“గోజా” ఇది బెంగాల్, ఓడిశా రాష్ట్రాల్లో చాలా ఫేమస్ స్వీట్. ఓడిశా రాష్రం లో దేవాలయాల్లో ప్రసాదం గా కూడా ఇస్తారు! ఇది చేయడం చాలా తేలిక. ఓ సారి చేసి పెట్టుకుంటే కనీసం వారం పాటు నిలవుంటాయ్ కూడా. ఇవి బయట క్రిస్పీ గా లోపల సాఫ్ట్ గా, జ్యుసీగా చాలా బాగుంటాయ్! పిల్లలు, పెద్దలు అందరికి నచ్చుతుంది.
ఇది నేను మొదటగా ఓ బెంగాలి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు తిన్నాను. చాలా నచ్చింది. ఇది ఎక్కడ దొరుకుతుంది నాకు కావాలి అని అడిగాను, అప్పుడు తను ఇవి ఇళ్ళలో చేసుకునే స్వీట్, బయట స్వీట్ హాల్స్ లో దొరకావ్ అని చెప్పాడు. సో నాకు బాగా నచ్చిన ఈ రెసిపీ ని మీకు పరిచయం చేద్దామని వారిని అడిగి తెలుసుకుని, ఈ రెసిపీ షూట్ చేసాను!

కావలసినవి:

 • మైదా- 200 gms
 • వంట సోడా- 1/2 చెంచా
 • కలోంజి(ఉల్లి గింజలు)- ¼ చెంచా
 • నెయ్యి- 2 tbsps
 • నీళ్ళు- 150 ml
 • పంచదార- 300 gms

విధానం:

Directions

0/0 steps made
 1. మైదా లో సోడా, కలోంజి, నెయ్యి వేసి బాగా కలుపుకుని, ఆ తరువాత నీళ్ళు పోసుకుంటూ పిండి బాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి.
 2. ఇప్పుడు పాకానికి, పంచదార లో నీళ్ళు పోసి ఓ తీగపాకానికి కాస్త తక్కువ, గులాబ్ జామూన్ పాకానికి కాస్త చిక్కగా పాకం పట్టుకుని పక్కనుంచుకోండి
 3. ఇప్పుడు పిండి ముద్దని చతురస్రాకారం లో షేప్ చేసుకోండి, తరువాత అప్పడాల కర్ర తో నిదానం గా రోల్ చేసుకోండి. ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది.
 4. ఈ ముద్ద మారీ పల్చగా కాకుండా అంగుళం మందంగా ఉండేలా రోల్ చేసుకోండి.
 5. ఇప్పుడు చిన్న చిన్న బిళ్లలుగా కట్ చేసుకోండి
 6. నూనె గోరువెచ్చగా చేసి, కట్ చేసుకున్న బిళ్ళలు వేసి వదిలేయండి, అవి నిదానంగా ఓ నిమిషం తరువాత పైకి తెలతాయ్, అప్పుడు మంటని హై ఫ్లేం మీద కి పెట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి.
 7. లైట్ గోల్డెన్ కలర్ రాగానే మంట మీడియం-ఫ్లేం లోకి తగ్గించి క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రే చేసుకోండి
 8. ఎర్రగా వేగాక తీసి వెంటనే వేడి పాకం లో వేసి 30 సెకన్లు ఉంచి తీసేయండి, చల్లారాక డబ్బాలో పెట్టుకోండి వారం పాటు నిలవుంటాయ్!

టిప్స్:

 • ఈ రెసిపీ కి కలోంజి తప్పక వాడాలి ఇది అన్ని supermarkets లో దొరుకుతుంది. కలోంజి అంటే ఉల్లి గింజలు. దీనిలోనే ఉంది ఫ్లేవర్ అంతా
 • ఇందులో యాలకల పొడి అస్సలు వేయరు
 • నూనె లో గోజా వేసేప్పుడు నూనె కచ్చితంగా గోరు వెచ్చగా మాత్రమే ఉండాలి, వేడి నూనె లో వేస్తే లోపల పచ్చిగా ఉంటుంది పైన ఎర్రగా వేగుతాయ్!
 • పాకం లో 30 సెకన్ల కంటే ఎక్కువ సేపు ఉంటె గోజాలు మెత్తగా అవుతాయ్.