“ఉల్లిపాయ కుర్మా” ఇది పూరి, చపాతీ, రోటీ, అట్టులోకి మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఇది నేను కోయంబత్తూర్ లో ఓ తెలుగు వారి ఇంట్లో తిన్నాను. చాలా నచ్చింది. అప్పటి నుండి మా ఇంట్లో వారానికి ఓ సారైనా చేస్తూనే ఉంటాము. చేయడం కూడా చాలా తేలిక, చాలా తక్కువ టైం లో అయిపోతుంది.

కావలసినవి:


 • సాంబార్ ఉల్లిపాయలు- ½ కిలో
 • వెల్లూలి- 6-7
 • కరివేపాకు- 2 రెబ్బలు
 • కొత్తిమీర- 2 tsps
 • ఆవాలు- ½ tsp
 • ఇంగువ- చిటికెడు
 • నూనె- ౩ tbsps
 • చింతపండు పులుసు- 50ml

మసాలా పేస్టు కోసం:


 • పచ్చి కొబ్బరి తురుము- ½ కప్
 • ధనియాలు- 1 tsp
 • జీలకర్ర- ½ tsp
 • ఎండుమిర్చి- 5
 • మిరియాలు- 1 tsp
 • సోంపు- 3/4 tsp
 • ఉప్పు
 • కారం- 1 tsp
 • పసుపు- ¼ tsp
 • నీళ్ళు- 150 ml

విధానం:

Directions

0/0 steps made
 1. పచ్చికొబ్బరిని పొడి పొడి గా అయ్యేదాకా లో-ఫ్లేం మీద రోస్ట్ చేసుకోండి, ఆ తరువాత చల్లార్చండి
 2. ఇప్పుడు అదే పాన్ లో ధనియాలు, జీలకర్ర, సోంపు, ఎండు మిర్చి, మిరియాలు వేసి ఎర్రగా వేపి కొబ్బరితో పాటు నీళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి
 3. ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసి అందులో ఇంగువా, ఆవాలు కరివేపాకు వేసి వేపుకోండి
 4. ఇప్పుడు ఉల్లిపాయలు, వెల్లూలి వేసి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి, ఆ ఆతరువాత కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఉల్లిపాయలు మెత్తబడేదాక మూతపెట్టి మీడియం ఫ్లేం మీద మగ్గనివ్వాలి.
 5. ఆ తరువాత మసాలా పేస్టు, చింతపండు పులుసు, నీళ్ళు పోసి బాగా కలిపి నూనె పైకి తేలేదాకా లో-ఫ్లేం మీద ఉడకనివ్వండి.
 6. నూనె పైకి తేలాక, ఉప్పు కారాలు రుచి చూసి కొత్తిమీర చల్లి దిమ్పెసేయ్యండి

టిప్స్:

 • సాంబార్ ఉల్లిపాయలు లేకపోతే మామూలు ఉల్లిపాయలే వాడుకోవచ్చు
 • చింతపండు పులుసు చాలా కొద్దిగా వాడాలి.