ఎగ్లెస్ మిల్క్ కేక్

google ads

ఎగ్లెస్ మిల్క్ కేక్

Author Vismai Food
Eggles milk cake
ఎగ్లెస్ కేక్స్ అంటే ఏం బాగుంటుంది అనుకునే వాడిని ఒకప్పుడు. విస్మయ్ ఫుడ్ మొదలెట్టాక బేకింగ్ మీద పట్టు వచ్చింది, అలాగే బోలెడన్ని కిటుకులు తెలిసాయి. అప్పుడు ఎగ్ మైదా లేకుండా కూడా బేకింగ్ చేయొచ్చు అని తెలిసింది.
బేకింగ్ ఓ సైన్స్ అండి, ఉప్పు ఎక్కువైతే కారం, రెండూ ఎక్కవైతే పులుపుతో బాలన్స్ చేయడం లాంటివి బేకింగ్ లో చేయలేము. కచ్చితమైన కొలతల్లో చేస్తేనే పర్ఫెక్ట్ గా వస్తుంది.
అలాంటి కచ్చితమైన కేక్ ఈ మిల్క్ కేక్. వెన్నలా జారిపోతుంది. అన్ని కేక్స్ స్పంజీ గా ఉంటాయ్ కాని ఈ కేక్, అంత కంటే స్పంజీ గా ఉంటూ వెన్నలా జారిపోతుంది.
వెన్నా పాల సువాసన తో కమ్మగా ఉంటుంది ఈ కేక్!బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో ఎసెన్స్, బీటర్, బేకింగ్ సోడా ఏదీ అవసరం లేదు!ఛానల్ లో అలరెడి ఓ స్పాంజ్ కేక్ చేసాను ఆ కేక్ రుచి ఈ కేక్ రుచి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. రెండూ స్పంజీ గా ఉన్నప్పటికీ దేని రుచి దానిదే.
నాకు పర్సనల్ గా ఈ కేక్ చాలా ఇష్టం.ఈ రెసిపీ లో ప్రతీ పదార్ధం గ్రాముల తో పాటు, కప్స్ లో కూడా చెప్తాను. రెసిపీ ఆఖరున ఉండే టిప్స్ సెక్షన్ కి పైన ఓవెన్ లేకుండా ఎలా బేక్ చేసుకోవాలో కూడా చెప్తాను.
చాలా మంది ఈ కేక్ లో వాడిన పాల పొడి కి బదులుగా పసి పిల్లల పాల పొడి వాడొచ్చా అని అడుగుతున్నారు, ఆ పొడి దీనికి అంత బాగుండదు. ఆ పొడి లో వెన్న శాతం చాలా తక్కువగా ఉంటుంది.

Tips

ఒకవేళ పంచదార కి బదులు బెల్లం వాడుకోవలనుకుంటే కప్ బెల్లం పడుతుంది
గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు మైదా కి బదులు
ఈ కేక్ కి వనీల ఎసెన్స్ వేస్తే కమ్మని పాల వాసనా పోతుంది, నచ్చితే వేసుకోవచ్చు

Ingredients

 • 180 gms మైదా (1 కప్ + 1/3 కప్)
 • 180 gms వెన్న (3/4 కప్)
 • 180 ml నీళ్ళు
 • 60 gms పాల పొడి (1/3 కప్ + 1 tsps)
 • 1 tbsp బేకింగ్ పౌడర్
 • 180 gms పంచదార (3/4 కప్+ 1 tbsp)
 • ¼ cup మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ (బాదం, టూటి ఫ్రూటి, పిస్తా)

Instructions

 • నీళ్ళలో లో పంచదార వేసి పూర్తిగా కరిగించండి, ఆ తరువాత పాల పొడి వేసి కరిగించండి
 • ఆ తరువాత కరిగించిన వెన్న వేసి బాగా కలిపి క్రీం లా అయ్యేదాకా బీట్ చేసుకోండి
 • ఇప్పడు క్రీం లా చేసుకున్న వెన్న మీద జల్లెడ పెట్టి మైదా, బేకింగ్ పౌడర్ వేసి జల్లించండి.
 • జల్లించిన పిండి ని నిదానంగా ఒకే వైపు కలుపుతూ మొత్తం కలిసేలా ఎక్కడా గడ్డలు లేకుండా కలుపుకోండి
 • రివర్స్ లో కలిపినా పిండి జల్లించి వేసుకోకపోయినా కేక్ అంత బాగా పొంగదు, ఎప్పుడూ కేక్ పిండి ఒక వైపే కలుపుకోవాలి
 • కేక్ టిన్ లో బటర్ పేపర్ వేసి దాని మీద పిండి పోసుకోండి. లేనట్లైతే టిన్ కి బటర్ పూసి దాని మీద పొడి పిండి చల్లి కేకు పిండి పోసుకోండి
 • ఆఖరున డ్రై ఫ్రూట్స్ లో 1 tsp మైదా వేసి కలిపి పైన చల్లుకోండి, ఆ తరువాత మౌల్ద్ ని నిదాన్మగా 2-3 సార్లు తడితే లోపల బుడగలు ఏమైనా ఉంటె పోతాయ్
 • ప్రీ-హీట్ చేసిన ఓవెన్ లో 180 డిగ్రీస్ దగ్గర 25 నిమిషాలు బేక్ చేసుకోండి, ఆ తరువాత పుల్ల గుచ్చి చూసి క్లీన్ వస్తే తీసి పూర్తిగా చల్లార్చండి, ఆ తరువాత టిన్ లోంచి తీసి కట్ చేసుకోండి
 • కుక్కర్ లో చేసే వారు:
 • కుక్కర్ గ్యాస్ కట్ తీసేసి, మూత పెట్టి హై ఫ్లేం మీద 10 నిమిషాలు హీట్ చేసి ఆ తరువాత లోపల ఓ స్టాండ్ ఉంచి దాని మీద కేక్ టిన్ పెట్టి మూత పెట్టి లో-ఫ్లేం మీద 45 నిమిషాలు బేక్ చేసుకోండి.
 • అప్పుడు కూడా ఓ సారి పుల్ల గుచ్చి చూసి క్లీన్ గా వస్తేనే పర్ఫెక్ట్ బేక్ అయినట్లు, ఒక వేళ బేక్ కాకపోతే మరి కాసేపు బేక్ చేసుకోండి.

Video

ఎగ్లెస్ మిల్క్ కేక్

Author Vismai Food

Ingredients

 • 180 gms మైదా 1 కప్ + 1/3 కప్
 • 180 gms వెన్న 3/4 కప్
 • 180 ml నీళ్ళు
 • 60 gms పాల పొడి 1/3 కప్ + 1 tsps
 • 1 tbsp బేకింగ్ పౌడర్
 • 180 gms పంచదార 3/4 కప్+ 1 tbsp
 • ¼ cup మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ బాదం, టూటి ఫ్రూటి, పిస్తా

Instructions

 • నీళ్ళలో లో పంచదార వేసి పూర్తిగా కరిగించండి, ఆ తరువాత పాల పొడి వేసి కరిగించండి
 • ఆ తరువాత కరిగించిన వెన్న వేసి బాగా కలిపి క్రీం లా అయ్యేదాకా బీట్ చేసుకోండి
 • ఇప్పడు క్రీం లా చేసుకున్న వెన్న మీద జల్లెడ పెట్టి మైదా, బేకింగ్ పౌడర్ వేసి జల్లించండి.
 • జల్లించిన పిండి ని నిదానంగా ఒకే వైపు కలుపుతూ మొత్తం కలిసేలా ఎక్కడా గడ్డలు లేకుండా కలుపుకోండి
 • రివర్స్ లో కలిపినా పిండి జల్లించి వేసుకోకపోయినా కేక్ అంత బాగా పొంగదు, ఎప్పుడూ కేక్ పిండి ఒక వైపే కలుపుకోవాలి
 • కేక్ టిన్ లో బటర్ పేపర్ వేసి దాని మీద పిండి పోసుకోండి. లేనట్లైతే టిన్ కి బటర్ పూసి దాని మీద పొడి పిండి చల్లి కేకు పిండి పోసుకోండి
 • ఆఖరున డ్రై ఫ్రూట్స్ లో 1 tsp మైదా వేసి కలిపి పైన చల్లుకోండి, ఆ తరువాత మౌల్ద్ ని నిదాన్మగా 2-3 సార్లు తడితే లోపల బుడగలు ఏమైనా ఉంటె పోతాయ్
 • ప్రీ-హీట్ చేసిన ఓవెన్ లో 180 డిగ్రీస్ దగ్గర 25 నిమిషాలు బేక్ చేసుకోండి, ఆ తరువాత పుల్ల గుచ్చి చూసి క్లీన్ వస్తే తీసి పూర్తిగా చల్లార్చండి, ఆ తరువాత టిన్ లోంచి తీసి కట్ చేసుకోండి
 • కుక్కర్ లో చేసే వారు:
 • కుక్కర్ గ్యాస్ కట్ తీసేసి, మూత పెట్టి హై ఫ్లేం మీద 10 నిమిషాలు హీట్ చేసి ఆ తరువాత లోపల ఓ స్టాండ్ ఉంచి దాని మీద కేక్ టిన్ పెట్టి మూత పెట్టి లో-ఫ్లేం మీద 45 నిమిషాలు బేక్ చేసుకోండి.
 • అప్పుడు కూడా ఓ సారి పుల్ల గుచ్చి చూసి క్లీన్ గా వస్తేనే పర్ఫెక్ట్ బేక్ అయినట్లు, ఒక వేళ బేక్ కాకపోతే మరి కాసేపు బేక్ చేసుకోండి.

Tips

ఒకవేళ పంచదార కి బదులు బెల్లం వాడుకోవలనుకుంటే కప్ బెల్లం పడుతుంది
గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు మైదా కి బదులు
ఈ కేక్ కి వనీల ఎసెన్స్ వేస్తే కమ్మని పాల వాసనా పోతుంది, నచ్చితే వేసుకోవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top