“ఆవకాయ పులిహోర” ఇది ఆంధ్రుల ప్రేత్యేకమైన వంటకం. కారం కారం గా తలిమ్పుల గుబాళింపుతో ఎంతో రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంతో, లేదా అన్నం మిగిలిపోయినా ఇది చేసుకోవచ్చు. అసలు దీని ముందు మనం రోజూ తినే ఇడ్లి, అట్టు లాంటి టిఫిన్స్ పనికిరావంతే!!! తింటే కడుపు నిండడం కాదు మనసు నిండిపోతుంది. ఈ వంటకం ప్రేత్యేకించి గోదావరి జిల్లాల్లో చాల ఫేమస్!!!

కావలసినవి:

 • నూనె- ¼ కప్
 • వేరు సెనగపప్పు- ¼ కప్
 • ఆవాలు- 1 tsp
 • పచ్చి సెనగపప్పు- 1 tbsp
 • మినపప్పు – 1 tbsp
 • వెల్లులి- 5 దంచినవి
 • పచ్చిమిర్చి చీలికలు – 2
 • ఇంగువ- 2 చిటికెళ్ళు
 • కరివేపాకు- 2 రెబ్బలు
 • కొత్తీమ్ర తరుగు కాడలతో సహా- 1 కట్ట
 • పసుపు- ¼ చెంచా
 • ఉప్పు
 • టమాటో- 1
 • మామిడికాయ పచ్చడి- 1/2 కప్
 • బియ్యం- 1 కప్ పొడి పొడిగా ఉడికించుకున్నది(250 gms)
 • నెయ్యి- 1 tbsp

విధానం:

Directions

0/0 steps made
 1. నూనె వేడి చేసుకుని ముందుగా వేరుసెనగ పప్పు, ఆవాలు వేసి ఆవాలు చిటపటమనగానే, మినప్పప్పు, సెనగపప్పు, కరివేపాకు, వెల్లూలి వేసి ఎర్రగా వేపుకోండి
 2. ఇప్పుడు టమేటా తరుగు, పచ్చి మిర్చి చీలికలు వేసి మూత పెట్టి టొమాటోలు మెత్తగా మగ్గేదాక మీడియం-ఫ్లేం, మీద మగ్గించుకోండి
 3. టొమాటోలు మెత్తగా మగ్గాక, కొద్దిగా సాల్ట్, ఆవకాయపచ్చడి, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకుని, ఉడికిన్చుకున్న అన్నం వేసి బాగా కలుపుకొండి. దింపే ముందు నెయ్యి వేసి కలుపుకుని దిమ్పెసుకోండి

టిప్స్:

 • దీనికి తాలింపు ఎక్కువగా ఉంటేనే రుచి, తలిమ్పులో మామూలు మినపప్పు కంటే పొట్టు మినపప్పు మరింత రుచిగా ఉంటుంది
 • సాల్ట్ చాల కొద్దిగా వేసుకోండి ఎందుకంటె ఆవకాయ పచ్చడి లో ఉప్పు ఉంటుంది