కడాయ్ పనీర్ ఫేమస్ పంజాబీ రెసిపీ. పనీర్ బటర్ మసాల, షాహీ పనీర్, పాలక్ పనీర్ లాగే కడాయ్ పనీర్ కూడా ఎంతో ఫేమస్ పంజాబీ రెసిపీ. మిగిలిన కూరలన్నీ కమ్మగా ఉంటె ఈ కూర మాత్రం ఘాటుగా మసాలాలతో చాలా బాగుంటుంది.

ఇది రోటీ నాన్ లోకి చాలా రుచిగా ఉంటుంది.

నేను ఈ కడాయ్ పనీర్ పూర్తిగా హోం మేడ్ స్టైల్ లో చెప్తున్నా! రెస్టారెంట్ కి మల్లె జీడిపప్పు పేస్టు అవేవి వేయకుండా చాలా సింపుల్ గా చేస్తున్నా! అయినా కూడా రెస్టారంట్ కి ఏమాత్రం తీసిపోదు ఈ కూర. చిక్కని గ్రేవీతో.

మాములుగా అయితే దీనికి మసాలాలు వేపి పొడి కొట్టి దాన్ని కూరలో వేస్తారు ఆ స్టైల్ కి బదులు, చాలా సింపుల్ గా బెస్ట్ టేస్ట్ వచ్చేలా చేస్తున్నా ఈ కూర.

ఈ కూర  ఘాటుగా ఉంటుంది.  ప్రేత్యేకించి తెలుగు వారికి నచ్చేలా ఉంటుంది!

దీనితో పాటు ఇవి కూడా ట్రై చేయండి:

పనీర్ బటర్ మసాలా
గోంగూర పనీర్
ధాభా స్టైల్ కాజు పనీర్ మసాలా
ఆలూ సమోసా
కాజు పకోడీ
నెల్లూరు పులిబొంగరాలు

కావలసినవి:

 • పనీర్- 200 gms
 • సన్నని ఉల్లిపాయ తరుగు- 1/2 కప్
 • టమాటో ప్యూరీ- 1 కప్(200 ml)
 • ఓ టమాటో ముక్కలు
 • ఓ ఉల్లిపాయ పెద్ద పాయలు
 • సగం కాప్సికం ముక్కలు- 10-15 మక్కలు
 • అల్లం వెల్లూలి ముద్దా- 1 tbsp
 • నూనె- 1/4 కప్
 • నెయ్యి- 1 tsp
 • దంచిన ధనియాలు- 1  tbsp
 • జీలకర్ర- 1 tsp
 • సోంపు- 1 tsp
 • ఎండు మిర్చి- 3
 • ధనియాల పొడి- 1 tsp
 • వేయించిన జీలకర్ర పొడి- 1 tsp
 • సాల్ట్
 • పసుపు- 1/4 tsp
 • కారం- 1 tsp
 • గరం మసాలా- 1/2 tsp
 • నీళ్ళు- 150 ml

విధానం:

Directions

0/0 steps made
 1. నూనె వేడి చేసి దంచిన ధనియాలు, జీలకర్ర, సోంపు, ఎండుమిర్చి వేసి వేపుకోవాలి
 2. ఇప్పుడు ఉల్లిపాయ సన్నని తరుగు వేసి ఉల్లిపాయలు ఎర్రబడేదాక వేపుకోవాలి, ఆ తరువాత అల్లం వెల్లూలి ముద్ద వేసి వేపుకోవాలి.
 3. తరువాత ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి వేసి మసాలాలు బాగా వేపుకోవాలి 1 tbsp నీళ్ళు వేసి.
 4. మాసాలు వేగాక ఉల్లిపాయ పాయలు ఇంకా కాప్సికం ముక్కలు వేసి ఉల్లిపాయలు కాస్త మెత్తబడేదాక వేపుకోవాలి
 5. ఇప్పుడు టమాటో గుజ్జు పోసి నూనె పైకి తేలేదాకా బాగా కలిపి మీడియం ఫ్లేం మీద మూత పెట్టి మగ్గనివ్వాలి
 6. ఆ తరువాత టమాటో ముక్కలు వేసి బాగా కలిపి టమాటో ముక్కలు మెత్తగా మగ్గనివ్వాలి, ముక్కలు ముక్కలుగానే ఉండాలి.
 7. టమాటో ముక్కలు కూడా మగ్గాక 150 ml నీళ్ళు పోసి పనీర్ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించి నెయ్యి వేసి కలిపి దిమ్పెసుకోవాలి.

టిప్స్:

 • వేసిన ఉల్లిపాయ, కాప్సికం ముక్కలు పూర్తిగా మెత్తగా మగ్గ కూడదు, అవి నోటికి బాగా తెలియాలి తింటుంటే.
 • పనీర్ వేసే ముందు వేడి నీళ్ళలో 10 నిమిషాలు ఉంచి వేసుకోండి.