చెక్కలు

google ads

చెక్కలు

Author Vismai Food
Chekkalu
చెక్కలు/చెక్కలు రెసిపీ/బియ్యం పిండి చెక్కలు/గారెలు…చెక్కలు అని ఆంధ్రాలో, గారెలు అని తెలంగాణా లో అంటారు. ఇంటికి ఊరికి చేతికి ప్రాంతానికి ఓ తీరులో చేస్తారు. కొందరు కొన్ని వేస్తే ఇంకొందరు ఇంకోటి వేస్తారు. వేసే పదార్ధాల తో రుచి మారిపోతుంది.
నేను ఇది ఆంధ్రా స్టైల్ లో చేస్తున్నా. అందులోనూ మా ఇంట్లో చేసే తీరులో.ఇవి సహజంగా అందరూ బియ్యం పిండి తో చేస్తారు. ఈ మధ్య ఆరోగ్యంగా తినాలి అనే ఉద్దేశంతో చిరుధాన్యాలు( మిల్లెట్స్) కూడా చేస్తున్నారు.
అవి కూడా చాలా రుచిగా ఉంటాయ్. త్వరలో అవీ పోస్ట్ చేస్తా!ఈ చెక్కలలో నేను కారం వాడలేదు. కారమంతా పచ్చిమిర్చి నుండే వస్తుంది. ఇంకా సువాసన కోసం కొత్తిమీర, అల్లం, కరివేపాకు ఇంకా రుచి కోసం సగ్గుబియ్యం, మినపప్పు కూడా వేసాను.
కారం వేసిన చెక్కల రుచికి పచ్చిమిర్చి పేస్టు వేసిన చెక్కల రుచికి చాలా తేడా ఉంటుంది. ఇవి రంగు కూడా తెల్లగా ఉంటాయి కాని, మరీ ఎర్రగా ఉండవు.ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా రావడానికి సరైన కొలతలతో పాటు, వేపే తీరు కూడా చాలా ప్రధానమైంది.
చాలా మంది పిండి చెప్పిన కొలతల్లో కలిపినా, సరిగా వేపకపోవడం వల్ల, మెత్తగా వస్తాయ్. అందుకే ఈ రెసిపీ లో అవన్నీ చాలా వివరంగా చెప్పబోతున్నా టిప్స్ లో.ఈ చెక్కలకి నేను మాములు సోనా మసూరి బియ్యం తో మర ఆడించిన బియ్యం పిండి కాక, కంట్రోల్ లేదా రేషన్ బియ్యం, దోసెల బియ్యం అంటారు ఆ బియ్యంపిండి వాడను.
ఈ పిండి వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయ్ చెక్కలు. ఒకవేళ మీకు ఆ పిండి దొరకలేదంటే మామూలు పిండే వాడుకోండి.బియ్యం పిండి ఒకవేళ మిక్సీ లో గ్రైండ్ చేసుకున్నా, బజార్ నుంచి తెచ్చినది వాడుతున్నా కచ్చితంగా జల్లెడపట్టాలి, లేదంటే రవ్వగా ఉంటాయ్ చెక్కలు.

Tips

చెక్కలు వేసేప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలి, అలా వేపితేనే కరకరలాడుతూ వస్తాయ్, లేదంటే మెత్తగా వస్తాయ్.
రెండో వాయి చెక్కలు వేసేప్పుడు కూడా కాసేపు నూనె మరిగించి ఆ తరువాత మంట తగ్గించి చెక్కలు వేసుకోండి.
చెక్కలు హై-ఫ్లేం మీద లేదా విపరీతమైన వేడి నూనెలో వేసినా రంగోస్తాయ్, కానీ మెత్తగా ఉంటాయ్ చెక్కలు.

Ingredients

 • ½ కిలో బియ్యం పిండి
 • cup గంట నానబెట్టిన సగ్గుబియ్యం
 • ¼ cup గంట నానబెట్టిన మినపప్పు
 • 5 పచ్చిమిర్చి
 • 2 tbsp కొత్తిమీర తరుగు
 • రెండు రెబ్బల కరివేపాకు తరుగు
 • 3 tbsp మరుగుతున్న వేడి నెయ్యి/డాల్డా/నూనె
 • 1.5 tbsp ఉప్పు
 • 1 tbsp జీలకర్ర
 • తగినన్ని నీళ్ళు
 • 1/2 ఇంచ్ అల్లం ముక్క వేసి గ్రైండ్ చేసిన పేస్టు

Instructions

 • ఒకటి రెండు సార్లు జల్లించుకున్న బియ్యం పిండి లో అన్నీ వేసి ఆఖరున మరుగుతున్న నెయ్యి వేసి ముందు బాగా కలుపుకోవాలి
 • ఆ తరువాత తగినన్ని నీళ్ళు పోసి పిండి గట్టిగా కలుపుకోవాలి, ఆ తరువాత ఉసిరికాయ సైజు అంత బాల్స్ చేసుకోవాలి
 • పూరి ప్రెస్ మధ్యలో పైన కింద పోలితీన్ షీట్స్ ఉంచి దానికి నూనె రాసి బియ్యం పిండి ముద్ద ఉంచి ప్రెస్ చేసి తీసుకోవాలి. చెక్కలు పల్చగా ఉండాలి రేకుల్లా.
 • మీ దగ్గర పూరి ప్రెస్ లేనట్లైతే చిన్న బాల్స్ చేసుకుని కప్ లేదా ప్లేట్ కి నూనె రాసి దానితో పిండి ఉండని నొక్కితే సరిపోతుంది
 • బాగా వేడెక్కిన నూనె మంట పూర్తిగా తగ్గించి వత్తుకున్న చెక్కలు వేసి మంట మీడియం ఫ్లేం లో పెట్టి బుడగలు తగ్గేదాకా వేపి తీసి జల్లెడలో ఉంచాలి.
 • ఇలాగే మిగిలినవి వేపుకుని తీసుకోవాలి. వేడి మీద కాస్త మెత్తగా ఉంటాయి, గాలికి ఆరితే కాసేపటికి గట్టి పడతాయ్.
 • ఇవి కనీసం 2 వారాలు వరకు గాలి చొరని డబ్బాలో నిలవుంటాయ్

Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top