ఎగ్లెస్ టూటి ఫ్రూటి కప్ కేక్స్
ఎగ్ లేకుండా చేసే కప్ కేక్స్. ఇవి చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా తక్కువ సామాగ్రి తో దాదాపుగా ప్రతీ ఇంట్లో ఉండే పదార్ధాలతో చేసుకోవచ్చు. ఈ కప్ కేక్స్ మీకు సరిగ్గా బేకరీ స్టైల్ లో వస్తాయి. చాలా సాఫ్ట్ గా జూసీ గా ఉంటాయి.ఈ కేక్ లో నేను కప్ లేకపోతే ఎలా చేయాలి, ఇంకా కుక్కర్ లో ఎలా చేయాలి లాంటి వివరాలన్నీ వివరంగా ఉంచాను. దీన్ని మీరు కప్స్ లోనే కాదు కేక్ గా కూడా బేక్ చేసుకోవచ్చు.గమనిక: (నేను వీడియో లో ఉన్న కొలతలకి డబుల్ చేశాను కొలతలు)
Tips
పైనాపిల్ ఎసెన్స్ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. కానీ చాలా కొద్దిగా వేసుకోవాలి
Ingredients
- 1 cup మైదా
- ½ cup పంచదార
- 1 tbsp బేకింగ్ సోడా
- 1 tbsp వెనీలా ఎసెన్స్
- 5-6 బొట్లు పైనాపిల్ ఎసెన్స్
- ½ cup పాలు
- 3 tbsp పెరుగు
- 3 tbsp టూటి ఫ్రూటి
- 1.5 tbsp వెనిగర్
- ¼ cup నూనె
Instructions
- పంచదార, పెరుగు, నూనె వేసి పంచదార కరిగి క్రీం లా అయ్యేదాకా బాగా బీట్ చేయాలి విస్కర్ తో
- తరువాత వెనీలా, పైనాపిల్ ఎసెన్స్ వెనిగర్ వేసి బీట్ చేసి బౌల్ పైన ఓ జల్లెడలో మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, టూటి ఫ్రూటి వేసి జల్లించాలి, జల్లించగా మిగిలిన టూటి ఫ్రూటి పక్కనుంచండి
- జల్లించిన పిండిని ఒకే వైపు బాగా బీట్ చేసుకోవాలి (రివర్స్ లో అంటే వ్యతిరేకంగా బీట్ చేస్తే లోపల గాలి పోయి కేక్ పొంగదు)
- ఆఖరున టూటి ఫ్రూటి వేసి కలిపి కప్స్ లో సగానికి నింపండి
- ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో 180 డిగ్రీల దగ్గర 20- 25 నిమిషాలు బెక్ చేసుకుని తీసుకోవాలి.
- పూర్తిగా చల్లారాక సర్వ్ చేసుకోవాలి
- ఇది కుక్కర్ లో చేసుకోదలిస్తే కుక్కర్ కి ఉండే గ్యాస్ కట్ (రబ్బర్) తీసేసి మూత పెట్టి హై ఫ్లేం మీద 10 నిమిషాలు హీట్ చేసి లోపల ఓ స్టాండ్ పెట్టి దాని మీద ఓ ప్లేట్ ఉంచి కప్స్ పెట్టుకోండి
- మూతపెట్టి లో ఫ్లేం మీద 30-40 నిమిషాలు బెక్ చేసుకోండి
- మీ దగ్గర కప్స్ లేకపోతే పేపర్ టీ కప్స్ లో చేసుకోవచ్చు, లేదా పిండి మామూలు కేక్ మౌల్డ్ లో పోసి కూడా బేక్ చేసుకోవచ్చు
Video