టమాటో పరాట

google ads

టమాటో పరాట

Author Vismai Food
Cuisine Indian
tamoto-parota
పిల్లల లంచ్ బాక్సులకి, పొద్దున్నే టిఫిన్స్ కి మా స్పెషల్ “టమాటో పరాటా” కంటే బెస్ట్ పరాటా ఉంటుందా!!! చాన్స్ లేదండి. ఈ మాట తిన్నాక మీరే అంటారు. అవును మరి అంత తక్కువ టైం లో రుచిగా ఉండే టిఫిన్స్ అవుతుంటే ఎవరు కాదనగలరు ఈ పరాటాని. ఈ పరాటా మామూలు పరాటాల్లా ఉంటాడు.
సాఫ్ట్ గా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. సహజంగా గంటల గడుస్తుంటే గట్టిగా అవుతాయ్ పరాటాలు. కానీ, ఇవి చాలా సాఫ్ట్ గా ఉంటాయ్.ఈ “టమాటో పరాట” విస్మయ్ ఫుడ్ కిచెన్ లో ఎన్నో సార్లు ప్రయోగం చేసి సెట్ చేసిన రెసిపీ.
టెస్ట్ కోసం ఏవేవో వేసి చేయడం కాకుండా, తక్కువ పదార్ధాలతో గొప్ప ఫ్లేవర్స్ తో సెట్ చేసిన రెసిపీ.టిఫిన్స్ కోసం ఎప్పుడూ తినే పూరి, ఇడ్లీ, అట్టు, గారెలు కాకుండా ఈ టమాటో పరాట చేయండి. తక్కువ టైం లో అయిపోతుంది, అందరికీ నచ్చేస్తుంది. మీరు పిల్లల లంచ్ బాక్సులకి కూడా పంపొచ్చు.
మధ్యాన్నానికి కూడా సాఫ్ట్ గా ఉంటాయ్.ఈ పరాటాలు ఏదైనా కూరతో కంటే కమ్మని పెరుగుతో చాలా బాగుంటుంది.

Tips

టమాటోలు ఎర్రవి పుల్లనివి వాడుకోండి. దాని వల్ల మంచి రంగు, రుచి ఉంటుంది.
టమాటో పేస్టు మెత్తగా ఎక్కడా పలుకులు లేకుండా పేస్టు చేసుకోవాలి.
నీళ్ళతో పేస్టు చేయకండి. టొమాటోలలోని నీరు సరిపోతుంది.
సోంపు, వాము ఏమాత్రం ఎక్కువైనా అంత రుచిగా ఉండదు పరాటా.
నేను వాడిన టమాటోకి సరిగా 1.5 కప్పుల గోధుమ పిండి సరిపోతుంది. ఒకవేళ పిండి జారైతే ఇంకాస్త పిండి కలుపుకోవోచ్చు, ఉప్పుతో అడ్జస్ట్ చేసి.
సాధారణంగా పరాటాలు, చపాతీలకి 30 నిమిషాలు పిండి నానాలి. ఈ టమాటో పరాటా కి 10 నిమిషాలు నానితే సరిపోతుంది.
ఎక్కువ సేపు నానితే టమాటో వల్ల పిండి జారై అయిపోతుంది.
పరాటాలు వేడి పెనం మీద వేసి ముందు రెండు వైపులా కాల్చుకోండి. ఆ తరువాతే నూనె వేసి కాల్చాలి
పెనం వేడిగా లేకుండా పరాటాలు వేస్తే అప్పడాల్లా అవుతాయ్.

Ingredients

 • 1.5 cup గోధుమ పిండి-
 • 2 పుల్లని ఎర్రని టమాటో
 • 2 పచ్చి మిర్చి
 • ½ ఇంచ్ అల్లం
 • 5 వెల్లూలి
 • ¼ tbsp సోంపు
 • ¼ tbsp వాము
 • ఉప్పు
 • 1 tbsp కొత్తిమీర తరుగు
 • cup నూనె

Instructions

 • మిక్సీ లో టమాటో, పచ్చిమిర్చి, అల్లం, వెల్లూలి, సోంపు వేసి నీరు వేయకుండా మెత్తని పేస్టు చేసుకోవాలి.
 • పళ్ళెంలో టమాటో పేస్టు, నలిపిన వాము, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి.
 • గోధుమ పిండి వేసి ఎక్కువ సేపు అంటే 4-5 నిమిషాలు వత్తుకోవాలి.
 • 3 నిమిషాల తరువాత 1 tsp నూనె వేసి వత్తుకోవాలి. వత్తుకున్న పిండి ని తడి గుడ్డ కప్పి 10 నిమిషాలు వదిలేయాలి.
 • 10 నిమిషాల తరువాత కొద్దిగా పిండి చల్లి చిన్న ముద్దలుగా చేసుకోండి.
 • మళ్ళీ కాస్త పొడి చల్లి పరాటాల్లా వత్తుకోండి.
 • వేడి పెనం మీద పరాటాలు వేసి ముందు రెండు వైపులా కాల్చి ఆ తరువాత 1 tsp చొప్పున నూనె వేసుకుంటూ కాల్చుకోవాలి.
 • ఇవి కమ్మని పెరుగుతో చాలా రుచిగా ఉంటాయ్

Video

టమాటో పరాట

Course Breakfast

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top