కర్డ్ బుల్లెట్స్
“కర్డ్ బుల్లెట్స్” మాంచి పార్టీ స్నాక్ ఇది. తక్కువ టైం లో దాదాపుగా ఈ మధ్య అందరిళ్ళలో ఉండే సామానుతోనే చేసుకోవచ్చు. ఇవి బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్ గా చాలా రుచిగా ఉంటాయ్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొన్ని టిప్స్ పాటిస్తే రెస్టారంట్ టేస్ట్ వస్తుంది. ఇవి చూడడానికే కాదు తినడానికి ఇంకా రుచిగా ఉంటాయ్.నిజంగా ఓ మాట చెప్పాలి ఈ కర్డ్ బుల్లెట్స్ దాదాపుగా దాహీ కబాబ్ లాగే ఉంటాయ్. కానీ టెస్ట్ భిన్నంగా ఉంటుంది. ఇవి వేడివేడిగా అలాగే తినేయొచ్చు, నచ్చితే మయోనైస్ లేదా టమాటో కేట్చప్ తో ఎంజాయ్ చేయొచ్చు.నేను దీనికి దేశి టచ్ ఇవ్వడానికి ఇంకా నన్ను అందరూ ఎప్పుడూ మైదా కి ఇంకేదైనా హేల్తీ ఆప్షన్ అడుగుతుంటారు. అందుకే దీనికి సెనగపిండి కోటింగ్ ఇచ్చాను. నచ్చితే మీరు సెనగపిండికి బదులు కార్న్ ఫ్లోర్ లేదా మైదా కూడా వాడుకోవచ్చు.బెస్ట్ కర్డ్ బుల్లెట్స్ కోసం కొన్ని టిప్స్:దీనికి బేస్ గా ఉండే పెరుగు కమ్మనిది చిక్కనిది అయి ఉండాలి.పెరుగుని ఓ మస్లిన్ లేదా కాటన్ క్లాత్ లో వేసి గట్టిగా ముడి వేసి 5-6 గంటలు వదిలేయాలి, ముడి వేయడం లేదా ఏదైనా బరువు ఉంచడం చేయకపోతే పెరుగులోని నీరు సరిగా దిగదు. అప్పుడు బుల్లెట్స్ సరిగా రావు.పనీర్ ని పెద్ద రంధ్రాలున్న వైపు తురుము కుంటే వేగాక తింటున్నప్పుడు తెలుస్తుంది బుల్లెట్స్ లో. లేదంటే పెరుగులో కలిపిపోతుంది.బుల్లెట్స్ ఒకవేళ సాఫ్ట్ అయిపోయి, విరిగిపోతుంటే బుల్లెట్స్ చేసి ఫ్రిజ్ లో ఉంచేస్తే గట్టిపడతాయ్. అప్పుడు బ్రెడ్ పొడిలో రోల్ చేసి ఫ్రై చేసుకోండి.నేను Paanko బ్రెడ్ క్రంబ్స్ వాడను, ఇవి బెస్ట్. ఇవి మీకు online లో లేదా అన్ని సూపర్ మర్కెట్స్ లో దొరుకుతాయ్. ఒకవేళ బ్రెడ్ పొడి లేనట్లైతే మిల్క్ బ్రెడ్ ని 2 రోజులు ఎండలో ఉంచి పొడి చేసుకోండి మిక్సీ లో వేసి. దీనికి రస్క్‌లు వాడకండి. అందులో పంచదార ఇంకా కొన్ని ఫ్లేవర్స్ వేసుంటాయ్ కాబట్టి వాడలేము.నూనెలో బుల్లెట్స్ వేసాక వెనతనే గరిట పెట్టకండి, విరిగిపోగలవు. కాస్త వేగనిచ్చి చెంచాతో తిప్పుకుంటూ ఎర్రగా మీడియం ఫ్లేం మీదే వేపుకోవాలి. అప్పుడే మాంచి రంగుతో కరకరలాడుతూ వస్తాయ్. హై ఫ్లేం మీద లేదా నూనె విపరీతమైన వేడితో ఉన్నప్పుడు వేపితే రంగోస్తాయ్ కాని మెత్తగా ఉంటాయ్ అంత రుచిగా ఉండవు.
Ingredients
కావలసినవి:
- ½ Liter కమ్మటి పెరుగు
- 150 grams పనీర్
- 1 tbsp పచ్చిమిర్చి తరుగు
- ½ tbsp గరం మసాలా
- సాల్ట్
- 2 tbsp కొత్తిమీర
- ½ tbsp సన్నని అల్లం తరుగు
- 2 tbsp జీడిపప్పు
- ½ cup సెనగపిండి
- 1 cup paanko బ్రెడ్ పొడి
Instructions
విధానం:
- గిన్నె పైన జల్లెడ ఉంచి దాని మీద క్లాత్ ఉంచి పెరుగు పోసి గట్టిగా ముడి వేసి 5-6 గంటలు వదిలేయాలి.
- నీరు దిగి పనీర్ లా మెత్తగా ఉన్న పెరుగు ముద్దలో పనీర్ తురుముతో మిగతా సామానంతా (సెనగపిండి బ్రెడ్ పొడి తప్ప) వేసి నీరు వేయకుండా బాగా కలుపుకోవాలి.
- గట్టిగా కలుపుకున్న పిండి ముద్దని బుల్లెట్స్ మాదిరి రోల్ చేసుకోవాలి.
- సెనగ పిండి లో ఉప్పు నీరు వేసి బజ్జీల పిండి మాదిరి కలుపుకోవాలి
- రోల్ చేసుకున్న బుల్లెట్స్ ని సెనగపిండి లో ముంచి తరువాత బ్రెడ్ పొడి లో వేసి బాగా కోట్ చేసి పక్కనుంచుకోండి.
- నూనె బాగా వేడెక్కాక మంట పూర్తిగా తగ్గించి అందులో బుల్లెట్స్ వేసి మీడియం ఫ్లేం మీద 2-3 నిమిషాలు వేగనివ్వండి.
- 2-3 నిమిషాల తరువాత చెంచాతో తిప్పుకుంటూ ఎర్రగా వీపుకుని తీసుకోండి.
- ఇవి మయోనైస్, టమాటో కేట్చప్ తో సర్వ్ చేసుకోండి.
Video