అటుకుల రవ్వ కేసరి…ఇది ఉడుపి ప్రాంతం లో శ్రీ కృష్ణుడికి నివేదిస్తుంటారు! ఇది చేయడం చాలా తేలిక ! ప్రసాదం గా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా తీపి తినాలనిపిస్తే ఇది 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు!!!

కావలసినవి:

 • మందపాటి అటుకులు- 1 కప్
 • నీళ్ళు- 2 కప్స్
 • పంచదార- 3/4-1 కప్
 • నెయ్యి- ౩ tbsps
 • జీడిపప్పు- 3 tbsps
 • కిస్మిస్స్- 2 tsps
 • యలకలపొడి- ½ tsp
 • పచ్చకర్పూరం- చిటికెడు
 • కేసర్ కలర్- 1 చిటికెడు

విధానం:

Directions

0/0 steps made
 1. మనదపాటి అటుకులని కరకరలాడేట్టు లో-ఫ్లేం మీద వేపుకోండి, ఆ తరువాత మిక్సీ వేసి రవ్వ గా చేసుకోండి
 2. ఇప్పుడు నెయ్యి కరిగించి అందులో జీడిపప్పు, కిస్మిస్స్ వేసి ఎర్ర గా వేపి తీసి పక్కనుంచుకోండి
 3. ఇప్పుడు నీళ్ళు పోసి మరిగించుకోండి
 4. నీళ్ళు మరుగుతున్నప్పుడు అటుకుల రవ్వ వేసి మెత్తగా ఉడికించుకోండి
 5. రవ్వ ఉడికాక అప్పుడు పంచదార వేసి పంచదార కరిగి కేసరి దగ్గర పడేదాకా కలుపుతూ కుక్ చేసుకోండి
 6. దింపే ముందు చిటికెడు కలర్, జీడిపప్పు కిస్మిస్స్, యలకల పొడి వేసి బాగా కలుపుకుని చిటికెడు పచ్చకర్పూరం వేసి కలిపి దిమ్పెసుకోండి

టిప్స్:

 • పల్చటి అటుకులు వాడితే మిక్సీ వేసాక పోడైపోతుంది అందుకే మందపాటి అటుకులు మాతరమే వాడుకోండి
 • కలర్ అన్నది ఆప్షనల్
 • పంచదార తీపి తినే వారు కప్ వేసుకోండి లేదనుకుంటే ¾ పంచదార వేసుకోండి.