కాప్సికం రైస్…లంచ్ బాక్సులకి, అన్నం మిగిలిపోయినా బెస్ట్ వంటకం ఇది. చాలా త్వరగా చేసెయ్యొచ్చు. ఎప్పుడు చేసినా అందరికి నచ్చేస్తుంది. ఎప్పుడూ తినే రైస్ ఐటెం కి కాస్త వెరైటీ ఈ రైస్.

కావలసినవి:

 • కాప్సికం చీలికలు- ౩/4 కప్
 • ఉల్లిపాయ చీలికలు- 1/4 కప్
 • టమాటో తరుగు- 1
 • పచ్చిమిర్చి చీలికలు- 2
 • ఓ నిమ్మకయా రసం
 • అల్లం వెల్లులి పేస్ట్- 1 tsp
 • రైస్-250gms (పొడి పొడిగా వండినది)
 • ఆవాలు- 1 tsp
 • జీలకర్ర- 1tsp
 • ఎండు మిర్చి- 2
 • సాల్ట్
 • పసుపు- ¼ tsp
 • కారం- 1 tsp
 • గరం మసాలా- ½ tsp
 • కొత్తిమీర తరుగు- 1 tbsp
 • నూనె- ౩ tbsps

విధానం:

Directions

0/0 steps made
 1. నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర ఎండు మిర్చి వేసి ఎర్రగా వేపి ఉల్లిపాయ తరుగు వేసి వేపుకోండి
 2. ఇప్పుడు అల్లం వెల్లులి పేస్టు వేసి పచ్చి వాసన పోయే దాకా వేపుకోండి
 3. ఇప్పుడు కరం ఉప్పు పసుపు గరం మసాలా అన్నీ వేసి కలుపుకుని టమాటో ముక్కలు వేసి టొమాటోలు మెత్తగా మగ్గేదాక వేయించుకోండి
 4. ఇప్పుదు కాప్సికం చీలికలు వేసి 4-5 నిమిషాలు వేయించుకోండి
 5. ఇప్పుడు 1 కప్ ఉడికించిన అన్నం వేసి మసాలాల్ని బాగా పట్టించి నిమ్మరసం, కొత్తిమీర చల్లుకుని కలుపుకుని దిమ్పెసుకోండి.
 6. వేడి వేడిగా చాలా రుచిగా ఉంటుంది