“కారా బూంది” మాంచి టైం పాస్ స్నాక్, చాలా ఈజీ, జస్ట్ 5 నిమిషాలు చాలు అంతకంటే టైం కూడా పట్టదు. పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ టేస్ట్ వస్తుంది. ఇంట్లో చాలా మంది చీస్తునే ఉంటారు వారికి అంత క్రిస్పీ గ అరవు చక్కటి ముత్యాల్లాంటి షేప్ రావు! ఏంటో, మనకు రావు అనుకుని వదిలేస్తుంటారు షాప్ నుంచి తెచ్చిన బూంది ని చూసి చాలా మంది. కాని నేను చెప్పబోయే టిప్స్ పాటిస్తే పర్ఫెక్ట్ టెస్ట్, షేప్ గారంటీ!

ఓ సారి చేసి డబ్బాలో ఉంచుకుంటే కనీసం 15 రోజులు నిలవ ఉంటాయి. ఇవి వేడి వేడి అన్నం లో నెయ్యేసుకుని పిడికిడు బూంది పోసుకుని కలుపుకుని తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఇంకా పప్పు, పప్పుచారు, పెరుగన్నం లోకి చెప్పాలా ప్రేత్యేకంగా, అదుర్స్ అంతే!!!

కావలసినవి:

 • సెనగపిండి- 200 gms
 • బియ్యం పిండి- 2 tbsps
 • వేరు సెనగపప్పు/జీడిపప్పు- ½ కప్
 • కరివేపాకు- 2 రెబ్బలు
 • నూనె- వేపడానికి
 • కారం- ½ tsp
 • ఉప్పు
 • ధనియాల పొడి- 1 tsp
 • వేయించిన జీలకర్ర పొడి- ½ tsp
 • నీళ్ళు- తగినన్ని

విధానం:

Directions

0/0 steps made
 1. సెనగపిండి, బియ్యం పిండి, నీళ్ళు పోసి పిండి ని గరిట జారుగా కలుపుకోవాలి గడ్డలు లేకుండా పిండిని
 2. ఇప్పుడు నూనె ని మసల కాగానివ్వండి హై ఫ్లేం మీద
 3. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే బూంది దూసే గరిట మీద పిండి పోసి నిదానంగా పోసి అట్లు పోసినట్లు గరిటని తిప్పండి పిండి మీద, అప్పుడు చక్కగా బూంది గరిట లోంచి కిందికి జారుతుంది
 4. నూనె లో పడ్డ బూంది ని కేవలం హై ఫ్లేం మీద మాత్రమే వేపుకోవాలి, బూంది ఎర్రగా వేగాకా తీసి పక్కనుంచుకోండి
 5. ఇప్పుడు అదే నూనె లో వేరుసెనగపప్పు, కరివేప్పకు వేసి వేపుకుని బూంది లో వేసుకోండి
 6. ఇప్పుడు సాల్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేడి మీద బూందికి బాగా పట్టించండి
 7. పూర్తిగా చల్లారక బూందిని డబ్బాలో దాచుకుంటే కనేసం 15 రోజులు నిలవుంటాయ్

టిప్స్:

 • నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే బూంది దూసుకోవాలి, లేదంటే బూంది మెత్తగా వస్తుంది, నూనే లాగేస్తుంది
 • బూంది ఎప్పుడు కూడా లోతున్నటువంటి మూకుడులో చేసుకుంటే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది
 • సెనగపిండి గరిట మీద పోసి నిదానంగా గరిటతో తిప్పుకొవాలే గాని గరిటని తట్టకూడదు, అల తడితే చక్కటి షేప్ రాదు బూంది.
 • ఓ వాయి అవ్వగానే నూనె ని మళ్ళీ వేడి చేసి బూంది దూసుకోండి, ముందు వేసిన వాయికి నూనె చల్లారి ఉంటుంది కాబట్టి. నూనె సలసలా మరుగుతుండాలి.
 • < ఓ వాయి అవ్వగానే చిన్న చిన్న బూంది మిగిలిపోతుంది నూనే లో అది గరిటకి అందదు, అందుకని టీ జల్లెడ తో మిగిలిన బూంది తీసి నూనె వేడి చేసి మళ్ళీ బూంది దూసుకోండి