జీరా బిస్కెట్స్ ఇవి మాంచి టైం పాస్ స్నాక్స్! మా టిప్స్ తో కొలతల్లో చేస్తే బేకరీ వాళ్ళకంటే కచ్చితంగా చాలా చేస్తారు! ఇవి మీరు టీ టైం లో మాంచి టైం పాస్. ఈ రెసిపీ లో నేను ఓవెన్ లేకుండా ఎలా చేయాలో రెసిపీ ఆఖరున ఉంచాను చుడండి!!

కావలసినవి:

 • మైదా- 150 gms
 • ఐసింగ్ షుగర్/ జల్లించుకున్న పంచదార పొడి- 50gms
 • బటర్/నెయ్యి- 150 gms
 • సాల్ట్- ½ tsp
 • జీలకర్ర- 1 tbsp

విధానం:

 1. మైదా, ఐసింగ్ షుగర్, సాల్ట్, కస్టర్డ్ పౌడర్ వేసి జల్లించండి.
 2. ఇప్పుడు జల్లించిన పిండిలో మెత్తని బటర్ వేసి మెత్తని పిండి గా కలుపుకుని ఓ ఎయిర్ టైట్ బాగ్ లో పెట్టి 2 గంటలు ఫ్రిజ్ లో ఉంచేయండి
 3. 2 గంటలు తరువాత జీలకర్ర వేసి బాగా కలుపుకుని గోలి సైజు బాల్స్ గా చేసుకోండి
 4. ఇప్పుడు బేకింగ్ ట్రే మీద మైదా చల్లి పిండి బాల్స్ ని ట్రే మీద ఇంచ్ గ్యాప్ లో సర్దుకోండి
 5. ఇప్పుడు ఫోర్క్ ని మైదా లో ముంచి పిండి ముద్దని నెమ్మదిగా ప్రెస్ చేయండి.
 6. ఇప్పుడు ఈ ట్రే ని ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో 180 డిగ్రీస్ దగ్గర 18-22 నిమిషాల పాటు బేక్ చేసుకోండి.
 7. ఆ తరువాత తీసి చల్లార్చుకోండి
 8. ఓవెన్ లేకుండా:

  Directions

  0/0 steps made
 1. ఓవెన్ లేకుండా చేయాలనుకునే వారు ప్రెషర్ కుక్కర్ కి గ్యాస్ కట్ తీసి కుక్కర్ లో ఇసుక పోసి మూత పెట్టి 15 నిమిషాలు లో-ఫ్లేం మీద వేడి చేయండి.
 2. ఇప్పుడు బిస్కెట్ బాల్స్ పెట్టుకున్న ప్లేట్ ని కుక్కర్ లో పెట్టి 30 నిమిషాలు లో ఫ్లేం మీద బేక్ చేసుకోండి.
 3. 30 నిమిషాల తరువాత తీసి చల్లార్చుకోండి. ఆ తరువాత ఎయిర్- టైట్ డబ్బాలో పెట్టుకోండి

టిప్స్:

 • బటర్ కి బదులు నెయ్యి కూడా వాడుకోవచ్చు
 • కుక్కర్ లో చేసుకునే వారు గాస్ కట్ తీసి బేక్ చేసుకోవాలి