డ్రాగన్ చికెన్

google ads

డ్రాగన్ చికెన్

Author Vismai Food
Dragon-chicken
“డ్రాగన్ చికెన్” బెస్ట్ చికెన్ స్టార్టర్! కరకరలాడుతూ కారంగా ఘాటుగా ఉంటుంది. మనకు ఎంతో నచ్చేలా ఉంటుంది.ఇది ఇండో-చైనీస్ ఫేమస్ రెసిపీ. చైనీస్ రెస్టారంట్ లో ఎక్కువమంది ఆర్డర్ చేసే లిస్టు లో ఇదే ముందుంటుంది.
అన్నింటికీ మించి మనకు అంటే తెలుగు వారికి నచ్చేలా ఉంటుంది కారంగా.మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే నేను చేసే కొలతకి రెండింతలు చేసుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.నేను మొదటి సారి నా చిన్నప్పుడు హైదరాబాద్ లోని NAANKING అని సికిందరాబాద్ లో ఉండే ఏకైక చైనీస్ రెస్టారంట్ లో తిన్నా! చాలా నచ్చేసింది ఆ తరువాత ఓ చైనీస్ చెఫ్ ని అడిగి తెలుసుకున్నా,
కానీ ఎందుకో అనుకున్న తీరులో లేదు రిసల్ట్, సో నా ప్రయత్నం నేను చేసి ఎలాగో సాధించా. నాకు చెఫ్ తప్పు చెప్పాడని కాదు కొలతలు పైకి కిందికి అయ్యాయి అంతే!నేను ఎప్పుడు చైనీస్ చేసినా వాడే ఆరోమేటిక్ పౌడర్ గురుంచి అందరూ నన్ను అడుగుతూనే ఉంటారు ఎక్కడ దొరుకుతుంది అని? నేను ఇది ఆన్లైన్ లో కొన్నా, ఇది అజినోమోటో కి బదులుగా నేను చేసే ప్రతీ చైనీస్ లో దాదాపుగా వాడుతున్నా.
అజినోమోతో అనారోగ్యం అని ఓ ప్రచారం ఉంది, ఆ టైం లోనే నాకు దీని గురుంచి తెలిసింది అప్పటి నుండి వాడుతున్నా, ఇందులో కూడా అజినిమోతో లో ఉండే ప్రధానమైన పదార్ధం ఉంది కాని చాలా తక్కువ శాతం లో.
ఒకవేళ ఇది మీకు దొరకనట్లితే వదిలేయండి ఏమి ఇబ్బంది లేదు.

Tips

బోన్ లెస్ చికెన్ అంటే ఏదైనా ఎముక లేనిది దీనికి బాగుండదు, కేవలం చికెన్ బ్రెస్ట్ ని పొడవుగా కట్ చేసుకోవాలి, అప్పుడే దీనికి రుచి
చికెన్ ని ఉప్పు వేసిన నీళ్ళలో నానబెడితే ముక్క మెత్తబడి ఫ్లేవర్స్ బాగా పడతాయ్.
చైనీస్ ఎప్పుడు హైఫ్లేం మీద టాస్ చేసుకోవాలి
నేను వాడిన చైనీస్ చిల్లి పేస్టు లేకపోతే షేజ్వాన్ సాస్ లేదా రెడ్ చిల్లి సాస్ వాడుకోవాలి, కారం మాత్రం వాడకూడదు.

Ingredients

 • 300 gms బోన్ లెస్ చికెన్
 • ½ tbsp డార్క్ సోయా సాస్
 • ఉప్పు
 • 1 tbsp మైదా
 • 1 tbsp కార్న్ ఫ్లోర్
 • ½ tbsp తెల్ల మిరియాల పొడి
 • 1 tbsp గిలకొట్టిన ఎగ్
 • వేపుకోడానికి నూనె

చికెన్ టాసింగ్ కి:

 • 2 tbsp నూనె
 • ¼ cup జీడిపప్పు
 • 4 ఎండు మిర్చి
 • 3 వెల్లూలి- 3 సన్నని తరుగు
 • 1 tbsp అల్లం
 • 1 tbsp ఉల్లిపాయ సననితరుగు
 • ¼ cup గ్రీన్ కాప్సికం చీలికలు
 • ¼ cup ఎల్లో కాప్సికం చీలికలు
 • ¼ cup రెడ్ కాప్సికం చీలికలు
 • ¼ cup ఉల్లిపాయ చీలికలు
 • ¾ tbsp నల్ల మిరియాల పొడి
 • 1 tbsp తెల్ల మిరియాల పొడి
 • 1 tbsp ఆరోమేటిక్ పొడి
 • ½ tbsp డార్క్ సోయా సాస్
 • 1 tbsp వెనిగర్
 • 1 tbsp టమాటో సాస్
 • 1 tbsp చైనీస్ చిల్లీ పేస్టు-
 • 2 tbsp నీళ్ళు
 • 2 tbsp స్ప్రింగ్ ఆనియన్ తరుగు
 • ½ tbsp తెల్ల నువ్వులు

Instructions

 • చికెన్ బ్రెస్ట్ ని పొడవుగా ఫ్రెంచ్ ఫ్రైస్ లా కట్ చేసుకున్న చికెన్ ని 30 నిమిషాలు ఉప్పు వేసిన నీటి లో నానబెట్టిన దాంట్లో ఉప్పు తో పాటు అన్నీ వేసి బాగా కోటింగ్ ఇవ్వాలి
 • ఈ కోటింగ్ గట్టిగా పకోడీల్లా ఉండకూడదు, జారుగా ఉండాలి
 • తరువాత వేడి నూనె లో వేసి మీడియం ఫ్లేం మీద క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేయాలి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేం మీద ఆ తరువాత హై ఫ్లేం మీద ఫ్రై చేస్తే లోపలి దాక ఎర్రగా వేగుతాయ్
 • పాన్ లో నూనె వేడి చేసి అందులో ఎండుమిర్చి ఉల్లిపాయ, అల్లం, వెల్లూలి తరుగు వేసి హై ఫ్లేం మీద మాత్రమే బాగా టాస్ చేస్తూ ఉల్లిపాయ తరుగు మెత్తబడే దాక ఫ్రై చేయాలి
 • ఆ తరువాత జీడిపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి హై ఫ్లేం మీద కలుపుతూ
 • ఆ తరువాత 3 రంగుల కాప్సికం చీలికలు, ఉల్లిపాయ చీలికలు వేసి 2 నిమిషాలు బాగా టాస్ చేసుకోవాలి
 • ఇప్పుడు నల్ల మిరియాల పొడి, తెల్ల మిరియాల్ పొడి, ఆరోమేటిక్ పొడి, ఉప్పు, సోయా సాస్ వేసి 1 tbsp నీళ్ళు పోసి బాగా టాస్ చేస్తే ఫ్లేవర్స్ బాగా పడతాయ్, ఆ తరువాత వెనిగర్ టమాటో సాస్, చిల్లి సాస్ వేసి బాగా కోట్ చేసుకోవాలి
 • ఆ తరువాత వేపుకున్న చికెన్ వేసి 2 నిమిషాలు హై ఫ్లేం మీద టాస్ చేస్తే ఫ్లేవర్స్ బాగా పడతాయ్, అప్పుడు 2 tsps నీళ్ళు వేసి సాసులు చికెన్ కి పట్టించాలి హై ఫ్లేం మీద. చికెన్ మరీ డ్రై అయ్యేదాకా పట్టించకూడదు
 • దింపే ముందు తరిగిన ఉల్లికాడల తరుగు, నువ్వులు చల్లి సర్వ్ చేసుకోవాలి

Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top