“కాకరకాయ” అమ్మో చేదు..! అని మొహం చిట్లించే వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఈ గుత్తి కాకరకాయ/నిమ్పుడు కాకరకాయ వేపుడు కనీసం వారం పాటు నిలవుంటుంది కూడా.

ఈ కాకరకాయ వేపుడు ని కొన్ని ప్రాంతాల్లో గుత్తి కాకరకాయ ఇంకొన్ని ప్రాంతాల్లో నిమ్పుడు కాకరకాయ అని కూడా అంటారు. అలాగే ప్రాంతాన్ని బట్టి ఎన్నో రకాలుగా చేస్తారు.

కాకరకాయతో ఇది వరకు ఎన్నో రకాలు నేను చేశాను, అన్ని రేసిపీస్ లోనూ చేదు తెలియకుండా ఎలా చేసుకోవచ్చో వివరంగా టిప్స్ తో ఉంది చుడండి.

ఈ గుత్తి కాకరకాయ లో ఎన్నో రకాలున్నాయ్. ధనియాల కారం, సెనగపిండి కారం, నువ్వుల కారం, సొంటి కారం ఇలా ఎన్నో. నేను కారంగా ఉండే కొబ్బరి కారం తో చేస్తున్నా. కారంగా ఉన్నా, కొబ్బరి ఎంతో కమ్మదనాన్ని ఇస్తుంది.

వేడిగా నెయ్యి అన్నం తో చాలా బాగుంటుంది. ఏదైనా ప్రయాణాలప్పుడు, లేదా హాస్టల్స్ లో ఉండేవారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వేపుడు వారం రోజులైనా పాడు కాదు.

ఈ గుత్తి కాకరకాయ మరో తీరులో చేస్తారు ఆ తీరు కూడా వివరంగా టిప్స్ లో ఉంది చుడండి.

బెస్ట్ కాకరకాయ వేపుడు కోసం టిప్స్:

 • అసలు ఈ రెసిపీ “చిట్టి కాకరకాయలు” అంటే దొండకాయ సైజు కాకరకాయలు వాడాలి. నాకు అవి దొరకలేదు కాబట్టి ఉన్న వాటిల్లోనే కాస్త చిన్నవి వాడను. చిట్టి కాకరకాయలు చాలా బాగుంటాయ్.
 • లేత కాకరకాయలు త్వరగా వేగి పోవడమే కాక చాలా రుచిగా ఉంటాయ్, ముదురు వాటికంటే.
 • కాకరకాయల పైన చెక్కు తీసి ఉప్పు పసుపు కలిపిన మిశ్రమాన్ని పట్టించి 30 నిమిషాలు ఊరబెడితే చేదు దిగుతుంది.
 • కాకరకాయ లోపలి గింజలు నేను తీసేసాను కొందరు గింజలు  ఇష్టంగా తింటారు. వారు ఎండు మిరపకాయల్తో పాటు వేపుకుని పొడి చేసి వాడుకోవచ్చు.
 • కాకరకాయలు నూనెలో ఎర్రగా వేపి తీసి అందులో పొడి స్టఫ్ చేసాను. మీరు కావాలంటే కాకరకాయలు సగం పైన వేపి చల్లార్చి స్తఫ్ఫింగ్ కూరి మళ్ళీ వేపుకోవచ్చు. అలాగే మిగిలిన పొడి కూడా వేసి వేపుకోవచ్చు.
 • నేను చేసిన తీరులో నూనె ఎక్కువగా అవసరం ఉండదు.
 • పొడి మిగిలితే అట్టు ఇడ్లీ లేదా వేడి అన్నం లో వేసుకుని తినొచ్చు. నెల రోజులు నిలవ ఉంటుంది.

ఇవి కూడా ట్రై చేయండి

కాకరకాయ వేపుడు
కాకరకాయ నిలవపచ్చడి
కాకరకాయ ఉల్లికారం
కాకరకాయ పులుసు
పల్లీ గుత్తి వంకాయ వేపుడు
దొండకాయ మెంతి కారం
పెళ్ళిళ్ళ స్పెషల్ బెండకాయ 65

కావలసినవి:

 • 1/2 kilo- లేత చిన్న కాకరకాయలు
 • 1/4 cup ఉప్పు
 • 1 tsp పసుపు
 • 2 ఎండు కొబ్బరి చిప్పల ముక్కలు
 • 15 ఎండుమిర్చి
 • 2 tsp ధనియాలు
 • 1 tsp జీలకర్ర
 • 15 వెల్లూలి
 • 1 tbsp బెల్లం
 • 1.25 tsp ఉప్పు
 • 2 రెబ్బల కరివేపాకు
 • నూనె వేపుకోడానికి

విధానం:

Directions

0/0 steps made
 1. కాకరకాయల చెక్కు తీసి మధ్యకి చీరి లోపలి గింజలు తీసేయండి.
 2. ఉప్పు పసుపు ఓ గిన్నెలో వేసి కలుపుకోవాలి. కలుపుకున్న ఉప్పుని కాకరకాయ లోపల బయట అన్ని వైపులా రుద్ది 30 నిమిషాలు వదిలేయండి.
 3. మూకుడులో ఎండు కొబ్బరి ముక్కలు వేసి కలుపుతూ మంచి సువాసన వచ్చేదాకా వేపుకుని తీసి చల్లార్చుకోవాలి.
 4. అదే మూకుడులో ధనియాలు, జీలకర్ర, వెల్లూలి, కరివేపాకు వేసి మంచి సువాసన వచ్చే దాక లో- ఫ్లేం మీద కలుపుతూ వేపుకోవాలి.(నచ్చితే కాకరకాయ గింజలు కూడా వేసి వేపుకోవచ్చు).
 5. రెండూ మిక్సీ లో వేసి అందులోనే ఉప్పు బెల్లం వేసి పొడి చేసుకోండి.
 6. ఊరుతున్న కాకరకాయలని గట్టిగా పిండితే చేదు దిగుతుంది.
 7. మూకుడులో నూనె వేడి చేసి అందులో పిండుకున్న కాకరకాయలు వేసి నూనె తోస్తూ ఎర్రగా వేపుకుని తీసుకోవాలి
 8. చల్లారిన కాకరకాయల్లో కొబ్బరి కారం స్టఫ్ఫ్ చేసి అన్నం తో సర్వ్ చేసుకోండి.
 9. నచ్చితే కాకరకాయలు  సగం పైన వేపుకుని చల్లార్చి అందులో పొడి కూరి మళ్ళీ నూనె లో వేపుకోవచ్చు. ఆఖరున మిగిలిన పొడి వేసుకోవచ్చు.