ఓట్స్ మసాలా వడలు, భలేగా ఉంటాయ్. బయట కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి. ఇంకా ఇవి అస్సలు నూనె పీల్చవ్! చేయడం కూడా చాలా తేలిక! పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు! సాయంత్రాలు స్నాక్స్ గా, ఉదయం బ్రేక్ఫాస్ట్ కి మాంచి ఆప్షన్ ఇది!

కావలసినవి:

 • పచ్చి సెనగపప్పు- ½ కప్ ( 2 గంటలు నానబెట్టినవి)
 • ఓట్స్- 3/4 కప్
 • ఉల్లిపాయ తరుగు- ½ కప్
 • కొత్తిమీర తరుగు- 3 tbsps
 • ధనియాలు- 1 tsp
 • సాల్ట్
 • 1 పచ్చిమిర్చి తరుగు
 • కారం- 1 tsp
 • నీళ్ళు తగినన్ని
 • నూనె వేయించడానికి

విధానం:

Directions

0/0 steps made
 1. సెనగపప్పు ని 2 గంటలు నానబెట్టి నీళ్ళు వేయకుండా గట్టిగా బరకగా రుబ్బుకోవాలి.
 2. బరకగా పప్పులుగా రుబ్బుకున్న పిండి ముద్ద లో మిగిలిన సామానంతా వేసి గట్టిగా పిండుతూ కలుపుకోవాలి.
 3. ఆ తరువాత చెంచాల తో నీళ్ళు పోసుకుంటూ పిండి, ముద్దగా అయ్యేదాకా కలుపుకోవాలి.
 4. ఇప్పుడు వేడి వేడి నూనెలో వడలు వేసి మీడియం ఫ్లేం మీద వడలు ఎర్రగా కరకరలాడేదాక వేపుకోండి.
 5. ఇవి వేడి వేడిగా అల్లం పచ్చడి తో చాలా రుచిగా ఉంటాయి.

టిప్స్:

 • నీళ్ళు చెంచాలతో పోసుకుంటూ పిండి ని గట్టిగా కలుపుకోండి. నూనె లో వేసే ముందు వడలు వత్తి చూడండి, వడ రాకపోతే కొంచెం నీళ్ళు పోసుకుని ముద్దగా చేసుకోండి.