కాకరకాయ ఉల్లికారం…దీని రుచి కి ఎవ్వరైనా గులాం అవ్వాల్సిందే. వేడి వేడి అన్నం లో నెయ్యేసుకుని తింటే ఆ రుచి వర్ణించడానికి మాటల్లేవ్ అంతే! ఈ కూర చేదుగా అస్సలుండదు. కాబట్టి చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కాయకూరలను మారుస్తూ ఉల్లికారంలో కొన్ని మసాలాలు మారుస్తూ చాలా విధాలుగా చేయొచ్చు, ఛానల్ లో వంకాయ ఉల్లికారం, సొరకాయ ఉల్లికారం…ఇలా చాలా ఉన్నాయ్.

కావలసినవి:

 • కాకరకాయ- ½ కిలో
 • ఉల్లి పాయలు- 250 కిలో
 • కారం- 2 tsps
 • పసుపు- ½ tsp
 • జీలకర్ర- 1 tsp
 • వెల్లులి- 6-7
 • ఉప్పు
 • నూనె- ¼ కప్
 • కరివేపాకు- ఓ రెబ్బ

విధానం:

Directions

0/0 steps made
 1. లేత కాకరకాయ చెక్కు తీసి 2 ఇంచుల ముక్కలుగా కోసుకోండి.
 2. ఇప్పుడు కాకరకాయ ముక్కల్లో పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి 30 నిమిషాలు వదిలేయండి.
 3. 30 నిమిషాలకి కాకరకాయల్లోంచి నీరు వదులుతుంది, అప్పుడు ఆ నీరు తీసేసి ముక్కలని గట్టిగా పిండితే మిగులున్న పసరు కూడా దిగుతుంది.
 4. ఇప్పుడు మిక్సీ లో ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, వెల్లులి, జీలకర్ర వేసి మెత్తని పేస్టు గా చేసుకోండి.
 5. ఇప్పుడు మూకుడులో నూనె వేడి చేసి కాకరకాయ ముక్కలు వేసి 5 నిమిషాలు వేపి తీసి పక్కనుంచుకోండి.
 6. ముక్కలు చల్లారాక కాకరకాయ లోపలి గింజలు తీసెయ్యండి, ఆ తరువాత మెత్తగా రుబ్బుకున్న ఉల్లిపాయ పేస్టు కూరండి.
 7. ఇప్పుడు మూకుడు లో నూనె మరిగించి అందులో కాకర ముక్కలు సర్ది, మిగిలిన ఉల్లిపాయ పేస్టు పైన వేసి మీడియం ఫ్లేం మీద ముక్కలు బాగా మగ్గి, ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి.
 8. మధ్య మధ్య లో ముక్కలు పైకి కిందికి కలుపుకోండి. కూరని హై-ఫ్లేం మీద అస్సలు వేపకండి.
 9. ఈ కూర సరిగ్గా వేగడానికి కనీసం 20 నిమిషాలు పైనే పడుతుంది.
 10. దింపే ముందు కరివేపాకు చల్లుకుని దిమ్పెసుకోండి

టిప్స్:

 • చేదు తినగలిగిన వారు ముక్కలకి ఉప్పు పసుపు వేసి నానబెట్టకుండా కూడా చేసుకోవచ్చు.
 • దీనికి కాస్త కారం ఎక్కువగా ఉంటె రుచిగా ఉంటుంది
 • ఈ కూర నాన్-స్టిక్ పాన్లలోకంటే కూడా ఇనుప, కాస్ట్ ఐరన్ ముకుళ్ళలో వేపితే చాలా రుచిగా ఉంటుంది.