ఓట్స్ గుంటపునుకులు…ఇవి చాలా రుచిగా ఉంటాయ్, ఎంతో ఆరోగ్యం కూడా. పైగా ఇవి 30 నిమిషాల్లో తయారవుతాయ్. పిల్లలకి స్నాక్స్ గా, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ గా కూడా ఇవి బాగుంటాయ్. మాములు గుంట పునుకుల కంటే ఇవి ఎంతో రుచిగా ఉంటాయ్.

కావలసినవి:

 • ఓట్స్- కప్
 • బియ్యం పిండి- ¼ కప్
 • బొంబాయి రవ్వ- 2 tbsps
 • పెరుగు- ౩/4 కప్
 • అల్లం- ½ tsp
 • పచ్చిమిర్చి- 1 తరుగు
 • జీలకర్ర- ½ tsp
 • సాల్ట్
 • సోడా- ½ tsp
 • కొత్తిమీర- 2 tbsps
 • కారట్ తురుము- ½ కప్
 • ఉల్లిపాయ తరుగు- ½ కప్
 • నీళ్ళు- తగినన్ని

తలిమ్పుకి:

 • నూనె- 1 tbsp
 • ఆవాలు- ½ tsp
 • మినపప్పు- ½ tsp

విధానం:

Directions

0/0 steps made
 1. ఓట్స్ ని లో ఫ్లేం మీద బాగా క్రిస్పీ గా అయ్యేదాకా లో ఫ్లేం మీద రోస్ట్ చేసుకుని, చలార్చుకుని పొడి చేసుకోండి
 2. ఇప్పుడు పెరుగుని బాగా చిలుకున్ని ఓట్స్ పొడి తో పాటు మిగిలిన సామానంతా వేసి బాగా కలుపుకోండి
 3. ఇప్పుడు నూనె వేడి చేసి తాలింపు సామానంతా వేసి, వేపి పిండి లో కలిపి 30 నిమిషాలు పిండి ని నానా బెట్టండి
 4. ఇప్పుడు గుంట పునుకుల చట్టి లో ¼ tsp నూనె వేసి పిండి ని గుంటలో ముప్పావు భాగం వరకే పిండి నింపి మూత పెట్టి లో-ఫ్లేం మీద ఎర్రగా కాల్చుకోండి
 5. ఓ సైడ్ కాలాక మరో పక్క తిప్పి కాల్చుకోండి. ఇవి వేడి వేడి గా అల్లం పచ్చడి తో ఎంతో రుచిగా ఉంటాయ్, కొబ్బరి పచ్చడి కంటే కూడా.

టిప్స్:

 • ఇవి మామూలు గుంట పునుకుల మాదిరి త్వరగా కాలవు, కాబట్టి లో-ఫ్లేం మీద నిదానంగా కాల్చుకోవాలి. లేదంటే లోపల పిండి గా ఉండిపోతుంది.