తమిళనాడు స్పెషల్ ఉల్లిపాయ పచ్చడి

google ads

తమిళనాడు స్పెషల్ ఉల్లిపాయ పచ్చడి

Author Vismai Food
ONION CHUTNEY
అట్టు,ఇడ్లీ లోకి తిన్నకొద్దీ తినాలనిపించే కారం చట్నీ ఈ ఉల్లిపాయ చట్నీ. ఐదు అంటే ఐదు నిమిషాల్లో రెడీ. ఉల్లిపాయ పచ్చళ్ళు మన దేశమంతాటా ఉన్నాయ్. ఒక్కో ప్రాంతం ఒక్కో తీరులో చేస్తారు. ఆంధ్రలో గుంటూర్, ప్రకాశం, నెల్లూర్, రాయలసీమ ప్రాంతాల్లో పచ్చిగా ఉల్లికారం పచ్చడి చేస్తారు. అది ఇంకా సింపుల్. కానీ, నిలవుండదు ఇంకా అచ్చంగా కారంగానే ఉంటుంది పచ్చడి, మరింకే రుచి ఉండదు. కానీ ఈ పచ్చడి పుల్లగా, కారంగా, ఘాటుగా, తియ్యగా ఉంటుంది. ఇంకా నిలవుంటుంది పచ్చడి. తమిళనాడులో బండ్ల మీద అట్టు ఇడ్లీ లోకి ఇచ్చే ఎన్నో రకాల పచ్చళ్ళలో ఇదీ ఒకటి. చాలా రుచిగా ఉంటుంది తప్పక ట్రై చేయండి.

Tips

 • అసలుకైతే "దేగీ మిర్చి" అనే వెరైటీ వాడతారు, కారం తక్కువ రంగు ఘాటు ఎక్కువ. నా దగ్గర అవి లేక మామూలు ఎండు మిర్చి వాడాను.
 • మీరు కావాలంటే ఎండు మిర్చి మీకు తగినట్లుగా మీ ఇష్టానికి ఎక్కువతక్కువలు చేసుకోవచ్చు
  నేను ఎండు మిర్చి ముప్పై నిమిషాలు నానబెట్టాను, మీరు వెంటనే చేసుకోవాలనుకుంటే 5 నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచి వాడుకోవచ్చు
 • బెల్లం వేస్తే ఫ్లేవర్స్ అన్నీ చక్కగా బాలన్స్ అవుతాయ్, ఇంకా చాలా రుచిగా ఉంటుంది.
 • తాలిమ్పుకి కాస్త నూనె ఎక్కువగా ఉంటె రుచిగా ఉంటుంది, ఇంకా నిలవుంటుంది పచ్చడి
  తాలింపు కూడా కరకరలాడుతూ ఉంటెనే బాగుంటుంది

Ingredients

 • 8-10 ఎండుమిర్చి
 • 1 పెద్ద ఉల్లిపాయ/2 చిన్న ఉల్లిపాయలు
 • గోలీ సైజు చింతపండు
 • నిమ్మకాయ సైజు బెల్లం ముక్క
 • రుచికి సరిపడా ఉప్పు
 • 3 tsps నూనె
 • 1/2 tsp ఆవాలు
 • 1 tsp మినపప్పు
 • 2 ఎండు మిర్చీ
 • చిటికెడు ఇంగువా
 • 1 రెబ్బ కరివేపాకు

Instructions

 • మిక్సీ లో నానబెట్టిన ఎండుమిర్చి, పెద్ద ఉల్లిపాయ, చింతపండు, బెల్లం, ఉప్పు వేసి నీళ్ళతో మెత్తగా గ్రైండ్ చేసుకోండి
 • నూనె వేడి చేసి అందులో ఆవాలు మినపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి. అలాగే ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువా వేసి వేపుకోవాలి
 • తాలింపు వేగాక మిర్చి - ఉల్లిపాయ పేస్టు వేసి కాసేపు వేపి దిమ్పెసుకోండి.
 • కాస్త నూనె ఎక్కువగా ఉంటె పచ్చడి నిలవుంటుంది

Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top