“కంది పొడి” ఇది తెలుగువారి ప్రేత్యేకమైన రెసిపీ. ఇది అందరికి తెలిసినదే, కానీ చేసే తీరులో రుచి మారిపోతుంటుంది.
కొన్ని పద్ధతులు జాగ్రత్తగా పాటిస్తే బెస్ట్ రెసిపీ చేసుకోవచ్చు. ఇది బ్యాచిలర్స్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. వేడి అన్నం లో నెయ్యి తో లేదా ఆవకాయ తో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కంది పొడితో కొందరు చారు కూడా పెడతారు అది నేను మరో సారి చెప్తా.

కావలసినవి:

 • కంది పప్పు- ½ కప్
 • పచ్చి సెనగపప్పు- ¼ కప్
 • పెసరపప్పు- ¼ కప్
 • జీలకర్ర- 1 tsp
 • ఎండు మిర్చి- 10-15
 • ఇంగువ- చిటికెడు
 • ఉప్పు

విధానం:

Directions

0/0 steps made
 1. మూకుడు లో కంది పప్పు వేసి కేవలం సన్నని మంట మీద కలుపుతూ మాంచి సువాసనతో బంగారు రంగులోకి వచ్చేదాకా వేపుకోవాలి
 2. కలుపుతూ సన్నని మంట మీద వేపితేనే పప్పు లోపలి దాకా వేగి ఎంతో రుచిగా ఉంటుంది పొడి.
 3. పప్పు వేగాక దింపి చల్లర్చుకోవాలి, ఇలాగే పచ్చి సెనగపప్పు ఎర్రగా వేపుకోవాలి దింపి చలార్చుకోవాలి
 4. అలాగే పెసరపప్పు కూడా సన్ని సెగ మీద వేపి స్టవ్ ఆపేసి ఎండుమిర్చి, జీలకర్ర వేసి బాగా కలుపుతుంటే ఆ వేడికి మిరపకాయలు ఎర్రగా సమానంగా వేగుతాయ్ పప్పుతో పాటే.
 5. పప్పులన్ని పూర్తిగా చల్లారాక, మిక్సీ లో వేసి అందులో ఉప్పు, ఇంగువ వేసి మెత్తని పొడి చేయండి
 6. ఈ పొడి ఎంత మెత్తగా చేసుకుంటే అంత బాగుంటుంది

టిప్స్:

 • మిరపకాయలు కాస్త ఎక్కువగా వేపుకుని గ్రైండ్ చేసేప్పుడు నలుగు కాయలు పక్కనుంచి కరం సరిపోకపోతే ఇంకొన్ని చేర్చి గ్రైండ్ చేసుకోండి. ఇలా అయితే కారాన్ని సరిగా చూసుకుని వాడుకోవచ్చు
 • మిరపకాయలు స్టవ్ ఆపేసి పప్పుతో పాటే వేపడం అన్నది ఇనుము లేదా కాస్ట్ ఐరన్ మూకుడులలో మాత్రమే సరిగా వేగుతుంది, నాన్ స్టిక్ లో సరిగా వేగావు మిరపకాయలు అందుకే విడిగా వేపుకుని కలుపుకోవాలి.
 • ఈ పొడి రుచంతా కూడా మీరు పప్పులని వేపే తీరు మీదే ఆధారపడి ఉంది. ఎంత ఓపికగా నిదానంగా వేపితే అంత రుచి.