టమాటో రసం
తిన్నకొద్దీ తినాలనిపించే పుల్లని ఘాటైన రసం "టమాటో రసం". టమాటో రసం చేసిన రోజున కచ్చితంగా నాలుగు ముద్దలు ఎక్కువగా తింటారు. అలాంటి టమాటో చారు తినాలంటే ఈ కొలతలతో చేయండి.
ఎన్ని స్పెషల్ రేసిపీస్తో భోజనం చేసినా నాలుగు ముద్దలైనా రసంతో ముగిస్తే ఆ తృప్తే వేరు. అందులోనూ అందరకీ ఎంతో ఇష్టమైనా టమాటో చారు రుచి ప్రత్యేకంగా చెప్పాలా. చారు చేయడం చాలా తేలికే కాని, కొన్ని కచ్చితమైన టిప్స్ పాటిస్తేనే ఎప్పుడు చేసినా పక్కాగా ఒకే తీరుగా వస్తుంది చారు రుచి.
మాంసం కూరలు చేసిన రోజున ఈ స్టైల్ లో టమాటో రసం చేసి చూడండి తృప్తిగా ముగిస్తారు భోజనం!
చారులు ఎన్నో ఎన్నో రాకలున్నాయ్, కానీ సరైన కొలతలతో సరైన తీరులో మరిగిస్తేనే అసలు రుచి. ఆ టిప్స్ అన్నీ కింద టిప్స్ లో వివరంగా ఉంచాను చుడండి.
Tips
- టమాటో చారుకి నాటు టొమాటోలు రుచిగా ఉంటాయ్. హైబ్రీడ్ టొమాటోల కంటే కూడా.
- టమాటో ముక్కలు చేత్తో పిండి సారన్నీ తీస్తే, కొద్దిగా పలుకులు అక్కడక్కడ తగులుతూ ఉంటాయ్.
- టమాటోలతో పాటు కొత్తిమీర కాడలు కూడా కలిపి పిండితే ఆ కాడల్లోని సారం ఎంతో రుచినిస్తుంది.
- టమాటోలలో వేసిన పచ్చిమిర్చి ముక్కలు మెత్తబడే దాక మరిగిస్తే చాలు. అంతకంటే ఎక్కువ మరిగితే టమాటోలలోని రుచి పోతుంది
- నాటు టొమాటోలు పుల్లనివి అయితే 2 tsps చింతపండు గుజ్జు సరిపోతుంది, అదే హైబ్రీడ్ టొమాటోలు వాడితే చింతపండు గుజ్జు కాస్త ఎక్కువ పడుతుంది
- చారులకి పులుసులకి ఎప్పుడూ రాళ్ల ఉప్పు రుచిని పెంచుతుంది
Ingredients
- 4 పండిన నాటు టొమాటోలు
- చిన్న కట్ట కొత్తిమీర కాడలు
- 2 tsps చింతపండు గుజ్జు
- 2 పచ్చిమిర్చి చీలికలు
- ¼ tsp పసుపు
- రాళ్ళ ఉప్పు
- 1 tsp జీలకర్ర
- 1.5 tsps మిరియాలు
- 10 వెల్లూలి
తాలిమ్పుకి:
- 2 tbsps నూనె
- 1 tsp ఆవాలు
- 1 tsp మినపప్పు
- 3 ఎండుమిర్చి
- 1 రెబ్బ కరివేపాకు
- 2 చిటికెళ్ళ ఇంగువా
Instructions
- మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లూలి వేసి కచ్చాపచ్చాగా దంచి పక్కనున్చుకోవాలి
- పండిన టమాటో ముక్కలని కొత్తిమీర కాడలని గట్టిగా పిండి సారాన్ని పిండి పిప్పిని తీసెయ్యండి
- టమాటో గుజ్జులో నీళ్ళు పోసి కలిపి గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టుకోండి
- టమాటో రసం లోనే పసుపు, ఉప్పు పచ్చిమిర్చి చీలికలు వేసి పచ్చిమిర్చి మెత్తబడే దాక మీడియం ఫ్లేం మీద మరగనివ్వాలి
- పచ్చిమిర్చి మెత్తబడ్డాక దంచిన మిరియాలు వెల్లూలి ముద్దా వేసి ఓ పొంగు వచ్చేదాకా మరగనిచ్చి దిమ్పెసుకోవాలి
- తాలిమ్పుకి నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటపటమన్నాక మిగిలినవి ఒక్కోటిగా వేస్తూ ఎర్రగా వేపి చారులో కలిపి దిమ్పెసుకోండి
Video