ఎగ్ పావ్ భాజీ

google ads

ఎగ్ పావ్ భాజీ

Author Vismai Food
Eggpuf baji
“పావ్ భాజీ” మనందరికీ తెలుసు, అందరికి ఇష్టమే! ఎప్పుడూ అదే పావ్ భాజీ ఏమి తింటాము అనుకున్నారేమో ముంబై ఫూడీస్ ఎగ్ పావ్ భాజీ కనిపెట్టేశారు.
ఒక్క ముంబై లోనే కాదు, పూణే, నాగపూర్ అన్ని ప్రాంతాల్లో ఈ ఎగ్ పావ్ భాజీ చాలా ఫేమస్. ఒక్క ఎగ్ పావ్ భాజీనే కాదు, చైనీస్, చీస్, ఖీమ, సోయా ఇలా రకరకాల పావ్ భాజీలు ఉన్నాయ్, అవన్నీ త్వరలో వస్తున్నాయ్ వెబ్ సైట్ లోకి.
ఈ పావ్ భాజీ నేను ముంబై జూహు బీచ్ లో తిన్నాను. చాలా నచ్చేసింది. అక్కడే, నా ముందే చేసాడు. ఏమి వేసాడు ఎలా చేసాడు అన్నది చూసాను,
ఇంక ఆగుతానా ఇంటికొచ్చి ట్రై చేశా, తరువాత షూట్ చేశా, ఆ తరువాత ఛానల్ లో పోస్ట్ చేసేసా!ఇది వేడి వేడిగా చాలా బాగుంటుంది.
మా ఇంట్లో డిన్నర్ కి అన్నం, రోటీలకి బదులు ఇదే తింటుంటాం చాలా సార్లు!ఇది చేయడం చాలా తేలికే. కానీ, ఏ మాత్రం పొరపాటు చేసినా నీచు వాసనొస్తుంది, తినలేరు. ఆ టిప్స్ అన్నీ రెసిపీ ఆఖరున ఉంటాయ్. తప్పక పాటించండి.

Tips

గుడ్డు తురుము వేశాక హై ఫ్లేం మీద నిదానంగా కలుపుకోవాలి, మరీ ఎక్కువగా కలుపుకుంటే నీచు వాసనొస్తుంది
భాజీ మరీ చిక్కగా అనిపిస్తే గుడ్డు వేయకమునుపే నీరు వేసి పలుచన చేసుకోవాలి తరువాత నీళ్ళు పోస్తే నీచు వాసనొస్తుంది.

Ingredients

భాజీ కోసం:

 • 2 ఉడికించిన గుడ్లు
 • ½ cup ఉల్లిపాయ సన్నని తరుగు
 • 2 tbsp పచ్చిమిర్చి తరుగు
 • ¼ cup టమాటో ముక్కలు
 • ½ cup టమాటో గుజ్జు
 • ¼ cup కాప్సికం ముక్కలు
 • ఉప్పు
 • 1 tbsp కారం
 • ¼ tbsp పసుపు
 • 1 tbsp పావ్ భాజీ మసాలా
 • 1 tbsp గరం మసాలా
 • 2 tbsp బటర్
 • 2 tbsp కొత్తిమీర
 • cup నూనె

పావ్:

 • 4 లదీ పావ్
 • 2 tbsp వెన్న
 • ¼ tbsp పావ్ భాజీ మసాలా పొడి

Instructions

 • నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి ఉల్లిపాయలు మెత్తబడే దాక ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత టమాటో ముక్కలు, టమాటో గుజ్జు వేసి టమాటోల్లోంచి నీరు ఇగిరిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి
 • ఇప్పుడు సన్నగా తరిగిన కాప్సికం వేసి మెత్తబడే దాక మగ్గించుకోవాలి
 • ఆ తరువాత ఉప్పు కారం, గరం మసాలా, పావ్ భాజీ మసాలా, పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి, ఆ తరువాత 1/2 కప్ నీళ్ళు పోసి మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి
 • భాజీ చిక్కబడ్డాక ఉడికించిన గుడ్లని పెద్ద రంధ్రాలున్న వైపు తురుము కోవాలి, తురుముకున్న గుడ్డు ని భాజీలో వేసి నిదానంగా కలుపుకోవాలి.
 • దింపే ముందు కాస్త బటర్, కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి దిమ్పెసుకోవాలి
 • పెనం మీద వెన్న కరిగించి అందులో పావ్ భాజీ మసాలా వేసి వేపి పావ్ ని మధ్యకి కట్ చేసి కరిగిన వెన్న మీద పెట్టి అన్ని వైపులా వేపుకోవాలి.
 • వేడి గా ఉన్నప్పుడు కాస్త నిమ్మరసం, కాస్త ఉలిపాయ తరుగు చల్లి సర్వ్ చేసుకోవాలి.

Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top