మజ్జిగ గారెలు దీన్నే కొందరు చల్ల గారెలు, అటుకుల గారెలు అని కూడా అంటారు! ఇవి కేవలం 10 నిమిషాల్లో తయారైపోతాయ్. పండుగలప్పుడు పెద్దగా టైం పట్టని ప్రసాదంగా ఇది సరిగ్గా సరిపోతుంది. ఇవి మామూలు మినపగారెలా కంటే చాలా రుచిగా కరకరలాడుతూ ఉంటాయ్! ఈ గారెలు ఎక్కువ సేపు కరకరలాడుతూ ఉండడం విశేషం!

కావలసినవి:

 • అటుకులు- 2 కప్స్
 • పుల్లని పెరుగు- 1 కప్
 • పచ్చిమిర్చి తరుగు- 2 tsps
 • అల్లం తరుగు- 1 tsp
 • ఇంగువ- ¼ చెంచా
 • జీలకర్ర- 1 tsp
 • ఉప్పు
 • కొత్తిమీర తరుగు- 2 tsps
 • నూనె వేపుకోడానికి సరిపడా

విధానం:

Directions

0/0 steps made
 1. అటుకులు మునిగేంత వరకు నీళ్ళు పోసి 5 నిమిషాలు నాననివ్వండి
 2. 5 నిమిషాల తరువాత అటుకులలోంచి నీరు గట్టిగా పిండి అటుకులని ఓ బౌల్ లో వేసుకోండి
 3. ఇప్పుడు అటుకులలో ఉప్పు, సాల్ట్, జీలకర్ర, ఇంగువా, కొత్తిమీర తరుగు, పుల్లటి పెరుగు వేసి గట్టిగా అటుకులని పిండుతూ మెత్తగా అయ్యేదాకా కలుపుకొండి
 4. ఇప్పుడు చేతులు తడి చేసి చిన్న పిండి ముద్దని గారెల మాదిరి తట్టుకుని వేడి వేడి నూనె లో వేసి మీడియం ఫ్లేం మీద ఎర్రగా క్రిస్పీగా వేపుకోండి
 5. ఇవి మామూలు మినపగారెల కంటే కూడా వేగడానికి ఎక్కువ టైం పడుతుంది
 6. మాంచి గోల్డెన్ కలర్ లోకి రాగానే తీసి పక్కనుంచుకోండి

టిప్స్:

 • మందం అటుకులు మాత్రమే వాడుకోండి పల్చటివి దీనికి పనికి రావు
 • నచ్చితే ఉల్లి తరుగు కూడా వేసుకోవచ్చు
 • దీనికి పుల్లటి పెరుగు అయితేనే రుచి
 • పిండి మరీ గట్టిగా కలిపితే వడలు చెక్కలు లా గట్టిగా వస్తాయ్, జారైతే నూనె బాగా పీల్చేస్తాయ్