చల్ల పుణుకులు ఇవి ఆంధ్రుల ప్రేత్యేకమైన వంటకం. ఇవి ఇళ్ళలో చేసుకునేవే గాని సహజంగా బండ్ల మీద దొరకవ్!
నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది, ఆ తరువాత మా అమ్మ చాలా సార్లు చేసేది కాని, ఎందుకో అమ్మమ్మ చేతి రుచి రాలేదు. అదేంటి అమ్మమ్మ చేతి రుచి రాలేదు అంటే అమ్మ కి కోపం వచ్చేది, ఏమో నాకేం తెలుసు నేను అవే వేసాను అలాగే వేపాను అని కసురుగా అంటూ, నీకు ఈ మధ్య బాగా రుచులేక్కువయ్పోతున్నాయ్ అని చిరాకు పడుతుందే కాని ఆ రుచి కోసం ప్రయత్నం చేయలేదు, నా కామెంట్స్ తట్టుకోలేక అవి చేయడం మానేసింది.
ఇదే విషయాన్నీ నేను శ్వేతకి చాలా సార్లు చెప్పాను, శ్వేతా నేను చేస్తా నాకు తెలుసు అని ట్రై చేసింది, పర్ఫెక్ట్ గా వచ్చాయ్, అప్పుడు ఈ రెసిపీ షూట్ చేసి పోస్ట్ చేశాను.
ఇవి మీకు పుల్లపుల్లగా భలేగా ఉంటాయ్, మామూలు పునుకుల కంటే కూడా క్రిస్పీగా చాలా బాగుంటాయ్. ఎవ్వరు కూడా ఒక్క పునుకుతో ఆపితే ఒట్టు అంత బాగుంటాయ్.

కావలసినవి:

 • పెరుగు- ముప్పావు కప్
 • నీళ్ళు- 100 ml
 • బియ్యంపిండి- 1 కప్
 • పచ్చి సెనగపప్పు- 1 tbsps
 • పచ్చి మిర్చి- 1 తరుగు
 • కరివేపాకు- 1 రెబ్బ తరుగు
 • కొత్తిమీర- 2 tbsps
 • జీలకర్ర- 1 tsp
 • ఉప్పు
 • వంట సోడా- చిటికెడు
 • నూనె వేపడానికి సరిపడా

విధానం:

Directions

0/0 steps made
 1. పెరుగులో నీళ్ళు పోసి బాగా చిలుక్కుని అందులో బియ్యం పిండి, సెనగపప్పు వేసి పునుకుల పిండిలా బాగా కలుపుకుని రాత్రంతా నాననివ్వండి లేదా కనీసం 6 గంటలు నాననివ్వండి
 2. నేను ఆరు గంటలు నానాబెట్టాను సాయంత్రం స్నాక్స్ కోసం అన్నట్లు
 3. ఇప్పుడు ఇందులో, పచ్చి మిర్చి, జీలకర్ర, కరివేపాకు తరుగు, సోడా, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి
 4. తరువాత నూనె వేడి చేసి చిన్న చిన్న బొందాలుగా వేసి మీడియం-ఫ్లేం మీద ఎర్రగా వేపి తీసి పక్కనుంచుకోండి

టిప్స్:

 • అసలు కొలత కప్పు మజ్జిగకి కప్పు బియ్యం పిండి, కాబట్టి అవసరమైతే కొద్ది నీళ్ళు వేసుకొని
 • పిండి జారైతే నూనె బాగా లాగేస్తే
 • నూనె బాగా వేడి చేసుకుని మంట మీడియం ఫ్లేం లోకి పెట్టి పుణుకులు వేసి ఎర్రగా వేపుకోండి, హై ఫ్లేం మీద వేపితే రంగోస్తాయ్ కాని సరిగ్గా వేగవు.