ఆలూ కుర్కురే…పర్ఫెక్ట్ క్రంచీ ఆలూ ఫ్రైస్ ఇవి. తినడం స్టార్ట్ చేస్తే తింటూనే ఉంటారు. ఓ సారి చేసుకుని డబ్బాలో ఉంచుకుంటే కనీసం వారం పాటు నిలవుంటాయ్. పప్పన్నం, చారన్నం లోకి, పెరుగన్నం లోకి

చాలా రుచిగా ఉంటాయి. అసలు టైం పాస్ కి ఓ న్యాయం చేయాలంటే దేన్నీ మించిన స్నాక్ మరొకటి ఉంటుందా. చాన్స్ లేదు!!! అంత బాగుంటాయ్! ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ రెసిపీ గారంటీ జాగ్రత్తగా టిప్స్ ఫాలో అయితే!

కావలసినవి:

 • బంగాళా దుంపలు- 1 కిలో
 • నూనె వేయించడానికి

కోటింగ్ కి:

 • బియ్యం పిండి- 2 tsps
 • కార్న్ ఫ్లోర్- 2 tsps
 • సాల్ట్
 • కారం- 1 tbsp(సగం ఫ్రై అయ్యాక చల్లుకోండి)
 • చాట్ మసాలా- 1 tsp(సగం ఫ్రై అయ్యాక చల్లుకోండి)
 • మిరియాల పొడి- ½ tsp
 • పచ్చిమిర్చి తరుగు- 1
 • కొత్తిమీర తరుగు- 2 tsps

విధానం:

Directions

0/0 steps made
 1. బాగా గట్టిగా పెద్దగా ఉన్న దుమ్ప్లని కడిగి చెక్కు తీసి ఉప్పు నీటి లో 15 నిమిషాలు నానబెట్టుకోండి
 2. తరువాత వీటిని మందంగా చక్రాల్లా కత్తితో కట్ చేసుకోండి, ఆ తరువాత కట్ చేసుకున్న ముక్కలని ఓ దాని మీద మరొకటి పెట్టి చిన్న చిన్న పొడుగు స్త్రిప్స్ గా కట్ చేసుకోండి.
 3. కట్ చేసుకున్న ముక్కలని నీళ్ళలో వేసి 3-4 సార్లు బాగా కడగండి, తరువాత వడకట్టుకోండి
 4. ఇప్పుడు వడకట్టుకున్న ఆలూ ని బోల్ లో వేసుకుని దాంట్లో కోటింగ్ సామానంతా వేసి బాగా కోట్ చేసుకోండి
 5. ఇప్పుడు నూనె ని గోరు వెచ్చగా అయ్యేదాకా వేడి చేసుకోండి, ఆ తరువాత ఆలూ వేసి హై ఫ్లేం మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి.
 6. వేసి 2-3 నిమిషాలు వదిలేసి ఆ తరువాత కలుపుతూ క్రిస్పీ గా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి
 7. లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసి దాని మీద మరో ½ చెంచా కారం, చాట్ మసాలా తో బాగా టాస్ చేసుకోండి. పూర్తిగా చల్లారాక డబ్బాలో పెట్టుకోండి

టిప్స్:

 • ఆలూ బాగా తాజా గా గట్టిగా ఉన్న వాటిని మాత్రమే వాడుకోండి, ఉప్పు నీటి లో నానబెట్టడం వల్ల కుర్కురే కరకరలాడుతూ వస్తాయ్
 • ఆలూ ముక్కలని ఓ తీరుగా సమాంతరంగా కట్ చేసుకోండి, ముక్కలు హెచ్చు తగ్గులుంటే ఒక్కోటి ఒక్కో తీరులో వేగుతాయ్.
 • నూనె గోరువెచ్చగా ఉండాలి, ఆలూ ముక్కలు వేసి హై –ఫ్లేం మీద ఫ్రై చేసుకోండి. దీని వల్ల నూనె లో ఉడికి పర్ఫెక్ట్ గా వేగుతాయ్ నూనె వేడెక్కుతున్న కొద్ది.
 • వేడి మీదే మిగిలిన ఉప్పు కారం చల్లుకోండి