“చాక్లెట్ లస్సి” తాగుతున్న కొద్ది ఇంకా ఇంకా తాగాలనిపించే కమ్మటి లస్సీ. పిల్లలు చాలా ఇష్టపడతారు. చేయడం కూడా చాలా తేలిక. అన్నీ రెడీగా ఉంటె 2 నిమిషాల్లో తయారు. అందరు లస్సీలు చేస్తారు కానీ నా స్టైల్ లో లస్సీ చిక్కగా క్రీమీ గా చాలా రుచిగా ఉంటుంది. దానికి చిన్న చిట్కా ఉంది, అలా మీరు చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇది స్పెషల్ రోజుల్లో, లేదా పార్టీస్ ఇంకా వేసవి కాలం లో చాలా పర్ఫెక్ట్.

కావలసినవి:

  • చల్లని కమ్మని మీగడ తీసేసిన పెరుగు- 300 gms
  • గంట పాటు ఫ్రీజర్ లో ఉంచి గద్దకట్టించిన పాలు- 200 ml
  • పంచదార- 2 tbsps
  • చాక్లెట్ సిరప్- 2 tbsps
  • కోకో పౌడర్- 1 tbsp

విధానం:

Directions

0/0 steps made
  1. అన్నీ మిక్సీ జార్ లో వేసి హై-స్పీడ్ మీద 2 నిమిషాలు బ్లెండ్ చేయండి, చల్లగా సర్వ్ చేయండి.

టిప్స్:

  • వాడే పెరుగు కమ్మగా చల్లగా ఉండాలి, పాలు గడ్డ కట్టించినవి వాడితే ఐస్ వాడాల్సిన అవసరం ఉండదు
  • ఐస్ వాడితే వచ్చే రుచి ఇలా పాలని గడ్డకట్టించి వేసే చేసి లస్సీ రుచి చాలా భిన్నంగా ఉంటుంది
  • సాధ్యమైనంత హై-స్పీడ్ మీద బ్లెండ్ చేయాలి అప్పుడే నురనురగా ఎంతో రుచిగా ఉంటుంది.