కోల్డ్ కోకో
“కోల్డ్ కోకో” సూరత్ స్పెషల్ డ్రింక్ ఇది. సూరత్ బట్టలకే కాదండి, స్ట్రీట్ ఫుడ్ కి ఎంతో ఫేమస్. నాన్కాటాయ్ లాంటి ఫేమస్ బిస్కెట్స్ కూడా సూరత్ లోనే పుట్టింది. సూరత్ లో దాదాపుగా ప్రతీ చోట ఈ కోల్డ్ కోకో దొరుకుతుంది.ఇది చేయడం చాలా తెలిక. చక్కని చిక్కని చాక్లెట్ డ్రింక్ ఇంట్లోనే చేసుకోవచ్చు.ఈ రెసిపీ లో నేను డార్క్ చాక్లెట్ కాంపౌండ్ వాడను. డార్క్ చాక్లెట్ కి బదులు డైరీ మిల్క్ లేదా మరింకేదైనా వాడుకోవచ్చా అని అడుగుతుంటారు చాలా మంది, కాని ఆల్రెడీ షుగర్ వేసిన చాక్లెట్స్ ని ప్రాసెస్డ్ చాక్లెట్స్ అంటారు, అవి వీటికి పనికి రావు. ఈ రెసిపీ లో వాడేది ప్రాసెస్స్ చేయని చాక్లెట్. ఇవి మీకు ఆన్లైన్ లో దొరుకుతాయ్!
Tips
కోకో మిల్క్ పాలల్లో వేసేప్పుడు కలుపుతూ పోయాలి ఒకేసారి పోస్తే గడ్డ కట్టేస్తుంది
Ingredients
- ½ లీటర్ పాలు
- 2 tbsp పంచదార
- 1 tbsp కార్న్ ఫ్లోర్
- 2 tbsp కోకో పౌడర్
- ½ cup డార్క్ చాక్లెట్
- 2 tbsp నీళ్ళు
Instructions
- గిన్నె లో 2 tbsps నీళ్ళు పోసి అందులో 400 ml పాలు పోసి అడుగునుండి కలుపుతూ పొంగు రానివ్వండి
- ఓ పొంగొచ్చాక చక్కర వేసి మరగనివ్వండి
- పాలు మరుగుతుండగా 100 ml పాలల్లో కార్న్ ఫ్లోర్, కోకో పౌడర్ వేసి గడ్డలు లేకుండా కలుపుకోవాలి
- కలుపుకున్న కోకో మిల్క్ మరుగుతున్న పాలల్లో కలుపుతూ పోసుకోవాలి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది
- పాలల్లో కోకో పౌడర్ కలిసాక 1/2 కప్ డార్క్ చాక్లెట్ ముక్కలు వేసి కలుపుతూ పాలని మరించాలి. చాక్లెట్ కరిగాక జల్లెడలో పోసి వడకట్టాలి
- వడకట్టిన పాలని ఫ్రిజ్ లో 5 గంటలు ఉంచాలి, 5 గంటల తరువాత బ్లెన్డర్ లో వేసి హై-స్పీడ్ మీద తిప్పాలి. నురగనురగా వస్తుంది. వెంటనే సర్వ్ చేసుకోవాలి
Video