చికెన్ మోమొస్

google ads

చికెన్ మోమొస్

Author Vismai Food
CHICKEN MOMOS
“చికెన్ మోమొస్” అందరికీ ఎంతో ఇష్టమైన ఇండో చైనీస్ రెసిపీ. ఇప్పుడు సిటీస్ లో దాదాపుగా ప్రతీ వీధి చివర్న పానీ పూరి బండి పక్కనే ఉంటోంది మోమొస్ స్టాల్ కూడా. స్టీం చేసి చేసే ఈ మోమొస్కి ప్రపంచమంతా అభిమానులున్నారు. ఎవరో చేస్తున్నారు కాబట్టి మనం కోనేసుకుంటున్నాము ఇంత తేలికైన రెసిపీని.
ఈ రెసిపీ నా టిప్స్ తో చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయ్. హేల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు.మోమొస్ లో ఎన్నో వెరైటీలు వచ్చేసాయ్. మోమొస్ అన్నింటికీ బయట వాడే షీట్స్ ఒక్కటే, లోపలి స్టఫ్ఫింగ్ మారుస్తూ ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. తందూరీ మోమొస్, ఫ్రైడ్ మోమొస్, చాక్లెట్ మోమొస్ ఇలా ఎన్నో ఎన్నో.
మోమొస్ తో పాటు ఓ చట్నీ ఇస్తారు అది త్వరలో పోస్ట్ చేస్తా.మోమొస్ లో స్టఫ్ చేసే చికెన్ మిశ్రమం పచ్చి చికెన్ ని గ్రైండ్ చేసినదే, పచ్చిది వాడినా చికెన్ మగ్గిపోతుంది. కానీ బోన్లెస్ చికెన్ ని 30 నిమిషాలు 1 tbsp ఉప్పు వేసి నీళ్ళలో నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చికెన్ సాఫ్ట్ గా అయ్యి ఉడికిపోతుంది.
చాలా మంది నన్ను మైదా కి బదులు గోధుమ పిండి తో చేయొచ్చా అని అడుగుతుంటారు. ఉన్న విషయన్ని నేను చెప్పదలుచుకున్నాను. మనం ఉన్న రెసిపీ మనకు తెలిసిన అలవాటు పడిన రెసిపీని మార్చి చేయాలనుకుంటే చాలా సందర్భాల్లో అనుకున్న రుచి రూపం రాకపోవచ్చు.
పర్లేదు…ఎలా ఉన్నా తినేస్తాము అనుకుంటే ఒరిజినల్ రెసిపీ తో పోల్చుకోకుండా ఆ రెసిపీని అలాగే ఎంజాయ్ చేయగలిగితే తప్పకుండ మైదా కి బదులు గోధుమ పిండి వాడుకోవచ్చు అనే చెప్తాను.నన్నడిగితే మోమొస్ లోని రుచంతా పైన వాడే పల్చని షీట్స్ లోనే ఉంది.
పల్చగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలి. అలా కరిగిపోవాలంటే పల్చని పొరలా షీట్స్ వత్తుకోవాలి. అంత పల్చగా ఉన్నా లోపలి స్టఫ్ఫింగ్ ఎప్పుడూ బయటకి రాకూడదు అది పర్ఫెక్ట్ మోమొస్ అంటే.
అలా పర్ఫెక్ట్ గా మోమొస్ రావాలంటే ఈ టిప్స్ పాటించండి.ఈ రెసిపీ చాలా వివరంగా ఫోటోలతో ఉంది చుడండి
మోమొస్ పర్ఫెక్ట్ గా రావాలంటే:
మైదా పిండి నీళ్ళతో సాఫ్ట్ గా తడుపుకుని కనీసం 5-6 నిమిషాలు వత్తుకోవాలి. అప్పుడు మోమొస్ ఎంత పల్చగా వత్తినా, మడిచినా పగలవ్ చక్కగా సాగుతాయ్.
బాగా కలుపుకున్న పిండిని 30 నిమిషాలు తడి గుడ్డ కప్పి నానాబెట్టాలి.
నానిన పిండి ముద్దలని మధ్య లో మందంగా చుట్టూ సాధ్యమైనంత పల్చని షీట్స్ గా వత్తుకోవాలి, అప్పుడు స్టఫ్ఫింగ్ బయటకి రాదు.స్టీం 15-17 నిమిషాలు చేసుకోండి.
8 నిమిషాలు హై ఫ్లేం మీద 7 నిమిషాలు లో-ఫ్లేం మీదమోమొస్ కోసం ఓ స్టీమర్ ఉంటుంది అది ఆన్లైన్ లో దొరుకుతుంది. లేని వారు మరుగుతున్న నీళ్ళలో ఓ కప్ ఉంచి దాని మీద చిల్లుల జల్లెడ ఉంచి దాన్ని నూనె తో గ్రీస్ చేసి మోమొస్ పెట్టి స్టీం చేసుకోవచ్చు.

Tips

నీళ్ళు మరిగిన తరువాతే మోమొస్ స్టీం చేయాలి.

Ingredients

స్టఫ్ఫింగ్ కోసం:

 • 100 gms బోన్లెస్ చికెన్
 • 2 tbsp ఉల్లికాడల తరుగు
 • 1 tbsp ఉల్లిపాయ తరుగు
 • 1 tbsp పచ్చిమిర్చి తరుగు
 • 1 tbsp వెల్లూలి తరుగు
 • ½ tbsp అల్లం తరుగు
 • ఉప్పు
 • ½ tbsp నల్ల మిరియాల పొడి
 • ½ tbsp తెల్ల మిరియాల పొడి
 • ½ tbsp లైట్ సోయా సాస్
 • ½ tbsp వెనిగర్

మొమో షీట్స్ కోసం:

 • 1 cup మైదా
 • ఉప్పు
 • నీళ్ళు

Instructions

 • మైదా పిండి లో నీళ్ళు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  Chicken-Momos-Steps-1
 • కలుపుకున్న పిండి చేతి మణికట్టుతో 5-6 నిమిషాలు ఎక్కడా పగుళ్ళు లేకుండా వత్తుకోవాలి.
  Chicken-Momos-Steps-2
 • వత్తుకున్న పిండిని ఉసిరికాయంత బాల్స్ చేసి మళ్ళీ తట్టి తడి గుడ్డ కప్పి 30 నిమిషాలు నానబెట్టాలి.
  Chicken-Momos-Steps-3
 • 30 నిమిషాలు ఉప్పేసిన నీళ్ళలో నానబెట్టిన చికెన్ ని మిక్సీ లో వేసి మెత్తని పేస్టు చేసుకోవాలి. చికెన్ పేస్టు లో స్టఫ్ఫింగ్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి బాగా కలిపి పక్కనున్చుకోవాలి.
  Chicken-Momos-Steps-4
 • 30 నిమిషాలు నానిన పిండిని పల్చని షీట్స్ గా వత్తుకోవాలి. మధ్య లో మందంగా అంచులు సాధ్యమైనంత పల్చగా వత్తుకోవాలి. వత్తుకున్న షీట్స్ లో చికెన్ స్టఫ్ఫింగ్ ఉంచి ముందు అంచులు సీల్ చేసి కుచ్చులుగా వేసి మడిచి సీల్ చేసుకోండి. ఫొటోస్ లో మాదిరిగా.
  Chicken-Momos-Steps-5
 • నీళ్ళు మరిగించి మోమొస్ స్టీమర్ పెట్టి ఆయిల్ రాయండి.(మోమొస్ స్టీమర్ లేనివారు ఎలా చేయాలో పైన వివరంగా ఉంచాను చూడగలరు).
  Chicken-Momos-Steps-6
 • ఇందులో మోమొస్ ఉంచి 8 నిమిషాలు హై ఫ్లేం మీద 7 నిమిషాలు లో ఫ్లేం మీద స్టీం కుక్ చేసి వేడి గా సర్వ్ చేసుకోండి.
  Chicken-Momos-Steps-7

Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top