“రాయలసీమ స్పెషల్ జొన్న ముద్ద” జస్ట్ 10 అంటే 10 నిమిషాల్లో తయారయ్యే ఆరోగ్యకరమైన రెసిపీ. ఇది లంచ్, డిన్నర్, టిఫిన్స్ ఇలా ఎలాగైనా తీసుకోవచ్చు. బ్యాచీలర్స్ కూడా సులువుగా చేసుకోవచ్చు. ఇది పప్పు, సాంబార్, సెనక్కాయల పచ్చడి ఇంకా గుడ్డు పులుసు, కోడి కూర, మటన్ కర్రీ, తలకాయ కూర ఇలా దేనితో అయినా చాలా రుచిగా ఉంటుంది. వేసవి కాలం లో చిక్కటి మజ్జిగతో తింటే ఎంతో హాయిగా అనిపిస్తుంది పొట్టకి.ఇది రాయలసీమ తో పాటు, ఉత్తర కర్నాటక ప్రాంతాల్లో చాలా ఫేమస్, కాని ఎందుకో రాగి సంగటి అంత ఫేమస్ అవ్వలేదు, హోటల్స్ కూడా అమ్మడం నేను చూడలేదు, ఇళ్లకే పరిమితమైంది. రుచి మాత్రం చాలా గొప్పగా ఉంటుంది.

కావలసినవి:


 • జొన్న పిండి- 1 కప్
 • నీళ్ళు- 2 కప్స్
 • ఉప్పు- తగినంత
 • నూనె- ½ tsp

విధానం:

Directions

0/0 steps made
 1. నీళ్ళలో, ఉప్పు నూనె వేసి తెర్లకాగానివ్వండి
 2. నీళ్ళు తెర్లుతున్నప్పుడు మాత్రమే జొన్న పిండి కొద్దికొద్దిగా వేసుకుంటూ బాగా కలపాలి.
 3. మంట మీడియం ఫ్లేం లోకి పెట్టి గడ్డలను మెదుపుతూ బాగా కలుపుతూ పిండి ముద్దగా మారేదాకా కలపాలి, మీడియం ఫ్లేం మీద.
 4. గట్టి ముద్దగా మారక స్టవ్ ఆపేసి, మూత పెట్టి 5 నిమిషాలు వదిలేయాలి
 5. పిండి ఇంకా వెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి , లేదా తడి చేసుకున్న చేతులతో ముద్దలుగా తట్టుకోవాలి.
 6. ఇది వేడివేడిగా చాలా రుచిగా ఉంటాయి.

టిప్స్:

 • అసలు కొలత కప్ పిండికి 2 కప్స్ నీళ్ళు కాని ఎప్పుడూ కాస్త పిండి ఎక్కువ ఉంచుకోవడం అవసరం, ఒక్కోసారి నీళ్ళని మరిగించే టైంని బట్టి కూడా అవసరం అవుతుంది పిండి.