రొయ్యల పులావ్ ఇది చాలా ఈసీ గా పర్ఫెక్ట్ గా చేసేయొచ్చు! రొయ్యల పులావ లోనే చాలా రకాలు పద్ధాతుల్లున్నాయ్. ఇది చాలా ఈసీ గా చేసుకోగలిగే విధానం! అసలు వనత రాణి వారు కూడా సులభంగా చేసేయొచ్చు!

కావలసినవి:

  • రొయ్యలు- 250 gms
  • బాసుమతి రైస్- 220 gms( 1 కప్) ఉప్పేసి ఉడికించి చల్లార బెట్టినది
  • నూనె- ¼ కప్
  • నెయ్యి- 1 tbsp
  • ఉల్లిపాయ – 1 (చీలికలు)
  • పచ్చిమిర్చి- 4
  • కొత్తిమీర- 2 tbsps
  • పుదినా తరుగు- 2 tbsps
  • అల్లం వెల్లూలి పేస్టు- 1 tbsp
  • కారం- 1.5 tbsps
  • పసుపు- ½ tsp
  • గరం మసాలా- 1 tsp

విధానం:

Directions

0/0 steps made
  1. నూనె వేడి చేసి అందులో పసుపు వేసి, ఆ తరువాత పచ్చి రొయ్యలు వేసి మీడియం ఫ్లేం మీద రొయ్యల్లోని నీరు ఇగిరి నూనె పైకి తేలేదాకా వేపుకుని ఓ బౌల్ లోకి తీసుకోండి.
  2. ఇప్పుడు అదే మూకుడు లో మరో 2 tsps నూనె వేసి ఉల్లిపాయ చీలికలు వేసి ఎర్రగా వేపుకోండి
  3. ఉల్లిపాయలు సగం పైన వేగాక అప్పుడు పచ్చిమిర్చి చీలికలు వేసి ఎర్రగా వేపుకోండి
  4. ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుండగా అప్పుడు అల్లం వెల్లులి ముద్ద వేసి వేపి కారం, ఉప్పు, గరం మసాలా వేసి బాగా వేపుకోండి
  5. ఇప్పుడు రొయ్యలు వేసి బాగా మరో 3 నిమిషాలు వేపుకుని పొడి పొడిగా ఉడికిన్చుకున్న అన్నం వేసి బాగా కలిపి, పైన కొత్తిమీరా, పుదినా తరుగు నెయ్యి వేసి బాగా కలిపి దింపి రైతా తో సర్వ్ చేసుకోండి

టిప్స్:

  • రొయ్యలని మరీ ఎర్రగా కరకరలాడేట్టు వేపుకోకండి