“చుక్కకూర పచ్చడి” ఇది తెలంగాణా ప్రేత్యేకమైన వంటకం. ఇది నిజామాబాదు, వరంగల్ జిల్లాల్లో చాలా ఎక్కువగా చేస్తుంటారు. పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి నెయ్యన్నం లోకి, ఇంకా చపాతీ, జొన్న రొట్టేల్లోకి చాలా బాగుంటుంది.

కావలసినవి:

 • చుక్కకూర ఆకులు- 100 gms
 • వేరు సెనగపప్పు- ౩ tbsps
 • జీలకర్ర- 1 tsp
 • పచ్చిమిర్చి- 8-10
 • వెల్లూలి- 6-7
 • ఆవాలు- 1 tsp
 • సెనగపప్పు- 1 tsp
 • మినపప్పు- 1 tsp
 • ఎండు మిర్చి- 2
 • కరివేపాకు- 1 రెబ్బ
 • నూనె – 2 tbsps

విధానం:

Directions

0/0 steps made
 1. వేరుసెనగపప్పు ని ఎర్రగా వేపుకోండి, దింపే ముందు జీలకర్ర వేసి వేపి రెండింటి మెత్తని పొడి చేసుకోండి
 2. ఇప్పుడు tbsp నూనె వేడి చేసి వెల్లూలి, పచ్చిమిర్చి వేసి మగ్గనవ్వండి, పచ్చిమిర్చి మగ్గాక అప్పుడు చుక్కకూర వేసి ఆకుని మెత్తగా మగ్గనివ్వండి.
 3. ఆకు మెత్తగా మగ్గాక దింపి మిక్సీ లో వేసుకోండి, దీనితోపాటే మెత్తగా పొడి చేసుకున్న వేరుసెనగపొడి కూడా వేసి మెత్తని పేస్టు చేసుకోండి
 4. ఇప్పుడు మరో చెంచా నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటపటమనిపించి, అప్పుడు సెనగపప్పు, మినపప్పు, రెండు ఎండుమిర్చి, ఓ రెబ్బ కరివేపాకు వేసి వేపి తాలిమ్పుని పచ్చడి లో కలిపేసుకోండి.