గోంగూర కొబ్బరి పచ్చడి
"గోంగూర పచ్చడి" అంటే తెలుగు వారికి ప్రాణం. అందుకే ఎన్ని రకాలో గోంగూరతో. ఇది గోంగూర కొబ్బరి పచ్చడి. కమ్మగా, కారంగా, పుల్లగా చాలా రుచిగా ఉంటుంది, అన్నం, అట్టు చపాతీతో.వేడిగా అన్నం-నెయ్యి తో అదుర్స్ అంటారు ఈ పచ్చడి తింటే. నాకు చాలా ఇష్టం. కొబ్బారి పచ్చడులు నేను ఎన్నో రకాలు చేస్తాను అందులో కొన్ని పోస్ట్ చేశా కూడా, ఇంకా కొన్ని పోస్ట్ చేయాలి. మామిడికాయ, టమాటో, వంకాయ, చింతకాయ, దోసకాయ, ఉసిరికాయ ఇలా ఎన్నో ఎన్నో కొబ్బరితో. ఆఖరికి పచ్చిమిర్చి తో కూడా చేస్తాను కొబ్బరి పచ్చడి. నేను ఇది వరకు గోంగూర పచ్చడి చేశాను అది ట్రై చేయండి.ఈ గోంగూర పచ్చడి నేను మొదట ఒంగోల్లో మా బందువుల ఇంట్లో తిన్నాను. దానికి కొన్ని మార్పులు చేసి మీకు పోస్ట్ చేస్తున్న.
Tips
బెస్ట్ గోంగూర పచ్చడికి కొన్ని టిప్స్.
మెంతులు ఎర్రగా వేగి తీరాలి అప్పుడే రుచి, లేదంటే చేదు
కావాలంటే గోంగూర ఎక్కువ, కొబ్బరి తక్కువగా వేసుకుని, లేదా కొబ్బరి ఎక్కువ, గోంగూర తక్కువగా వేసుకుని కూడా చేసుకోవచ్చు. నేను కొబ్బరి గోంగూర సమానంగా వేసుకుని చేశా
గోంగూర పచ్చడికి కారం, ఉప్పు, నూనె ఉంటేనే రుచి
నేను ముదురు ఎర్ర గోంగూర/ కొండ గోంగూర వాడను. అది పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చింతపండు వేసాను, మీరు తెల్ల గోంగూర వాడితే ఇంకొద్ది చింతపండు పడుతుంది. పులుపు తెలిసితెలియనట్లు ఉండాలనుకుంటే తగ్గించుకోవచ్చు
ముదురు ఆకు అయితేనే ఆకు మగ్గి తినేందుకు బాగుంటుంది. లేత ఆకు అయితే పేస్టు అయిపోతుంది మగ్గి.
Ingredients
- 4 కట్టలు గోంగూర (150 gms)
- 1 కప్ పచ్చి కొబ్బరి (150 gms)
- 10 ఎండు మిర్చి
- 1 tsp మెంతులు
- 1 tbsp ఆవాలు
- 1 tsp ధనియాలు
- 1 tsp జీలకర్ర
- 1.5 tsps ఉప్పు
- 2 tsps చింతపండు గుజ్జు/తగినంత
- 1/2 కప్ నూనె
- 1 tsp ఆవాలు
- 5 దంచిన వెల్లూలి
- 1/4 tsp ఇంగువ
- 1 రెబ్బ కరివేపాకు
Instructions
- మూకుడులో మెంతులు వేసి ఎర్రగా వేపుకోవాలి.
- మెంతులు సువాసన వస్తుండగా ఆవాలు వేసి చిటపటమనేదాక వేపుకోవాలి
- తరువాత ఎండుమిర్చి ధనియాలు, జీలకర్ర వేసి వేపుకోవాలి. ఆ తరువాత పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేపుకుని తీసి నీళ్ళు వేయకుండా మెత్తని పేస్టు చేసుకోవాలి
- అదే మూకుడు లో 1/4 కప్ నూనె వేసి కడిగి ఆరబెట్టిన గోంగూర వేసి ఆకు మగ్గేదాక వేపుకోవాలి, ఆఖరున చింతపండు గుజ్జు వేసి వేపి గ్రైండ్ చేసుకున్న కొబ్బరిలో గోంగూర, ఉప్పు వేసి ఓ తిప్పు తిప్పి తీసుకోవాలి
- తాలింపు కోసం మిగిలిన 1/4 కప్ నూనె వేసి వేడి చేసి అందులో ఆవాలు, దంచిన వెల్లూలి, ఇంగువ కరివేపాకు వేసి వేపి పచ్చడిలో కలిపెయడమే.
Video
గోంగూర కొబ్బరి పచ్చడి
Ingredients
- 4 కట్టలు గోంగూర 150 gms
- 1 కప్ పచ్చి కొబ్బరి 150 gms