వీకెండ్ వస్తే అందరు నాన్ వెజ్ కోసం చూస్తారు. ఎప్పుడు చేసుకునే నాన్ వెజ్ కర్రీ తిని విసిగిపోతే ఇది పర్ఫెక్ట్ కర్రీ. ఇది చేయడం చాలా తేలిక. అట్టు, చపాతీ, పూరీ లేదా వేడి వేడి అన్నం లోకి చాలా బాగుంటుంది. పెద్దగా టైం కూడా పట్టదు. ఎప్పుడు చేసినా అందరికి నచ్చేస్తుంది. తప్పక ట్రై చేయమని రికమండ్ చేస్తున్నాం.

కావలసినవి:

  • చికెన్- 500 gms ( గంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టినది)
  • నాటు టమాటోలు- ½ కిలో
  • ఉల్లిపాయ తరుగు- 150 gms
  • పచ్చిమిర్చి చీలికలు- 3
  • కరివేపాకు- 1 రెబ్బ
  • కొత్తిమీర తరుగు- 2 tsps
  • ఆవాలు- ½ tsp
  • జీలకర్ర- ½ tsp
  • ఎండు మిర్చి- 2
  • ఉప్పు
  • పసుపు- ½ tsp
  • కారం- 2 tsps
  • గరం మసాలా- 1 tsp
  • అల్లం వెల్లులి పేస్ట్- 1 tbsp
  • నూనె- 1/3 కప్

విధానం:

Directions

0/0 steps made
  1. నూనె వేడి చేసి అందులో 2 పండిన టమాటో పెద్ద ముక్కలు వేసి ౩ నిమిషాలు ఫ్రై చేసి తీసి పక్కనుంచుకోండి.
  2. ఇప్పడు అదే నూనె లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి వేపుకోండి.
  3. ఇప్పుడు ఉల్లిపాయ తరుగు వేసి ఎర్రగా వేపుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ రాగానే అప్పుడు అల్లం వెల్లూలి పేస్టు వేసి 1 నిమిషం పాటు వేపుకోండి.
  4. ఇప్పుడు మిగిలిన టొమాటోల పేస్టు వేసి టమాటోలలోంచి పచ్చివాసన పోయి కూర దగ్గర పడే దాకా ఫ్రై చేసుకోండి. దీనికి కాస్త టైం పడుతుంది.
  5. టమాటో గుజ్జు మగ్గి దగ్గర పడ్డాక అప్పుడు పచ్చిమిర్చి చీలికలు, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వేసి బాగా కలుపుకోండి.
  6. ఇప్పుడు ఉప్పు నీళ్ళలో నానా బెట్టిన చికెన్ వేసి బాగా కలుపుకుని 4 నిమిషాల పాటు హై ఫ్లేం మీద ఫ్రై చేసుకోండి.
  7. ముక్కల్లోంచి నీరు వదిలిన తరువాత అప్పుడు పావు లీటర్ నీళ్ళు పోసి మీయం ఫ్లేం మీద కూర దగ్గర పడేదాకా కుక్ చేసుకోండి.
  8. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. కూర సగం పైన మగ్గాక అప్పుడు ఫ్రై చేసి పక్కనున్చుకున్న టమాటో ముక్కలు కరివేపాకు వేసి కూరలోంచి నూనె పైకి తేలేదాకా లో-ఫ్లేం మీద కుక్ చేసుకోండి.
  9. నూనె పైకి తేలాక అప్పుడు కొత్తిమీర చల్లుకుని దిమ్పెసుకోండి.

టిప్స్:

  • ఈ కురకి కాస్త నూనె ఎక్కువుంటేనే రుచి.
  • చికెన్ ఉప్పు నీళ్ళలో నానబెడితే ముక్క సాఫ్ట్ అయి జుసీ గా ఉంటుంది.
  • నాటు టొమాటోలు వాడితేనే పులుపు ఉంటుంది కూరలో.
  • టమాటోలు బాగా మగ్గితేనే అసలు రుచి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది.