“పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై” అందరికీ ఇష్టమే! ఇది తెలుగు రాష్ట్రాలకంటే మహారాష్ట్ర, కర్నాటక రాష్టారాల్లో ఎక్కువగా తింటుంటారు. దీన్నే తెలుగులో చందువ చేప అని కూడా అంటారు. ఈ చేప కి ముళ్ళు తక్కువ. పిల్లలు కూడా చాలా సులభంగా తినొచ్చు. ఈ రెసిపీ మీకు క్రిస్పీ గా కారంగా పుల్లాగా ఉంటుంది. అందరికి నచ్చుతుంది.

కావలసినవి:

 • చందువ చేపలు- 2( 500 gms)
 • నూనె- ¼ కప్

మసాలా కోసం:

 • అల్లం వెల్లూలి పేస్టు- 1 tbsp
 • కారం- 1 tsp
 • ఉప్పు
 • మిరియాల పొడి- ½ tsp
 • పసుపు- ¼ చెంచా
 • నిమ్మరసం- 1 tbsp

కోటింగ్ కోసం:

 • సెనగపిండి- 2 tbsps
 • బొంబాయ్ రవ్వ- ¼ కప్

విధానం:

Directions

0/0 steps made
 1. బాగా కడిగిన చందువ చేపలకి అడ్డంగా గాట్లు పెట్టి పక్కనుంచుకోండి
 2. మసాలా కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి కలిపి చేపకి రెండు పక్కలా లోపలా పట్టించి 30 నిమిషాలు వదిలేయండి
 3. 30 నిమిషాల తరువాత రవ్వ, సెనగపిండి కలిపి మసాలా పట్టించిన చేపకి ఈ రవ్వ ని బాగా అన్ని వైపులా పట్టించండి
 4. ఇప్పుడు 2 tbsps నూనె పెనం మీద వేసి చేపముక్కలు సర్ది మీడియం ఫ్లేం మీద మాత్రమే రెండు వైపులా చేపని ఎర్రగా కాల్చుకోవాలి
 5. చేపని ఒక్కో వైపు 7-8 నిమిషాలు కాల్చి పైనా నూనె రాసి మరో వైపు తిప్పి మరో 7-8 నిమిషాలు కాలుచుకుంటూ క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి.
 6. సరిగా ఫ్రై అవ్వడానికి 20 నిమిషాల టైం పడుతుంది. గోల్డెన్ కలర్ లోకి రాగానే దింపి సర్వ్ చేసుకోండి.

టిప్స్:

 • నచ్చితే ఇందులో కాస్త పుదినా పేస్టు కూడా వేసుకోవచ్చు.