చెట్టినాడు అనగానే ముందు అక్కడి వంటకాల ఘాటు గుర్తొస్తుంది. ఏది చేసిన ఓ పిసరన్న దాని ఘాటు మసాలాలు ఉండాల్సిందే! అందుకే తమిళనాడు వారితో పాటు యావత్ దేశం లో అందరు చెట్టినాడు వంటకాలకి అభిమానులుగా మారిపోయారు!
ఈ ఆలూ వేపుడు కూడా చాలా రుచిగా కారంగా కరకరలాడుతూ భలేగా ఉంటుంది. ఇది వేడి వేడి నెయ్యన్నం లో లేదా చారు పప్పుచారుల్లోకి చాలా బాగుంటుంది.

కావలసినవి:

 • ఉడికిన్చుకున్న బంగాలదుంప ముక్కలు- ½ కిలో
 • నూనె- ¼ కప్
 • పసుపు- ¼ చెంచా
 • ఆవాలు- 1 tsp
 • జీలకర్ర- 1 tsp
 • కరివేపాకు- 1 రెబ్బ

మసాలా పొడి కోసం:

 • ధనియాలు- 2 tsps
 • సెనగపప్పు- 1 tbsp
 • మినపప్పు- 1 tsp
 • సోంపు- 1 tsp
 • దాల్చిన చెక్క- 1 ఇంచ్
 • లవంగాలు- 5
 • అనాస పువ్వు- 1
 • మరాటి మొగ్గ- సగం ముక్క
 • ఎండుమిర్చి- 6

విధానం:

Directions

0/0 steps made
 1. మసాలా కోసం ఉంచిన సామానంతా వేసి లో-ఫ్లేం మీద ఎర్రగా మంచి సువాసనోచ్చెంత వరకు వేపి కాస్త బరకగా పొడి చేసుకోండి
 2. ఇప్పుడు నూనె వేడి చేసి అందులో ఆవాలు జీలకర్ర, కరివేపాకు రెబ్బలు, పసుపు వేసి వేపి ఉడికించి ముక్కలుగా చేసుకున్న బంగాళా దుంపల ముక్కలు వేసి మీడియం ఫ్లేం మీద క్రిస్పీగా వేపుకోండి
 3. బంగాలదుంపలు మీడియం ఫ్లేం మీద వేపుకోండి, ఎర్రగా వేగడానికి కనీసం 20 నిమిషాలు పైన టైం పడుతుంది
 4. ఎర్రగా వేగాక ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసి కలుపుకుని ౩-4 నిమిషాలు వేపుకుని దిమ్పెసుకోవడమే.

టిప్స్:

 • దుమపాలని మరీ మెత్తగా ఉదికిన్చాకండి, మెత్తగా ఉడికితే వేగేప్పుడు కలిపెప్పుడు చిదురవుతాయ్ ముక్కలు
 • ఈ వేపుడు నాన్ స్టిక్ పాన్ లో వేపెకంటే కాస్ట్ఐరన్ ముకుల్లలో వేపితే చాలా బాగా వేగుతాయ్
 • మసాలా పొడి చాలా ఘాటుగా ఉంటుంది మీకు తగ్గట్లు తగ్గించుకుని వేసుకోండి లేదా పెంచుకోండి