“కాజు పకోడీ” మాంచి టైం-పాస్ స్నాక్! ఇదంటే అందరికి ఇష్టమే, కాని ఇంట్లో చేస్తే స్వీట్ షాప్స్ అంత పర్ఫెక్ట్ గా రానే రాదు. అలా రాకపోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వకపోవడమే! ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా వస్తాయ్ ఈ టిప్స్ పాటిస్తే…ఈ కొలతల్లో చేస్తే! ఇవి కనీసం 10 రోజులు నిలవుంటాయ్ కూడా!

కావలసినవి:

 • జీడిపప్పు బద్దలు- 100 gms
 • సెనగపిండి- 150 gms
 • కరివేపాకు- ఓ రెబ్బ
 • కారం- 1 tsp
 • జీలకర్ర- 1 tsp
 • అల్లం వెల్లూలి పేస్టు- 1 tsp
 • గరం మసాలా- ½ tsp
 • ధనియాల పొడి- ½ tsp
 • ధనియాలు- 1 tsp (నలిపినవి)
 • నీళ్ళు- 4 చెంచాలు
 • డాల్డా/నెయ్యి/నూనె- 1 tbsp
 • నూనె వేపకానికి సరిపడా

విధానం:

Directions

0/0 steps made
 1. జీడిపప్పు బద్దలని నీళ్ళు పోసి 2 గంటలు నాననివ్వండి.
 2. 2 గంటల తరువాత పప్పుని వడకట్టి అందులో సెనగపిండి ఇంకా మిగిలినా సామానంతా వేసి బాగా పొడి పొడిగా కలుపుకోండి.
 3. ఇప్పుడు కొద్దిగా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి.
 4. ఇప్పుడు బాగా మరిగిన నూనె లో పకోడీని పొడి పొడిగా వేసుకుంటూ మీడియం ఫ్లేం మీద ఎర్రగా వేపుకోండి.
 5. ఇవి సరిగా లోపలిదాకా ఎర్రగా వేగడానికి కనీసం 12- 15 నిమిషాల టైం పడుతుంది.
 6. ఎర్రగా కరకరలాడుతూ వేపుకుని తీసుకోండి. పూర్తిగా చల్లారాక డబ్బా లో పెట్టుకుంటే కనీసం 10 రోజులు నిలవుంటాయ్.
 7. ఇవి వేడి మీద కాస్త మెత్తగా ఉంటాయ్, చల్లారక క్రిస్పీ గా ఉంటాయ్.

టిప్స్:

 • ఇందులో డాల్డా వేస్తేనే కరకరలాడుతూ గుల్లగా వస్తాయి, ఇష్టం లేకపోతే మరుగుతున్న నెయ్యి, లేదా వేడి నూనె వేసుకుని కలుపుకోండి..