చికెన్ పులావ్ అనగానే చాలా మంది అదో పెద్ద పని అనుకుంటారు, కాని కొన్ని టిప్స్ మార్పులు చేస్తే చాలా త్వరగా పెద్ద పని లేకుండా పర్ఫెక్ట్ గా చికెన్ పులావ్ చేసెయ్యొచ్చు. మా టిప్స్ తో చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది పులావ్. అందరికి నచ్చేస్తుంది. వీకెండ్స్, ఫంక్షన్స్ కి హ్యాపీ గా చేసేసుకోవచ్చు.

కావలసినవి:

 • చికెన్- ½ కిలో
 • బాసుమతి బియ్యం- 250 gms(1 కప్)
 • పెరుగు- ¼ కప్
 • ఉల్లిపాయలు- 1
 • టమాటో- 1
 • పుదినా తరుగు- 2 tsps
 • కొత్తిమీర తరుగు- 2 tsps
 • కారం- 1 tsp
 • ఉప్పు
 • పసుపు- ½ tsp
 • అల్లం వెల్లులి పేస్టు- 1 tbsp
 • లవంగాలు-5
 • యాలకలు- 4
 • దాల్చిన చెక్క- 1 ఇంచ్
 • బిరియాని ఆకు- 1
 • షాజీర- 1 tsp
 • గరం మసాలా- 1/2 tsp
 • ధనియాల పొడి- 1 tsp
 • వేయించిన జీలకర్ర పొడి- 1 tsp
 • నీళ్ళు- 2 కప్స్
 • నూనె- ౩ tbsps

విధానం:

Directions

0/0 steps made
 1. కుక్క ర్లో నూనె వేడి చేసి అందులో లవంగాలు, చెక్క, యాలకలు, షాజీర, బిరియాని ఆకు వేసి మంచి సువాసనోచ్చేదాక వేపుకోండి
 2. ఇప్పుడు ఉల్లిపాయ చీలికలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి
 3. మంచి కలర్ వచ్చాక అప్పుడు అల్లం వెల్లూలి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మసలాల్ని బాగా వేపుకోండి
 4. ఇప్పుడ టమాటో ముక్కలు వేసి టమాటో మెత్తగా గుజ్జుగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి
 5. ఇప్పుడు గంటపాటు ఉప్పు వేసిన నీళ్ళలో నానబెట్టిన చికెన్ వేసి బాగా కలిపి 4-5 నిమిషాలు పాటు హై ఫ్లేం మీద ఫ్రై చేసుకోండి
 6. ఇప్పుడు గంట పాటు నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి బాగా కలిపి 2 కప్స్ నీళ్ళు పోసి, చిలికిన పెరుగు, పుదినా తరుగు, కొత్తిమీర తరుగు వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి హై-ఫ్లేం మీద 2 విసిల్స్ హై ఫ్లేం మీద రానివ్వండి, ఆ తరువాత స్టవ్ ఆపేసి 30 నిమిషాలు వదిలేయండి
 7. 30 నిమిషాల తరువాత అడుగునుండి కలుపుకొండి. అంతే పర్ఫెక్ట్ చికెన్ పులావ్ రెడీ

టిప్స్:

 • చికెన్ ఉప్పు నీళ్ళలో నానబెట్టడం వల్ల చికెన్ మెత్తబడుతుంది, జుసీ గా ఉంటుంది.
 • ఉప్పు లో నానా బెట్టిన చికెన్ వాడడం వల్ల ఉప్పు ఎక్కువగా అపట్టాడు కాబట్టి ఉప్పు పులావ్ లో తగ్గించి వేసుకోండి
 • బాసుమతి బియ్యం సంవత్సరం కంటే పాతవి వాడుకుంటే పర్ఫెక్ట్ గా పొడి పొడిగా వస్తుంది లేదంటే ముద్దవుతుంది పులావ్