కొబ్బరి గారెలు ఇది తెలంగాణా స్పెషల్ రెసిపీ. నిమిషాల్లో తయారయ్యే సులువైన స్నాక్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆంధ్రాలో చెక్కలనే దాన్నే, తెలంగాణా లో గారెలు అంటారు. ఇవి బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటూ ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ఇవి 3-4 రోజులు నిలవుంటాయ్ కూడా.

కావలసినవి:

  • బియ్యం పిండి- 1 కప్
  • పచ్చి కొబ్బరి తురుము- ½ కప్
  • అల్లం- ½ ఇంచ్
  • జీలకర్ర- 1 tsp
  • పచ్చిమిర్చి- 4
  • సాల్ట్
  • వేడి నీళ్ళు తగినన్ని
  • నూనె వేపుకోడానికి

    విధానం:

    Directions

    0/0 steps made
    1. మిక్సీ లో అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసి మెత్తని పేస్టు చేసుకోండి
    2. ¾ నీళ్ళని మరిగించండి
    3. బియ్యం పిండి లో కొబ్బరి తురుము, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి ముద్దా వేసి బాగా కలుపుకోవాలి
    4. తరువాత వేడి నీళ్ళు కొద్దికొద్దిగా చేర్చుకుంటూ ముందు చెంచా తో కలుపుకుని ఆ తరువాత చేత్తో గట్టిగా పూరి పిండిలా పిండిని కలుపుకోవాలి
    5. పోలిథిన్ షీట్ మీద 2-3 బొట్లు నూనె వేసి నూనెతో తడి చేసుకున్న చేత్తో పిండి ముద్దని చెక్కల మాదిరి వత్తుకోవాలి, ఇది కావాలంటే నూనె రాసిన పోలిథిన్ షీట్ పెట్టి పూరి ప్రెస్ లో కూడా వత్తుకోవచ్చు
    6. వత్తుకున్న వీటిని వేడి వేడి నూనె లో వేసి ఎర్రగా వేపుకుని తీసి పక్కనుంచుకోండి
    7. ఇవి కనీసం 3-4 రోజులు నిలవుంటాయ్

    టిప్స్:

    • ఇవి చెక్కల్లా గట్టిగా కరకరలాడుతూ ఉండవు, మెత్తగా ఉంటాయి