కేరెట్ రైస్ ఇది చాలా ఆరోగ్యం చాలా త్వరగా అయిపోతుంది కూడా. ఘుమఘుమ లాడిపోతూ భలేగా ఉంటుంది. ఆఫీసులకి వెళ్లేవారికి, లంచ్ బాక్సేస్ కి, పిల్లలకి చాలా బాగుంటుంది. అన్నింటికీ మించి చాలా త్వరగా అయిపోతుంది!

కావలసినవి:

 • రైస్- 1 కప్( పొడి పొడిగా కాస్త ఉప్పు వేసి ఉడికించుకోండి)
 • కేరట్ తురుము- 1 కప్
 • పచ్చి కొబ్బరి తురుము- 2 tbsps
 • ఉల్లిపాయ తరుగు- ½ కప్
 • పచ్చిమిర్చి- 2
 • కరివేపాకు- 2 రెబ్బలు
 • కొత్తిమీర- 2 tbsps
 • నిమ్మరసం- 1 tbsp
 • సాంబార్ పొడి- 1 tsp
 • ఉప్పు
 • నూనె- 3 tbsps
 • జీడి పప్పు- 15
 • దాల్చిన చెక్క- 1 ఇంచ్
 • యలకలు- 5
 • లవంగాలు-5
 • బిరియాని ఆకు- 1

విధానం:

Directions

0/0 steps made
 1. నూనె వేడి చేసుకుని అందులో యాలక, లవంగాలు, జీడిపప్పు, బిరియాని ఆకు వేసి మంచి సువాసనోచ్చేదాక దాక వేపుకొండి
 2. ఇప్పుడు ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేదాకా వేపుకోండి
 3. ఇప్పుడు కేరట్ తురుము వేసి 3 నిమిషాల పాటు పచ్చి వాసన పోయే దాక వేపుకోండి
 4. ఇప్పుడు ఉప్పు, సాంబార్ పొడి పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకుని, ఉడికిన్చుకున్న అన్నం వేసి బాగా కలుపుకోండి
 5. దింపే ముందు ½ చెక్క నిమ్మరసం, కొత్తిమీర చల్లుకుని దిమ్పెసుకోండి