1/3 కప్
  • నిమ్మరసం- 2 tsps
  • ఆరెంజ్ తోనల్లో ఉండే బల్బ్స్

విధానం:

Directions

0/0 steps made
  1. ఆరెంజ్ జూస్ లో మిగిలిన పదార్ధాలన్నీ వేసి పంచదార కరిగించండి
  2. పంచదార కరిగాక మౌల్డ్స్ లో కొద్దిగా ఆరెంజ్ బల్బ్స్ వేసి ఆరెంజ్ జూస్ ఫిల్ చేసి మూత పెట్టి ఫ్రీజర్ లో రాత్రంతా ఉంచండి.
  3. తరువాతి రోజు నీళ్ళలో మౌల్డ్ 10-15 సెకన్లు ఉంచితే సులభంగా వచ్చేస్తాయ్!!!

టిప్స్:

  • జూస్ పులుపుని ని బట్టి పంచదార కలుపుకోవాలి
  • బటర్ లేకపోతే నెయ్యి కూడా వాడుకోవచ్చు
  • మౌల్డ్స్ లేకపోతే టీ గ్లాస్ లో పోసి పైన అల్యుమీనియం ఫాయిల్ తో సీల్ చేసి పై నుండి ఓ పుల్ల గుచ్చి కూడా చేసుకోవచ్చు.