చికెన్ పకోడీ ఇదంటే అందరికి ఇష్టమే! సరిగ్గా చేస్తే ఒక్కరే అర కిలో కూర తిన్నా ఆశ్చర్యం లేదు! చేసే తీరు లో చేస్తే చాలా బాగా వస్తుంది కరకరలాడుతూ.
ఎప్పుడు చేసినా అందరికి నచ్చి మెచ్చే విధంగా రావాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయ్, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ విధానాన్ని మేము కొన్నేళ్ళగా చేస్తూనే ఉన్నాం, అదే రెసిపీ ని ఛానల్ లో కుడా పోస్ట్ చేసాం, ఎందరో పర్ఫెక్ట్ గా కుదిరింది అని కామెంట్ కుడా చేసారు! మీకు తప్పక పర్ఫెక్ట్ గా వస్తుంది పకోడీ!

కావలసినవి:

 • చికెన్ ఎముకలతో- ½ కిలో( 30 నిమిషాలు ఉప్పు నీటిలో నాన బెట్టినది)
 • అల్లం వెల్లూలి పేస్టు- 1 tsp
 • నిమ్మరసం – 1 tbsp
 • సాల్ట్
 • కారం- 2 tsps
 • గరం మసాలా- 1 tsp
 • వేయించిన జీలకర్ర పొడి- 1 tsp
 • కరివేపాకు తరుగు- 2 tsps
 • కొత్తిమీర తరుగు- 2 tsps
 • బియ్యం పిండి- 2 tsps
 • సెనగపిండి- 2 tsps
 • నూనె – వేయించడానికి సరిపడా

విధానం:

Directions

0/0 steps made
 1. 30 నిమిషాలు ఉప్పు నీటిలో నానా బెట్టిన చికెన్ లో అన్నీ వేసి ముక్కలకి బాగా పట్టించండి.
 2. మసాలా పట్టించిన ముక్కలని మూతపెట్టి కనీసం 4 గంటలు ఫ్రిజ్ లో నానా నివ్వండి. కుదిరితే రాత్రే ముక్కలకి మసాలా పట్టించి ఫ్రిజ్ లో నానానివ్వండి అప్పుడు ఇంకా బాగుంటుంది పకోడీ.
 3. ముక్కలు బాగా నానిన తరువాత వేడి వేడి నూనె లో వేసి మాంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చే దాకా మీడియం–ఫ్లేం మీద మాత్రమే వేపుకోండి.
 4. ఎర్రగా వేగాక తీసి వేడి వేడిగా ఉల్లిపాయ పచ్చిమిర్చి తో సర్వ్ చేసుకోండి.

టిప్స్:

 • చికెన్ ని ఉప్పు నీటిలో నానా బెడితే ముక్క చాలా జుసీగా లోపలిదాక ముక్క మగ్గి రుచిగా ఉంటుంది.
 • చికెన్ కి ఉప్పు పట్టి ఉంటుంది కాబట్టి ఉప్పు చూసుకుని వేసుకోండి.
 • చికెన్ ఎంత ఎక్కువ నానితే అంత రుచోస్తుంది పకోడీ కి.