“చిత్రాన్నం” ఈ ప్రసాదం శైవాలయాల్లో, ఇంకా ధనుర్మాసం లో విష్ణువుకి, సంతోషిమాత వ్రతం లోనూ ప్రేత్యేకంగా నివేదిస్తారు. ఇది శ్రీశైల మల్లికార్జునినికి కూడా నివేదిస్తారు. ఈ ప్రసాదం చేయడం చాలా తేలిక, ఎంతో రుచిగా ఉంటుంది. చిత్రాన్నం అంటే రాయలసీమ ఇంకా కర్ణాటక రాష్ట్రాల్లో పులిహోర. కానీ ఈ తీరుగా చేసే ప్రసాదాన్ని కూడా చిత్రాన్నం అనే అంటారట. ఇది ప్రసాదంగా మాత్రమే కాదు, పిల్లల లంచ్ బాక్సులకి కూడా పెట్టి పంపొచ్చు చాలా రుచిగా ఉంటుంది చల్లారినా.

కావలసినవి:

 • బియ్యం- ½ కప్
 • పచ్చి సెనగపప్పు- 2 tbsps
 • పచ్చి కొబ్బరి తురుము – ¼ కప్
 • ఉప్పు- రుచికి సరిపడా
 • మిరియాలు- ½ tsp
 • జీడిపప్పు- 2tbsps
 • కరివేపాకు- 1 రెబ్బ
 • ఎండు మిర్చి- 1
 • ఆవాలు- ½ tsp
 • జీలకర్ర- ½ tsp
 • మినపప్పు- ½ tsp
 • నెయ్యి- ¼ కప్
 • నీళ్ళు- 1 కప్

విధానం:

Directions

0/0 steps made
 1. బియ్యాన్ని లో- ఫ్లేం మీద తెల్లగా అయ్యేదాకా మాత్రమే వేపుకోవాలి, ఆ తరువాత దింపి కడిగి నీళ్ళని వడకట్టాలి
 2. ఇప్పుడు కుక్కర్ లో 30 నిమిషాలు నానబెట్టిన పచ్చిసేనగపప్పు, కడిగిన బియ్యం, ఉప్పు బియ్యానికి 4 ఇంతలు నీళ్ళు పోసి కుక్కర్ మూతపెట్టి అన్నం వండుకున్నట్లు వండుకోవాలి
 3. నెయ్యి కరిగించి అందులో ఒక దాని తరువాత మరొకటి మిగిలిన సామానంతా వేసి ఎర్రగా వేపి ఉడికిన్చుకున్న అన్నం లో కలిపేయాలి.
 4. ఇది వేడిగా చల్లాగా ఎలా తిన్నా చాలా రుచిగా ఉంటుంది

టిప్స్:

 • ఇందులో ఇంగువ, సన్నని అల్లం తరుగు కూడా వేసుకోవచ్చు నచ్చితే
 • సెనగపప్పుకి బదులు పెసరపప్పు కూడా వాడుకోవచ్చు.