కొత్తిమీర రైస్ / కొత్తిమీర పులావ్

google ads

కొత్తిమీర రైస్ / కొత్తిమీర పులావ్

Author Vismai Food
kothimeera-rice
తక్కువ టైం లో బెస్ట్ రైస్ తినాలంటే ఈ కొత్తిమీర రైస్ ట్రై చేయండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. చేయడం కూడా చాలా తేలిక. లంచ్ బాక్సులకి, స్పెషల్ రోజుల్లో, వీకెండ్స్ లో ఇంకా అన్నం మిగిలిపోయినా ఇది బెస్ట్.బ్యాచిలర్స్, అసలు వంట రాని వారు కూడా సులభంగా చేసేయొచ్చు.
చల్లారినా రుచిగా ఉంటుంది. కొత్తిమీర రైస్ కమ్మని రైతాతో చాలా రుచిగా ఉంటుంది.సాధారణంగా లంచ్ బాక్సుల రెసిపీస్ అని గరం మసాలాలు, అల్లం వెల్లూలి ముద్ద వేసి ఘాటుగా చేస్తుంటారు. అలా వేసినవి ఎప్పుడైనా తినొచ్చు, కాని రోజూ తినలేము.
ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. ఈ రెసిపీ లో మసాలాలు, ఉల్లిపాయ, వెల్లూలి ఏవి లేవు. కాబట్టి ఎప్పుడైనా హాయిగా అందరూ తినొచ్చు.

Tips

1 కప్ సోనా మసూరి రైస్ వాడను. ఓ కప్ అంటే 185 గ్రాములు. అన్నం వండేప్పుడు కాస్త ఉప్పు వేసి వండుకోండి. అప్పుడు ఉప్పు బాగా పడుతుంది అన్నానికి.
నేను ఫ్రోజెన్ బటానీ వాడను. అవి త్వరగా మగ్గిపోతాయ్. మీరు తాజా బటానీ వాడుకోదలిస్తే 15 నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచితే త్వరగా మగ్గిపోతాయ్ నూనెలో.
బంగాళాదుంపని 80% ఉడికించి వాడుకోవాలి. పూర్తిగా ఉడికించినది వేస్తే అన్నంలో కలిపెప్పుడు చిదురవుతుంది. ఉడికిన 80% బంగాళదుంప నూనెలో వేగేప్పుడు మగ్గిపోతుంది.
కొత్తిమీర పేస్టు గ్రీన్ కలర్ లోనే ఉండాలంటే ఫ్రిజ్ లోంచి తీసిన చల్లని నీళ్ళతో మెత్తని పేస్టు చేసుకోండి.
ఇందులో నిమ్మరసానికి బదులు 1 tbsp ఆమ్చూర్ పొడి కూడా వాడుకోవచ్చు.

Ingredients

కొత్తిమీర పేస్టు కోసం:

 • 1.5 cups కొత్తిమీర (2 మీడియం సైజు కట్టలు, 3 చిన్న కట్టలు)
 • 6-7 పచ్చిమిర్చి
 • 1 tsp నిమ్మరసం

రైస్ కోసం:

 • 1 cup రైస్ (185 gms పొడి పొడిగా వండుకున్నది)
 • 1/4 కప్ నూనె
 • 5 లవంగాలు
 • 2 inch దాల్చిన చెక్క
 • 1 tsp జీలకర్ర
 • 1/4 cup జీడిపప్పు
 • 1/2 cup తాజా బటాని
 • 1 పెద్ద బంగాళా దుంప ముక్కలు
 • 1.25 tsp ఉప్పు
 • 1 tbsp నెయ్యి
 • 1 tbsp నిమ్మరసం

Instructions

 • కొత్తిమీర పేస్టు కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మెత్తని పేస్టు చేసుకోండి.
 • నూనె వేడి చేసి లవంగాలు, దాల్చిన చెక్క జీలకర్ర వేసి ఎర్రగా వేపుకోవాలి.
 • తరువాత జీడిపప్పు వేసి ఎర్రగా వేపువాలి.
 • తాజా బటానీ, బంగాళాదుంప ముక్కలు, సాల్ట్ వేసి బాటనీ మెత్తబడి, దుంపలు ఎర్రగా వేగనివ్వాలి.
 • దుంపలు వేగాక కొత్తిమీర పేస్టు వేసి పచ్చి వాసన పోయే దాక వేపుకోవాలి.
 • పచ్చి వాసన పోయాక ఉడికించిన అన్నం వేసి బాగా కలుపుకోవాలి.
 • ఆఖరున నిమ్మరసం, 1 tbsp నెయ్యి వేసి కలిపి దిమ్పెసుకోవాలి.

Video

కొత్తిమీర రైస్ / కొత్తిమీర పులావ్

Author Vismai Food

Ingredients

కొత్తిమీర పేస్టు కోసం:

 • 1.5 cups కొత్తిమీర 2 మీడియం సైజు కట్టలు, 3 చిన్న కట్టలు
 • 6-7 పచ్చిమిర్చి
 • 1 tsp నిమ్మరసం

రైస్ కోసం:

 • 1 cup రైస్ 185 gms పొడి పొడిగా వండుకున్నది
 • 1/4 కప్ నూనె
 • 5 లవంగాలు
 • 2 inch దాల్చిన చెక్క
 • 1 tsp జీలకర్ర
 • 1/4 cup జీడిపప్పు
 • 1/2 cup తాజా బటాని
 • 1 పెద్ద బంగాళా దుంప ముక్కలు
 • 1.25 tsp ఉప్పు
 • 1 tbsp నెయ్యి
 • 1 tbsp నిమ్మరసం

Instructions

 • కొత్తిమీర పేస్టు కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మెత్తని పేస్టు చేసుకోండి.
 • నూనె వేడి చేసి లవంగాలు, దాల్చిన చెక్క జీలకర్ర వేసి ఎర్రగా వేపుకోవాలి.
 • తరువాత జీడిపప్పు వేసి ఎర్రగా వేపువాలి.
 • తాజా బటానీ, బంగాళాదుంప ముక్కలు, సాల్ట్ వేసి బాటనీ మెత్తబడి, దుంపలు ఎర్రగా వేగనివ్వాలి.
 • దుంపలు వేగాక కొత్తిమీర పేస్టు వేసి పచ్చి వాసన పోయే దాక వేపుకోవాలి.
 • పచ్చి వాసన పోయాక ఉడికించిన అన్నం వేసి బాగా కలుపుకోవాలి.
 • ఆఖరున నిమ్మరసం, 1 tbsp నెయ్యి వేసి కలిపి దిమ్పెసుకోవాలి.

Tips

1 కప్ సోనా మసూరి రైస్ వాడను. ఓ కప్ అంటే 185 గ్రాములు. అన్నం వండేప్పుడు కాస్త ఉప్పు వేసి వండుకోండి. అప్పుడు ఉప్పు బాగా పడుతుంది అన్నానికి.
నేను ఫ్రోజెన్ బటానీ వాడను. అవి త్వరగా మగ్గిపోతాయ్. మీరు తాజా బటానీ వాడుకోదలిస్తే 15 నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచితే త్వరగా మగ్గిపోతాయ్ నూనెలో.
బంగాళాదుంపని 80% ఉడికించి వాడుకోవాలి. పూర్తిగా ఉడికించినది వేస్తే అన్నంలో కలిపెప్పుడు చిదురవుతుంది. ఉడికిన 80% బంగాళదుంప నూనెలో వేగేప్పుడు మగ్గిపోతుంది.
కొత్తిమీర పేస్టు గ్రీన్ కలర్ లోనే ఉండాలంటే ఫ్రిజ్ లోంచి తీసిన చల్లని నీళ్ళతో మెత్తని పేస్టు చేసుకోండి.
ఇందులో నిమ్మరసానికి బదులు 1 tbsp ఆమ్చూర్ పొడి కూడా వాడుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top