“చేగోడీలు” మాంచి టైం పాస్ స్నాక్. ఇది ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కర్ణాటక లోకూడా చేస్తారు. మనకీ ఈ చేగోడీలు రెండు మూడు రకాలున్నాయ్. అందులో ఒకటి ఇది. ఓ సారి చేసి డబ్బాలో ఉంచుకుంటే కనీసం 10 రోజులు నిలవుంటాయ్. కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయ్. సహజంగా ఈ చేగోడీలు కొందరికి మెత్తగా వస్తుంటాయ్, కాని మా టిప్స్ ఫాలో అయితే కచ్చితంగా కరకరలాడుతూ వచ్చితీరుతాయ్!

కావలసినవి:

 • నీళ్ళు- 250 ml
 • నెయ్యి/డాల్డా- 1 tbsp
 • వాము- 1 tsp
 • నువ్వులు- 1 tsp
 • పసుపు- ½ tsp
 • సాల్ట్
 • మైదా- 250 gms
 • నూనె- వేయించడానికి సరిపడా

విధానం::

Directions

0/0 steps made
 1. నీళ్ళని మరిగించాలి. నీళ్ళు కాగుతున్నపుడు మైదా తప్ప అన్నీ వేసి నీళ్ళని తెర్లనివ్వండి
 2. నీళ్ళు తెర్లుతున్నప్పుడు మైదా వేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకొండి
 3. వేడి మీదే పిండి బాగా వత్తుకోవాలి, లేదంటే చెకోడీలు సరిగా రావు విరిగిపోతాయ్
 4. వేడి మీదే ఓ తడి గుడ్డ పిండి మీద కప్పి, గుడ్డతో సహా వత్తుతూ పిండిని బాగా కలుపుకొండి, ఇలా చేస్తే సులువుగా ఉంటుంది వేడి మీద వత్తుకోవడానికి
 5. పిండి బాగా కలుపుకున్నాక కారప్పూస గిద్దలో పెద్ద రంద్రాలుండే మౌల్ద్ పెట్టి లోపల నెయ్యి రాసి పిండి ముద్ద ఉంచి పూర్తిగా ఓ ప్లేట్ లో, లేదా బల్ల మీద వత్తుకోండి
 6. ఇప్పుడు వత్తుకున్న వాటిని వెలికి చుట్టుకుని అంచులని సీల్ చేస్తూ చిన్న చిన్న రింగ్స్ గా చేసుకోండి
 7. ఇలాగే అన్నీ రెడీ చేసుకోండి. మౌల్ద్ లేకపోతే చేత్తోనే ముందు పిండిని పొడవుగా సన్నగా వత్తుకుని తరువాత రింగ్స్ గా చేసుకోండి
 8. ఇప్పుడు నూనె బాగా వేడెక్కాక నూనె ఓ చిల్లుల గారిట పెట్టి దాని మీద చేగోడీలు వేసుకోండి
 9. ఆ గరిట ఓ నిమిషం పాటు నూనె లోనే ఉంచి హై-ఫ్లేం మీద వేగనివ్వండి చెకోడీలని
 10. ఇప్పుడు గరిట తీసేసి చేగోడీలను హై ఫ్లేం మీద 3-4 నిమిషాలు వేగనిచ్చి, తరువాత నిదానంగా మీడియం-ఫ్లేం మీద వేపుకోండి. కాస్త రంగు మారక హై మీద వేపితే క్రిస్పీగా వేగుతాయ్. అప్పుడు తీసి టిష్యూ నాప్కిన్ మీద వేసుకోండి
 11. పూర్తిగా చల్లారాక డబ్బాలో పెట్టుకోండి

టిప్స్:

 • 250ml నీళ్ళు 250 gms ఒక కొలత కాదు, నీళ్ళకంటే కొంచెం ఎక్కువ మైదా తీసుకోండి
 • ఇందులో నెయ్యి కంటే డాల్డా వేస్తే చెకోడీలు బాగా క్రిస్పీగా వస్తాయ్. వద్దనుకుంటే నెయ్యే వేసుకోండి
 • పిండిని బాగా వత్తుకోకపోతే లోపల గాలి ఉండిపోయ చేకోడీలు విరిగిపోతాయ్
 • రింగ్స్ గా చుట్టుకున్న చేగోడీలను నూనె లో గరిట పెట్టకుండా వేస్తే చేగోడీలు బరువుండి, అడుగుకి వెళ్లి అంటుకుని మాడిపోతాయ్
 • కాబట్టి 2 నిమిషాలు గరిట మీద హై-ఫ్లేం మీదే వేపి ఆ తరువాత కాసేపు మీడియం-ఫ్లేం మీద వేపితే క్రిస్పీగా వస్తాయ్
 • కాస్త రంగు మారగానే హై ఫ్లేం మీద వేపుకోండి, అప్పుడు చక్కటి రంగోస్తాయ్
 • నూనె లోనే మరీ ఎర్రగా వేపితే బయటకు తీసాక మరీ ముదురు రంగులోకోస్తాయ్