గార్లిక్ లచ్చా పరాటా

google ads

గార్లిక్ లచ్చా పరాటా

Author Vismai Food
Garlik lacha parata
“వెల్లుల్లి లచ్చా పరాటా” పొరలుపొరలుగా ఘుమఘుమలాడిపోతూ ఎన్ని తిన్నా ఇంకొక్కటీ అని అడగకుండా ఉండలేరు! ఇవి పంజాబ్ ధాభాల్లో చాలా ఫేమస్. ఆ తరువాత స్టార్ హోటల్స్ కి చేరింది.
లచ్చా పరాటా సహజంగా పొరలుపొరలుగా కాస్త క్రిస్పీగా కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. ఎక్కువ నెయ్యి లేదా నూనె వేసి కాల్చాలి, అప్పుడు బాగా విచ్చుకుంటాయ్ పొరలు. పొరలుపొరలుగా రావాలంటే కొన్ని కచ్చితమైన టిప్స్ పాటించాల్సిందే! అవన్నీ చాలా వివరంగా రెసిపీ లో ఉంచాను
ఈ పరాటా చేస్తున్న రోజున ఇల్లంతా సువాసనలే!!! “ఏంటి స్పెషల్ ఇవాళ” అని అడుగుతారు ఇవి కాలుతున్నప్పుడు వచ్చే సువాసనకి అంత బాగుంటుంది.ఈ పరాటా లో నేను నెయ్యి వాడాను.
నెయ్యి వెల్లుల్లి కలబోత చాలా బాగుంటుంది. మీకు నెయ్యి ఇష్టం లేదనుకుంటే నూనె వాడుకోండి.ఈ పరాటాలు నేను పూర్తిగా గోధుమ పిండి తో చేశా, కావాలంటే అచ్చంగా మైదా తో, లేదా సగం మైదా సగం గోధుమ పిండి తో కలిపి కూడా చేసుకోవచ్చుఇవి గ్రీన్ చట్నీ, పనీర్ కర్రీస్, కుర్మా తో చాలా బాగుంటుంది.

Tips

పిండి ఎంత ఎక్కువ సేపు వత్తుకుంటే అంత అంత బాగా పొరలుపొరలుగా వస్తాయి పరాటాలు
వేడి పెనం మీద వేయకపోతే పరాటాలు అప్పడాల్లా గట్టిగా వస్తాయి

Ingredients

 • 1.5 cup గోధుమ పిండి
 • 1 tbsp బొంబాయి రవ్వ
 • ఉప్పు
 • ¼ tbsp పంచదార
 • నీళ్ళు- తగినన్ని
 • 1 tbsp వేడి నూనె
 • 3 tbsp వెల్లుల్లి తరుగు

వెల్లుల్లి పేస్టు కోసం::

 • cup వెల్లుల్లి తరుగు
 • 1 tbsp పచ్చిమిర్చి తరుగు
 • 2 tbsp బటర్/నెయ్యి/నూనె
 • 1 tbsp కొత్తిమీర తరుగు

Instructions

 • కొన్ని నీళ్ళలో ఉప్పు పంచదార వేసి కరిగించి బొంబాయి రవ్వ గోధుమ పిండి వేడి నూనె కొద్దిగా వేసి కలుపుకోండి
 • తగినన్ని నీళ్ళు పోసి పిండిని కనీసం 5-6 నిమిషాలు వత్తికోవాలి అప్పుడే పోరాపోరలుగా వస్తాయి పరాటాలు
 • పిండి ముద్ద ని చిన్న చిన్న ఉండలుగా చేసి పైన కాస్త నూనె రాసి 30 నిమిషాలు తడి గుడ్డ కప్పి నానబెట్టండి
 • పాన్ లో 2 tbsps వెల్లుల్లి తరుగు పచ్చిమిర్చి తరుగు వేసి 1 tsp నెయ్యి లో సువాసన వచ్చేదాకా వేపి 2 tbsps బటర్ వేసి కరిగించండి. ఆఖరున కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపి ఓ గిన్నెలోకి తీసుకోండి.
 • నానిన పిండి ముద్దల్ని పొడి పిండి చల్లి పల్చగా వత్తుకోండి, ఆ తరువాత వెల్లుల్లి పేస్టు 1 tsp కొంచెం పొడి పిండి చల్లి పరాటా అంతా అన్నీ మూలల పూసి, ఒక అంచు దగ్గర పట్టి కుచ్చిళ్ళు లాగ ఒకదాని మీద మరో పోరా వేస్తూ, ఆఖరున రెండు అంచులని పట్టి లాగితే కాస్త సాగుతుంది, అప్పుడు ఓ చుట్టలా చుట్టుకోండి
 • చుట్టుకున్న ముద్ద మీద 1 tsp వెల్లుల్లి తరుగు వేసి వేళ్ళతో నొక్కితే వెల్లుల్లి పిండికి అంటుకుంటుంది, అప్పుడు నిదానంగా పరాటాల్లా వత్తుకోండి
 • వత్తుకున్న పరాటాలని వేడి పెనం మీద వేసి రెండు వైపులా కాల్చండి, ఆ తరువాత 1 tsp చొప్పున నెయ్యి/నూనె వేసి కాల్చి తీసుకోండి
 • కాల్చుకున్న పరాటాలని వేడిమీద రెండు చేతుల మధ్య పెట్టి కొడితే పొరలు విచ్చుకుంటాయ్
 • ఇవి వేడిగా చాలా రుచిగా ఉంటాయ్
 • వీటితో ఏ నాన్ వెజ్, పనీర్ కర్రీస్ అయినా చాలా రుచిగా ఉంటాయ్

Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top