చికెన్ నగ్గెట్స్

google ads

చికెన్ నగ్గెట్స్

Author Vismai Food
chicken-suggets
చికెన్ తో తక్కువ టైం లో అయిపోయే బెస్ట్ స్నాక్ తినాలనుకుంటే “చికెన్ నగ్గెట్స్” ట్రై చేయండి. తక్కువ టైం లో అయిపోతుంది, చేసిన ప్రతీ సారి చాలా బాగా వస్తాయి.
చికెన్ తో ఏదైనా స్నాక్స్ అనగానే మనకి చికెన్ పకోడా, లేదా చికెన్ వడలు గుర్తొస్తాయ్. వాటికి కొంచెం పనుంటుంది. చికెన్ నానబెట్టడం, ఉడకబెట్టి వడలు తట్టడాలు ఉంటాయ్. కానీ, దీనికి అలాంటివేమి ఉండవు. వెంటనే చేసుకోవడమే.
టమాటో సాస్ తో చాలా రుచిగా ఉంటాయ్. పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. నిజంగా ఓ మాట చెప్పగలను. ఒకటి తినడం మొదలెడితే ఆపలేరు. ఎప్పుడు నోట్లో పెట్టుకున్నారు, ఎప్పుడు గొంతులోకి దిగింది అన్నట్లుగా జారిపోతాయ్ ఈ నగ్గెట్స్.
నగ్గెట్స్ చాలా రకాలుగా చేస్తారు. నేను పూర్తిగా మనకి దొరికే పదార్ధాలతో ఒరిజినల్ రుచి పాడుచేయకుండా చేస్తున్నా. చేసే ముందు ఓ సారి కింద టిప్స్ చదివి చేయండి. చాలా బాగా వస్తాయి.

Tips

బోన్లెస్ చికెన్ ని మెత్తగా గట్టి ముద్ద అయ్యేదాకా పేస్టు చేయాలి.
గ్రైండ్ చేసుకోడానికి నీరు అవసరం లేదు. ఒకవేళ అవసరం అనిపిస్తే 1 tbsp నీరు వేసుకోండి.
నగ్గెట్స్ ఏ షేప్ లో అయినా చేసుకోవచ్చు.
నగ్గెట్స్ ని రెండు సార్లు ఎగ్ లో ఓ సారి మైదా/ కార్న్ ఫ్లోర్ లో ముంచి మళ్ళీ బ్రెడ్ పొడి తో కోటింగ్ ఇస్తే పర్ఫెక్ట్ గా కరకరలాడుతూ చాలా బాగుంటాయ్.
నేను రెడీమేడ్ బ్రెడ్ క్రంబ్స్ “paanko” వాడను. ఇవి మీకు online లేదా సూపర్ మార్కెట్స్ లో దొరికేస్తుంది. ఒకవేళ లేనట్లైతే బ్రెడ్ ని ఎండబెట్టి అట్టలా అయ్యాక పొడి చేసి వాడుకోండి.
ఇదే కొలతలతో చేస్తే నగ్గెట్స్ విరగవు. ఒకవేళ సాఫ్ట్ అయి విరిగిపోతుంటే, నగ్గెట్స్ చేసి గంట పాటు ఫ్రిజ్ లో ఉంచి, తరువాత చల్లనివే నూనె లో వేసి ఎర్రగా వేపుకుని తీసుకోవాలి.
నూనె బాగా వేడెక్కాక మీడియం ఫ్లేం మీద క్రిస్పీ గా ఎర్రగా వేపుకోవాలి. హై ఫ్లేం మీద వేపితే రంగోస్తాయ్, కానీ చికెన్ లోపల ఉడకదు.
ఇందులో నేను చిల్లి ఫ్లేక్స్ వాడను. ఇవి రెడీమేడ్ గా దొరుకుతాయ్. లేనట్లైతే 15 సెకన్లు రెండు ఎండు ఇర్చి కాల్చి పొడి చేసి వాడుకోండి.

Ingredients

నగ్గెట్స్ కోసం:

 • మిల్క్ బ్రెడ్ (అంచులు తీసేసినవి)
 • 200 gms బోన్లెస్ చికెన్
 • 3/4 tsp మిరియాల పొడి
 • 1 tsp ఒరేగానో
 • 1 tsp సాల్ట్
 • 1 చిటికెడు పసుపు
 • 1 tsp చిల్లి ఫ్లేక్స్

కోటింగ్ కోసం:

 • 2 గుడ్లు బాగా గిలకోట్టినవి
 • ½ cup కార్న్ ఫ్లోర్/మైదా
 • 1 cup బ్రెడ్ పొడి
 • నూనె వేపుకోడానికి

Instructions

 • మిక్సీ లో అంచులు తీసేసిన బ్రెడ్ వేసి పొడి చేసుకోండి.
 • పొడిలో నగ్గెట్స్ కోసం ఉంచిన సామానంతా వేసి మెత్తని గట్టి పేస్టు చేసుకోండి.
 • చేతికి నూనె రాసుకుని చిన్న నిమ్మకాయంత నగ్గెట్స్ ముద్ద తీసుకుని దాన్ని పొడవుగా ఎక్కడా పగుళ్ళు లేకుండా తట్టుకోవాలి. తరువాత వేలితో మధ్య లో నెమ్మదిగా నొక్కి, నగ్గేట్ మొత్తాన్ని ఓ సారి నొక్కి పక్కనుంచుకోండి. ఇలాగే అన్నీ చేసుకోండి.
 • నగ్గెట్స్ ని ముందు గుడ్డులో ముంచి తరువాత కార్న్ ఫ్లోర్లో కోట్ చేసుకోవాలి. తరువాత మళ్ళీ గుడ్డు లో ముంచి బ్రెడ్ పొడి లో వేసి 2-3 సార్లు అన్ని వైపులా పట్టేలా బాగా కోట్ చేసుకోవాలి.
 • కోట్ చేసుకున్న నగ్గెట్స్ ని ఒక్కొటిగా వేడి నూనె లో వేసి మీడియం ఫ్లేం మీద ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుని తీసుకోవాలి.

Video

చికెన్ నగ్గెట్స్

Course Dessert
Author Vismai Food

Ingredients

నగ్గెట్స్ కోసం:

 • మిల్క్ బ్రెడ్ అంచులు తీసేసినవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top